S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/05/2018 - 04:58

విజయవాడ, సెప్టెంబర్ 4: దసరా ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. విజయవాడ దుర్గగుడి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు.

09/05/2018 - 04:57

విజయవాడ, సెప్టెంబర్ 4: వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 7 కోట్ల రూపాయల మేర ప్రైజ్ మనీ అందచేసేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను, కరప్రతాన్ని వెలగపూడి సచివాలయంలో మంగళవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను అక్టోబర్ 22 నుంచి 26 వరకూ విశాఖలో నిర్వహించనున్నారు.

09/05/2018 - 04:56

అమరావతి, సెప్టెంబర్ 4: ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. పన్నులు, ఇతర మార్గాల్లో రావాల్సిన పెండింగ్ బకాయిల లెక్కలు తీస్తోంది. గత మూడేళ్లలో వివిధ శాఖల ద్వారా రూ 6, 248 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సి ఉంది. వీటిని తక్షణం వసూలుచేసే విషయమై ఆయాశాఖల ముఖ్య కార్యదర్శులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామ కృష్ణుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది.

09/05/2018 - 04:55

అమరావతి, సెప్టెంబర్ 4: అమరావతి బాండ్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈర్ష్యతోనే అసత్యప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో టీడీపీ ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై ఉండవల్లి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. అమరావతి టాక్స్ ఫ్రీ బాండ్లు కావని స్పష్టంచేశారు.

09/05/2018 - 04:53

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారానికి పీబీఐ (ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో) కృషిచేస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీఐబీ ఆధ్వర్యంలో మంగళవారం ‘వార్తాల్యాప్’ పేరిట విలేఖరులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/05/2018 - 04:13

కాకినాడ, సెప్టెంబర్ 4: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా బీసీ-ఎఫ్‌గా గుర్తించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాపు జేఏసీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని కాపు ప్రజాప్రతినిధులు డిమాండ్‌చేయాలని విజ్ఞప్తి చేసింది.

09/05/2018 - 04:11

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తూనే లాభసాటి వ్యాపారాలవైపు రైల్వే ఇపుడు దృష్టి సారిస్తోంది. సరకు రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని రైల్వే కోట్లాది రూపాయల ఆదాయాన్ని సులభంగా సంపాదించుకునే మార్గాలను అనే్వషిస్తోంది.

09/05/2018 - 04:09

గుంటూరు, సెప్టెంబర్ 4: ఈ ఏడాది డిసెంబర్ మాసాంతానికి పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

09/05/2018 - 04:07

తిరుపతి, సెప్టెంబర్ 4: ముఖ్యమంత్రి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు బయలుదేరిన సీపీఐ, సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారితోపాటు జర్నలిస్టులను సైతం నారావారిపల్లెలోకి వెళ్లకుండా కిలోమీటరు దూరంలోని రంగంపేట క్రాస్ వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. పోలీసులు భారీగా మోహరించారు.

09/05/2018 - 04:03

అమరావతి, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞాన ఖనిగా, సకల విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి సహకరించి కలను సాకారం చేయాలని ఉపాధ్యాయలోకానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. బుధవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో విద్యాబోధన చేస్తున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Pages