S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/07/2019 - 21:53

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లు తగ్గించింది. రెపో రేటు (బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వడ్డీరేటు) 25 బేస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో 6.5శాతం ఉన్న రెపో రేటు ఇపుడు 6.25కు పెరిగింది. ఈ తగ్గింపు వల్ల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐ చైర్మన్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.

02/07/2019 - 04:27

మదనపల్లె: టమోటా ధరలు అంతంత మాత్రమే పలుకుతోంది. దీనికి తోడు దిగుబడి కూడా తగ్గుముఖం పడుతోంది. చేతికొచ్చిన పంటను మార్కెట్‌కు తరలిస్తే వ్యాపారుల స్వార్థంతో ధర నేలకు దిగజారుతోంది. 15రోజుల క్రితం మొదటిరకం కిలో టమోటాలు రూ.40లు పలికింది. ఫిబ్రవరి మొదటి నుంచీ రూ.10లకు పడిపోయింది.

02/07/2019 - 01:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కేబుల్ సర్వీసుల సేవలు మరింత ప్రియమవుతాయని క్రిసిల్ రిపోర్టును ట్రాయ్ తప్పుబట్టింది. ఈ నివేదికలో నిజం లేదని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ చెప్పారు. కొత్త టారిఫ్ వల్ల మార్కెట్‌లోకి కొత్త శక్తులు వస్తాయని, దీని వల్ల టారిఫ్ రానున్న రోజుల్లో తగ్గుతుందన్నారు.

02/07/2019 - 01:29

కాగజ్‌నగర్, ఫిబ్రవరి 6: నాలుగున్నర సంవత్సరాల క్రితం మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లులో నేడు పేపర్ ఉత్పత్తి తిరిగి ప్రారంభం కానుంది. మిల్లు మూతపడినప్పటి నుంచి కార్మికులు ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణపై ప్రత్యేక కథనం...

02/06/2019 - 23:56

ముంబయి, ఫిబ్రవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 358 పాయింట్లకు పైగా పెరగగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన విధాన వైఖరిని తటస్థానికి మార్చుకుంటుందనే అంచనాల కారణంగా మదుపరులు ఉత్సాహంతో కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల కీలక సూచీలు పుంజుకున్నాయి.

02/06/2019 - 23:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దాల్మియా భారత్ గ్రూప్‌లోని భాగస్వామ్య కంపెనీ డాల్మియా- ఓసీఎల్ జర్మనీకి చెందిన ప్రసిద్ధ రిఫ్రాక్టరీ మేకర్‌ను బుధవారం కొనుగోలు చేసింది. రిఫ్రాక్టరీ మేకర్ జీఎస్‌బీ గ్రూప్ జీఎంబీహెచ్‌ను 15 మిలియన్ యూరోలు (122 కోట్ల రూపాయలు) వెచ్చించి తీసుకుంది. యూరోప్‌లో తమ కంపెనీ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే దిశగా ఈ చర్యలు తీసుకుంది.

02/06/2019 - 23:53

ముంబయి, ఫిబ్రవరి 6: వరుసగా రెండు రోజుల నష్టాల పరంపర నుంచి భారత రూపాయి మంగళవారం కోలుకుంది. అమెరికన్ డాలర్‌తో 23పైసలు బలపడి రూపాయి విలువ 71.57 రూపాయలకు చేరింది. విదేశీ నిధులు పెద్దమొత్తంలో పెట్టుబడులుగా రావడంతోబాటు, దేశీయ మార్కెట్లు లాభాలతో ముగియడం రూపాయి బలోపేతానికి దోహదం చేసిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

02/06/2019 - 23:52

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,262.00
8 గ్రాములు: రూ.26,096.00
10 గ్రాములు: రూ. 32,620.00
100 గ్రాములు: రూ.3,26,200.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,488.77
8 గ్రాములు: రూ. 27,910.16
10 గ్రాములు: రూ. 34,887.7
100 గ్రాములు: రూ. 3,48,877
వెండి
8 గ్రాములు: రూ. 330.40

02/07/2019 - 04:43

కోచ్చి: కస్టమర్ల బ్యాంకు ఖాతాల నుంచి జరిగే అనధికారిక విత్‌డ్రాలకు తమది బాధ్యత కాదని బ్యాంకులు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదని కేరళ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఖాతాదార్లు ఎస్‌ఎంఎస్ అలర్టులతో స్పం దించలేకపోయినా వారి ఖాతాల నుంచి అ నధికారికంగా సొమ్ము విత్‌డ్రా జరిగితే బ్యాంకులు బాధ్యత వహించాల్సిందేనని న్యాయమూర్తి జస్టిస్ పీబీ సురేష్ కుమార్ స్పష్టం చేశారు.

02/06/2019 - 23:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్‌లోని ప్రధాన సంస్థ జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్‌ఈఈఎల్) ప్రమోటర్లు సంస్థలోని తమ వాటాలలో 50 శాతానికి పైగా విక్రయించడానికి ముందుకు వచ్చారు. సంస్థ తీసుకున్న రుణాలను చెల్లించడానికి గాను తమ ఆస్తులను నగదుగా మార్చుకుంటున్న ప్రక్రియలో భాగంగా వారు ఈ చర్యకు ఉపక్రమించారు.

Pages