S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/05/2018 - 04:03

తిరుపతి, సెప్టెంబర్ 4: టాటా సంస్థ దేశంలో ఎక్కడైనా సేవాభావంతో కార్యక్రమాలు చేయడం లేదని, ఆ సంస్థ దృష్టంతా భూములపైనే ఉంటుందని తిరుపతిలో టాటా సంస్థ ఏర్పాటు చేస్తుందని చెబుతున్న కేన్సర్ ఆస్పత్రికి నిధులు కేంద్ర హోంశాఖ పరిధిలోని అటానమిక్ విభాగం నుంచి అందుతాయని, 25 ఎకరాల స్థలం టీటీడీ ఇచ్చిందని ఇక టాటా కేన్సర్ కోసం చేసే సేవ ఏమిటని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతా మోహన్ ప్రశ్నించారు.

09/05/2018 - 04:02

గుంటూరు, సెప్టెంబర్ 4: తిరుమల స్వామివారి సాక్షిగా కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ మరో కొత్తనాటకానికి తెర లేపారని, వెంకన్న భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ పాలకవర్గ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

09/05/2018 - 04:01

గుంటూరు, సెప్టెంబర్ 4: మద్యం అమ్మకాల విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్ట్రప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగారని పాయకారావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. తనకు తాను మేధావిగా భావిస్తూ ప్రజలను పక్కదారి పట్టించే పనులను ఉండవల్లి మానుకోవాలని హితవుపలికారు.

09/05/2018 - 04:00

కడప సిటీ, సెప్టెంబర్ 4: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిగా నిండాయని, అయినా కడప జిల్లాలోని గండికోటకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని కడప మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. 51 మండలాల్లో ఎక్కడా పదును వర్షం కూడా పడలేదన్నారు.

09/05/2018 - 02:14

విజయవాడ, సెప్టెంబర్ 4: గతంలో విజయవాడ నగరంలో మంజూరు చేసిన అసైన్‌మెంట్ పట్టాలను ఒరిజినల్ పట్టదారులకు లేదా కొనుగోలు చేసిన వారికి, ప్రస్తుతం నివాసం ఉంటూ ఎలాంటి ఆధారం లేని వారికి జీవో 388 మేరకు క్రమబద్ధీకరించేందుకు వీలుగా క్యాబినెట్‌కు పంపేందుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది.

09/05/2018 - 02:12

అమరావతి, సెప్టెంబర్ 4: మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రైవేటు యాజమాన్యం నిబంధనలు పాటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయటంతో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేయ తలపెట్టిన ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయి ఏడాదిన్నర గడిచింది. కొత్తగా ఏర్పాటయ్యే ఈవిశ్వవిద్యాలయం ఎలా ఉండాలి?

09/05/2018 - 02:11

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 4: టీడీపీ అధికారంలోని వచ్చి నాటి నుండి అమలు చేస్తున్న అన్ని పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ఆదరణ - 2పథకం కింద పని ముట్ల కొనుగోళ్లలో అంతులేని అవినీతి జరిగిందన్నారు.

09/05/2018 - 02:10

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కేటగిరిలో 13 మందిని ఉత్తన అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

09/05/2018 - 02:10

అమరావతి, సెప్టెంబర్ 4: సచివాలయ డిస్పెన్సరీ ద్వారా అదనపు వైద్య సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అర్బన్ వైద్య, ఆరోగ్య కేంద్రాల తరహాలో డిస్పెన్సరీ నుంచి టెలీ మెడిసిన్ విధానం ద్వారా సేవలందించనున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ దుర్గాప్రసాద్ మంగళవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీని తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు.

09/04/2018 - 04:02

అమరావతి: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం అమలులో దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా అత్యున్నత ఫలితాల సాధనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాధించింది. పీఎంఎంవీవై పథకం లక్ష్యాలను చేరుకోవటంలో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు గాను ఈ గుర్తింపు లభించింది.

Pages