S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/07/2018 - 05:33

విజయవాడ, సెప్టెంబర్ 6: ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు.

09/07/2018 - 05:13

విజయవాడ(సిటి), సెప్టెంబర్ 6: నాడు ప్రధానిగా వాజపేయ తీసుకున్న నిర్ణయాలే నేటి దేశాభివృద్ధికి పునాదులని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మైక్రో ఇరిగేషన్.. జాతీయ రహదారుల అభివృద్ధి..బ్యాండ్ విడ్త్ వంటి అధునిక సాంకేతిక పరిజ్ఞానాలను మనదేశానికి తీసుకు రావడంతో పాటు, అణుపరీక్షలతో నాడు వాజపేయి తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి బాటలు వేశాయన్నారు. మంత్ర ముగ్ధులను చేసే ఆయన మాటలు అందరిని అకట్టుకునేవన్నారు.

09/07/2018 - 05:12

జియ్యమ్మవలస, సెప్టెంబర్ 6: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ్డసింగిపురం సమీపంలో ఏనుగులు సంచరిస్తుండటంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. గెడ్డసింగిపురం, డంగభద్ర, బూరిరామినాయుడువలస, ఏనుగులగూడ, అర్నాడ, వనిజ గ్రామాలకు చెందిన ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు.

09/07/2018 - 05:11

విజయవాడ, సెప్టెంబర్ 6: ప్రపంచంలో మారుతున్న విధానాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను అందుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ సునీత సాంఘ్వీ తెలిపారు.

09/07/2018 - 05:10

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయగుండం గురువారం ఉదయం 11 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని డిగా వద్ద తీరం దాటిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. ఈ తీవ్ర వాయుగుండం ఒడిశాలోని బాలాసూర్ వద్ద స్థిరంగా ఉందని, శుక్రవారం మధ్యాహ్నం తరువాత బలహీనపడుతుందని చెప్పారు. దీని ప్రభావం ఏపీపై ఉండదని చెప్పారు.

09/07/2018 - 01:49

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 6: అమరావతి బాండ్లు, రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం తదితరాలపై ఇటీవల తాను చేసిన విమర్శలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు.

09/07/2018 - 01:47

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 6: ఇండో-టిబెట్ సరిహద్దు ప్రాంతంలోని పోలీసు అమరుల స్థలిని ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం సందర్శించింది. ఏపీ ఇంటిలిజెన్స్ ఎస్పీ ఆర్ జయలక్ష్మీ నేతృత్వంలోని 23మంది సభ్యుల ప్రత్యేక పోలీసు బృందం ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది.

09/07/2018 - 01:47

విజయవాడ, సెప్టెంబర్ 6: వచ్చే సాధారణ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు వెంట ఉండేలా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా తన వంత బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు. కార్పొరేషన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 13 జిల్లాల డీఎల్‌ఓలకు నాయకత్వ లక్షణాలు పెంపుపై మంగళగిరిలో జరుగుతున్న రెండు రోజుల శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు.

09/07/2018 - 01:46

విజయవాడ, సెప్టెంబర్ 6: పెట్టుబడులు గణనీయంగా పెరగడం, మార్కెట్‌లో ధర పడిపోయిన నేపథ్యంలో ఉల్లి, టమాటా రైతులను ఆదుకోవాలని పలువులు ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. చైర్మన్ ఎన్‌ఎండి ఫరూఖ్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర శాసనమండలి సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందా అని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు ప్రశ్నించారు.

09/07/2018 - 01:46

భీమవరం, సెప్టెంబర్ 6: దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గరగపర్రులో ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు దళితుల పట్ల వివక్ష చూపుతున్న తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యద్దని పలువురు దళిత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు.

Pages