S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/09/2018 - 03:27

కందుకూరు, సెప్టెంబర్ 8: ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు వామపక్షాలు ప్రత్యామ్నాయానికి సమాయత్తం అవుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన అనంతపురంలో ప్రారంభమైన రాజకీయ ప్రత్యామ్నాయ మహాగర్జన బస్సు యాత్ర శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది.

09/08/2018 - 12:39

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని శుక్రవారం అర్థరాత్రి దేవరాతిగూడెం సమీపంలో ఉన్న ఏ1 రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో దాడి చేశారు. ఈ దాడిలో విజయవాడకు చెందిన ఇరవై మంది అబ్బాయిలను, విశాఖపట్నంనకు చెందిన ఎనిమిది మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్స్ నిర్వహకుడు మహర్షి అలియాస్ బాబ్జీని పోలీసులు అరెస్టు చేశారు.

09/08/2018 - 02:41

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 7: కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు వారగా నిలుచున్న ఆటోను లారీ ఢీకొనడంతో కడప జిల్లాకు చెందిన షేక్ హాజీపీరా(45), షేక్ రజాక్(60) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. కడప జిల్లా కమలాపురానికి చెందిన వీరు కర్నూలులో జరిగిన పెళ్లికి హాజరై శుక్రవారం తిరిగి వెళ్తుండగా ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదం జరిగింది.

09/08/2018 - 00:57

విజయవాడ, సెప్టెంబర్ 7: రాష్ట్రంలో ఉపాధి పనుల్లో సామాజిక ఆడిట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 7.42 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి పనుల్లో అవినీతి కార్యకలాపాలపై తీసుకున్న చర్యల గురించి ఎమ్మెల్సీ శమంతకమణి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

09/08/2018 - 00:56

రేణిగుంట, సెప్టెంబర్ 7: పదేళ్ల కల నెరవేరిందని, 2020 ఒలింపిక్స్ నా టార్గెట్ అని భారత మహిళా హాకీ గోల్‌కీపర్, చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలం యమమలవారిపల్లె గ్రామానికి చెందిన రజనీ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రజనీకి విద్యార్థులు, జిల్లా హాకీ క్రీడా అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు.

09/08/2018 - 00:56

అయినవిల్లి, సెప్టెంబర్ 7: భారత ప్రజలందరికీ ఆరాధ్యుడైన బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరగరాస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అత్యంత దుర్మార్గమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మతాన్మోదులు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి, 120కోట్ల ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారన్నారు.

09/08/2018 - 00:55

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 7: రాష్ట్రంలో విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

09/08/2018 - 00:50

విజయవాడ, సెప్టెంబర్ 7: ఈ నెల 15వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరులో జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కార్యదర్శి పీసీ సత్యమూర్తి శుక్రవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

09/08/2018 - 00:50

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 7: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం లాబీల్లో తెలంగాణ రాజకీయాలపైనే ఎక్కువగా చర్చలు జరిగాయి. మొదటి రోజు సభ్యుల హాజరు తక్కువపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినప్పటికి రెండోరోజు కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఇదే సందర్భంలో ఏపీ మంత్రుల పేషీల వద్ద మాత్రం సందర్శకుల తాకిడి ఎక్కువగానే కనిపించింది.

09/08/2018 - 00:49

అమరావతి, సెప్టెంబర్ 7: అధికారం చేపట్టిన ఐదునెలల్లోనే పట్టిసీమ పూర్తిచేశాం.. నాలుగేళ్లలో 205 టీఎంసీల నీటిని కృష్ణాకు తీసుకొచ్చాం.. వచ్చేనెలలో చిత్తూరుకు నీరందిస్తాం.. సంక్రాంతి నాటికి వెలుగొండకు నీటిని తరలిస్తామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు.

Pages