S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/11/2019 - 23:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ రేటును మార్చే ఉద్దేశం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)కి లేదని సమాచారం. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ, గతంలో మాదిరిగానే 8.55 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రెపో, రివర్స్ రెపో రేటును ఆర్‌బీఐ సవరించినప్పటికీ, దాని ప్రభావం పీఎఫ్ వడ్డీ రేటుపై ఉండదు.

02/11/2019 - 23:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ)ల రెండు భారీ విలీనాల తర్వాత, కొంతకాలం విరామం ఇవ్వాలని కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విలీనానికి గత నెల కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనితో దేశంలో మూడో అతి పెద్ద బ్యాంక్‌గా బీఓబీ అవతరించింది.

02/11/2019 - 23:28

దుబాయి, ఫిబ్రవరి 11: తీవ్రమయిన నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ను ఆదుకోవడానికి ఒక రికార్డు పెట్టుబడి ప్యాకేజీని సౌదీ అరేబియా సిద్ధం చేసింది. ఈ ఇనె్వస్ట్‌మెంట్ ప్యాకేజీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న ముస్లిం మిత్ర దేశమయిన పాకిస్తాన్‌కు ఉపశమనాన్ని కలిగించడంతో పాటు ప్రాంతీయ భౌగోళిక రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి తోడ్పడుతుందని విశే్లషకులు పేర్కొంటున్నారు.

02/11/2019 - 04:44

రేణిగుంట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుతోందని, రూ. 1444 కోట్ల పెట్టుబడితో 7088 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రులు నారా లోకేష్, ఎన్.అమరనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఈఎంసీ 1లో 10 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు మంత్రులు భూమిపూజ చేసి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఈఎంసీ 1లో రూ.

02/11/2019 - 03:22

ముంబయి, ఫిబ్రవరి 10: భారత స్టాక్ మార్కెట్ వచ్చే వారం ఏ విధంగా ఉంటుందనేది ఎవరి అంచనాకూ అందడం లేదు. స్థానిక మార్కెట్ దిశ ఎటో అర్థం కాకపోవడంతో, అంతర్జాతీయ సూచీలే రాబోయే వారంలో కీలకంగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈక్విటీ మార్కెట్‌లో సెంటిమెంట్లు బలంగా పని చేస్తున్నాయి.

02/11/2019 - 03:20

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 10: చమురు, సహజవాయులు, కోల్‌బెడ్ మీథేన్ (సీబీఎం)లకు చెందిన 23 బ్లాక్‌లకు ఓపెన్ ఆక్రియేజ్ లైసెన్సింగ్ విధానం ద్వారా మూడో దశ టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆహ్వానించింది. తద్వారా సుమారు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాలని అంచనావేస్తోంది. ఈ నిధులను దేశీయంగా ఉత్పత్తులు పెంచేందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

02/11/2019 - 03:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) సరికొత్త నిబంధనల మేరకు కార్పొరేట్ కంపెనీలు సంస్థాగత ఆడిట్ ద్వారా పాలనాపరమైన అంశాల్లో పారదర్శతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాక కంపెనీలకు చెందిన కార్యదర్శులు ఆ కంపెనీలకు చెందిన అన్ని అంశాలపై నివేదికలు సెబీకి సమర్పించేలా అధికారాలను ఇవ్వాల్సివుంటుంది.

02/11/2019 - 03:19

గ్రేటర్ నోయిడా(యూపీ), ఫిబ్రవరి 10: సహజవాయుల ఉత్పత్తిలో చతికిలపడిన ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు (పీఎస్‌యూ)లకు ప్రత్యేక రాయితీలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా ప్రభుత్వ నిర్వహణలోని ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఆయిల్)కు చెందిన డజను చమురు శుద్ధి కర్మాగారాల్లో సహజవాయు ఉత్పత్తికి సంబంధించిన ప్రతిబంధకాలను తొలగించి ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వ యోచన.

02/11/2019 - 03:18

గ్రేటర్ నోయిడా (యూపీ), ఫిబ్రవరి 10: మంగోలియాలో సరికొత్త 1.5 మిలియన్ టన్నుల రీఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సలెన్సీ కాంట్రాక్టును ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) కైవసం చేసుకుంది. ఈమేరకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, మంగోలియా ప్రభుత్వానికి చెందిన రీఫైనరీ ఎల్‌ఎల్‌సీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది.

02/10/2019 - 04:43

ముంబయి: భారత స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఆశనిరాశల మధ్య ట్రేడింగ్ ఊగిసలాడుతూ, నిపుణులు సైతం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిని కల్పించింది. రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ పరిణామాలతోపాటు అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడకపోవడం కూడా భారత స్టాక్ మార్కెట్‌ను ఈ వారం తీవ్రంగా ప్రభావితం చేసింది.

Pages