S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/25/2018 - 03:12

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 24: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు సమర్పించేందుకు తుది గడువు బుధవారం అర్ధరాత్రి 12గంటలతో ముగిసిందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు 23వతేదీ అర్ధరాత్రితో గడువు ముగిసిందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి 3,97,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

05/25/2018 - 02:59

విజయవాడ, మే 24: రాష్టవ్య్రాప్తంగా అత్యధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గం మనస్సులలో అంతర్లీనంగా గూడుకట్టుకుని ఉన్న ఆందోళన.. నిస్పృహ, అసహనాన్ని ఇప్పటికే బాగా గుర్తెరిగిన సీఎం చంద్రబాబునాయుడు మహానాడులో కాపు రిజర్వేషన్ పట్ల తీర్మానం చేయాలని బలిజ, తెలగ, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మడి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

05/22/2018 - 03:20

విజయవాడ, మే 21: రాష్ట్రంలో 525 గ్రామాల్లో మరింతగా జల సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 శాతం మేర వర్షపాతం లోటు ఉన్నా, 3 మీటర్ల మేర భూగర్భ జలాలను పెంచామన్నారు. నీరు-ప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలే ఇందుకు కారణమన్నారు.

05/22/2018 - 03:19

విజయవాడ, మే 21: రాష్ట్రంలో రైతులు స్వయంగా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులను గ్రామాల్లో నెలకొల్పే దిశగా ప్రోత్సహించాల్సి ఉందని, ఇందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం ‘వార్షిక వ్యవసాయ ప్రణాళిక 2018-19’పై ఆయన వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు.

05/21/2018 - 03:35

ఒంగోలు, మే 20: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితచరిత్రలోని అన్ని అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చి భావితరాల విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.

05/21/2018 - 03:34

కాకినాడ, మే 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను కొనసాగిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం జన్మభూమి కమిటీలను నియమించారు. ప్రభుత్వం అమలుచేసే వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పాత్ర కీలకంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులే నేరుగా జన్మభూమి కమిటీలను నియమించారు.

05/21/2018 - 03:59

కర్నూలు: రాష్ట్ర ప్రయోజనాల అంశంలో కేంద్రంతో విభేదించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడికి కన్నడ ఎన్నికల తరువాత ఉపశమనం లభించినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది.

05/21/2018 - 03:33

మచిలీపట్నం, మే 20: రాజకీయ కాంక్షతో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు తిరుమల ప్రతిష్ఠను దిగజారుస్తున్నాడని టీటీడీ పాలక మండలి సభ్యుడు డొక్కా జగన్నాథం విమర్శించారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన రమణ దీక్షితులే రాజకీయ ప్రేరేపితుడై విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు.

05/21/2018 - 03:32

తిరుపతి, మే 20: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల ప్రపంచ వ్యాప్తంగా భక్తుల్లో అపార భక్తి విశ్వాసం ఉందని, ఆగమోక్తంగానే స్వామివారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నా జరగడం లేదని మాజీ ప్రధానార్చకులు డాక్టర్ రమణదీక్షితులు వ్యాఖ్యలు చేసి తప్పు చేశారని ప్రధానార్చకులు, సంభావన అర్చకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు.

05/21/2018 - 02:52

గుంటూరు, మే 20: గిరిజనుల గురించి మాట్లాడే అర్హత, నైతిక హక్కు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

Pages