S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/06/2018 - 01:33

విశాఖపట్నం: రెండువేల ఇరవై నాటికి 20 మిలియన్ విదేశీ పర్యాటకుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) మేధోమథనం సాగిస్తోందని అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్ స్పష్టం చేశారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి నాలుగు రోజుల పాటు ఐఏటీవో 34వ సమావేశాలు విశాఖలో జరుగుతాయన్నారు.

09/05/2018 - 23:32

అమరావతి, సెప్టెంబర్ 5: శాసనసభ సమావేశాలకు హాజరుకాని ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలెందుకు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సావధానంగా చర్చించే అవకాశాన్ని వదులుకుని ప్రభుత్వంపై వీధుల్లో నిందలేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

09/05/2018 - 23:32

విజయవాడ(సిటి), సెప్టెంబర్ 5: భారత రాజ్యాంగ విలులవలను కాలరాసే విధంగా శాసనసభ స్పీకర్ కోడెల ప్రసాదరావు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పినె్నల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పార్టీ మారిన వారిన వారిని అనర్హులుగా ప్రకటించకుండా, టీడీపీ కండువా కప్పుకుని పార్టీ నాయకుడిలా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు.

09/05/2018 - 23:31

కడప, సెప్టెంబర్ 5: విభజన బిల్లులో పేర్కొన్న కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ అంశం రాజకీయ పార్టీల ప్రచారానికి మాత్రమే పనికి వస్తోంది. ఉక్కు పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉక్కు పరిశ్రమపై ప్రకటనలకే పరిమితమయ్యారు. కడప ఉక్కుపై కేంద్రానికి సీఎం ఇచ్చిన రెండు నెలల గడువు ముగిసింది.

09/05/2018 - 23:31

చిత్తూరు, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో ప్రజల బతుకుల్ని కుంగదీసే బీజేపీ, టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి, వచ్చే ఎన్నికల్లో నూతన శకానికి ప్రజలు నాంది పలకాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శ కె రామకృష్ణ పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న బస్సు యాత్ర బుధవారం చిత్తూరుకు చేరుకుంది.

09/05/2018 - 13:40

విజయవాడ: ఏ కన్వెన్షన్ సెంటర్లో అమృత్ నగరాల కమిషనర్లతో స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి వి కె జిందాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 33 అమృత్ నగరాల పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు అమలు, చెత్త సేకరణ, నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఎక్కడి చెత్తను అక్కడే ప్రాసెసింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

09/05/2018 - 12:54

గుంటూరు: జిల్లాలోని మంగళగిరిలో ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. పీవీ సింధూ వంటి క్రీడాకారులను ఉపాధ్యాయులు తయారుచేయాలని కోరారు. స్టార్ షట్లర్ పీవీ సింధూ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువుల వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

09/05/2018 - 05:03

విజయనగరం, సెప్టెంబర్ 4: ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని మంత్రి కళా వెంకట్రావు పేర్కొన్నారు. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానీయకుండా జగన్ అడ్డుకుంటున్నారని కళా ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉంటుందన్నారు.

09/05/2018 - 05:01

అమరావతి, సెప్టెంబర్ 4: స్వప్రయోజనాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముస్లిం యువతను బలిచేస్తున్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ధ్వజమెత్తారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు.

09/05/2018 - 05:00

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 4: మానవ సహిత రాకెట్ (హ్యూమన్) ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు (ఇస్రో) ఒక చాలెంజ్ లాంటిదని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. మంగళవారం ఆయన ఇస్రో శాస్తవ్రేత్తలతో కలసి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని షార్ ఉద్యోగుల కాలనీ పులికాట్ నగర్‌లో నూతనంగా రూ.2.8 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రాంరభించారు.

Pages