S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/06/2018 - 04:37

విజయవాడ, సెప్టెంబర్ 5: అమెరికాలో ఉన్న తెలుగువారిని రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములను చేయాలని అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సీఎంతో కోమటితో భేటీ అయ్యారు. రాష్ట్భ్రావృద్ధికి సంబంధించి వివిధ అంశాలను చర్చించారు.

09/06/2018 - 04:37

విజయవాడ, సెప్టెంబర్ 5: ప్రజలు తమ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణా లోపాలకు సంబంధించి ఫోటోలు పంపితే, పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రియల్ టైమ్ గవర్నెన్సు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. అపారిశుద్ధ్యానికి సంబంధించి ఫోటోలను పీపుల్ ఫస్ట్, ఖైజాలా, ఎన్‌సీబీఎన్ యాప్‌లకు పంపితే, అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోనుంది.

09/06/2018 - 04:36

విజయవాడ, సెప్టెంబర్ 5: సీఎం చంద్రబాబు గత మే నెల 31వ తేదీన ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఈ నెల 11వ తేదీన విజయవాడ లెనిన్ సెంటర్‌లో కేశఖండన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, హైకోర్టు దృష్టికి చేరే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

09/06/2018 - 04:06

పాడేరు, సెప్టెంబర్ 5: విశాఖ మన్యంలో బాక్సైట్‌పై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలతో ఎటువంటి రక్షణ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ, వైసీపీ ఎప్పుడూ అనుకూలమేనన్నారు. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న అన్‌రాక్ కంపెనీకి ఈ రెండు పార్టీలు మద్దతిస్తున్నాయని ఆరోపించారు.

09/06/2018 - 04:03

విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీ కాస్మిక్ (ఏపీ క్రిటికల్ ఆపరేషన్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ఇన్సిడెంట్ కమాండ్) వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎం.వి శేషగిరి బాబు వెల్లడించారు.

09/06/2018 - 04:01

మచిలీపట్నం, సెప్టెంబర్ 5: సంకల్పబలంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. విభజనతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

09/06/2018 - 03:58

విజయవాడ, సెప్టెంబర్ 5: సమ్మె విరమించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆర్జీయుకేటీ కాంట్రాక్టు సిబ్బందికి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆర్జీయుకేటీ అధికారులతో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఆర్జీయుకేటీ వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలపై అధికారులతో సమీక్షించారు.

09/06/2018 - 02:53

అనంతపురం, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో శాంతిభద్రతలు నశిస్తున్నాయని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నేరస్తులు, నిందితులకు పోలీసుస్టేషన్లలో కుర్చీలు వేసి కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నారన్నారు. అనంతపురంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆలూరులో ఓ ఎస్‌ఐపై దాడి జరిగితే ఫిర్యాదు చేయలేని దౌర్భాగ్యస్థితి నెలకొందన్నారు. పోలీసులకు వెనె్నముక లేదని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..

09/06/2018 - 02:51

అమరావతి, సెప్టెంబర్ 5: ‘మీ నిర్లక్ష్యం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయి.. మీ బాధ్యతా రాహిత్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారుతోంది.. ఇదేతీరున వ్యవహరిస్తే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటిస్తాం.. అసమర్థంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

09/06/2018 - 02:49

గుంటూరు, సెప్టెంబర్ 5: ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్థులకు ఉందని, ఆ దిశగా వారిని నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాన్ని మేలైన మానవ వనరులకు గమ్యస్థానంగా మలచాలని, ఈ బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు.

Pages