S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/06/2018 - 13:54

అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాజీ భారత ప్రధాని వాజ్‌పేయని స్మరించుకుంది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వాజ్‌పేయ వల్లే దేశంలో రహదారుల అభివృద్ధి జరిగింద న్నారు

09/06/2018 - 13:41

అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎక్కడికక్కడ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.శాసనసభలో ఆయన మాట్లాడారు.

09/06/2018 - 04:47

అమరావతి, సెప్టెంబర్ 5: శాసనసభ, మండలిలో సభ్యులడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలివ్వాల్సిందే అని మండలి చైర్మన్ ఎండి ఫరూక్, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. గురువారం నుంచి జరిగే సమావేశాల నిర్వహణపై బుధవారం స్పీకర్ ఛాంబర్‌లో అధికారుల సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు.

09/06/2018 - 04:46

విజయవాడ, సెప్టెంబర్ 5: మదనపల్లి మార్కెట్‌లో ఉల్లి, టమాటా నిల్వకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం రాత్రి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష ఆయన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిట్టుబాటు ధర లభించే వరకూ సబ్సిడీ ఇచ్చి రైతును ఆదుకోవాలన్నారు.

09/06/2018 - 04:44

విజయవాడ, సెప్టెంబర్ 5: రాజ్యాంగ పదవిలో ఉన్న శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు, తప్పుడు గణాంకాలతో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. దీని వల్ల ఉన్నతమైన స్పీకర్ పదవికే కళంకం ఏర్పడే అవకాశం ఉన్నదన్నారు.

09/06/2018 - 04:44

విజయవాడ, సెప్టెంబర్ 5: వెనుకబడ్డ ప్రకాశం, కడప జిల్లాలకు వర ప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారం వారం ఐదేసి ప్రశ్నలు సంధిస్తున్న కన్నా బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు.

09/06/2018 - 04:42

విజయవాడ, సెప్టెంబర్ 5: రాజధాని అమరావతి పరిధిలో జరిగే అభివృద్ధి పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని పరిధిలో జరుగుతున్న రోడ్లు, భవనాల పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి పర్యటన ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఎఎస్ అధికారుల గృహ సముదాయాల నిర్మాణాన్ని పరిశీలించారు.

09/06/2018 - 04:41

అమరావతి, సెప్టెంబర్ 5: శ్రీకాకుళం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ స్పీకర్ కె ప్రతిభాభారతి కొండ్రు చేరికను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు.

09/06/2018 - 04:41

విజయవాడ(సిటి), సెప్టెంబర్ 5: వయస్సులేదు...అనుభవం లేదు...ఆలోచన లేదు..ప్రజలకు మేలు చేయాలనే తపన లేదు..సలహాలు వినే నైజం లేదు..కేవలం నీ సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న నీ అలోచన భరించలేకనే వైకాపాను వీడామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

09/06/2018 - 04:38

విజయవాడ, సెప్టెంబర్ 5: విశాఖ ఉక్కు కర్మాగార నిర్వాసితులకు సంబంధించి ఆర్-కార్డును బదిలీ చేసేందుకు కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్- కార్డు కలిగి ఉండి 40 సంవత్సరాలు దాటిన, విశాఖ ఉక్కు కర్మాగారం ఉపాధి కల్పించని నిర్వాసితులు తమ ఆర్-కార్డులను బదిలీ చేసే వీలును కల్పించింది.

Pages