S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/08/2019 - 04:16

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటును 0.25 శాతం తగ్గించడం వల్ల బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించక తప్పని పరిస్థితులు తలెత్తాయని ఆర్థిక నిపుణులంటున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రెపో రేటును 6.25శాతానికి తగ్గించిన విషయం విదితమే. దీని వల్ల వినిమయ వస్తువులు తగ్గనున్నాయి. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు విరివిగా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

02/08/2019 - 04:02

ముంబయి, ఫిబ్రవరి 7: మధ్యంతర డివిడెండ్‌ను కోరడానికి, ఆ నిధులను అవసరమైన వాటికి ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు.

02/08/2019 - 03:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తీవ్రమయిన ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన పైలట్లు ఈ వారం ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. జెట్ ఎయిర్‌వేస్ తమకు నిర్దిష్ట గడువులోగా పాక్షికంగా వేతనాలు చెల్లించకపోతే ఏం చేయాలనే అంశంపై వారు వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

02/08/2019 - 03:28

చిత్రం..బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో గురువారం డిజిటల్ లెర్నింగ్‌పై జరిగిన సదస్సులో పాల్గొన్న ఇన్ఫోసిస్
సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి (కుడి) మేనేజింగ్ డైరెక్టర్/ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సలీల్ పరేఖ్.

02/08/2019 - 03:26

సిమ్లా, ఫిబ్రవరి 7: ఎక్కువ సంఖ్యలో వ్యర్థాలను వదలిపెడుతూ, కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజన్ల వల్ల తలెత్తుతున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. భూమిపైనేగాక, నీటిలోనూ ఇలాంటి వ్యర్థాలు, కాలుష్యకారకాలను సేకరించగల సామర్థ్యం ఉన్న కొత్తరకమైన స్పాంజ్‌ని మండీ ఐఐటీ శాస్తవ్రేత్తలు కనిపెట్టారు.

02/08/2019 - 03:25

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,236.00
8 గ్రాములు: రూ. 25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,687.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు: రూ. 319.20

02/08/2019 - 03:24

చెన్నై, ఫిబ్రవరి 7: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ స్పెషలిస్టు సంస్థ ‘ఐ యాప్స్’ నిర్వహణను చేపట్టబోతున్నట్టు అంతర్జాతీయ సాంకేతిక సేవల సంస్థ ‘ఆస్పైర్ సిస్టమ్స్’ బుధవారం నాడిక్కడ ప్రకటించింది. ఐతే ఇందుకు సంబంధించి ఎంతమొత్తం ఖర్చు చేయనుందీ ఆ సంస్థ వెల్లడించలేదు.

02/08/2019 - 03:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఔషధ సంస్థ గ్లెన్‌మార్క్ పార్మాస్యూటికల్స్‌కు చెందిన స్విట్జర్లాండ్ విభాగం చైనాకు చెందిన ‘గ్రాండ్ పార్మా కో’ సంస్థతో బుధవారం ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.

02/08/2019 - 03:23

ముంబయి, ఫిబ్రవరి 7: దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు గురువారం స్తబ్థుగా ముగిసినప్పటికీ మదుపర్లకు పెద్ద స్థాయిలో లాభాలు మాత్రం పంచాయి.

02/08/2019 - 02:18

ముంబయి, ఫిబ్రవరి 7: రెపో రేటును 0.25 శాతం మేర తగ్గిస్తూ 6.25 శాతం వద్ద నిర్ణయిస్తూ ఆర్‌బీఐ గురువారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. గత 18 నెలల్లో ఈ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో నెలవారీ చెల్లింపుల్లో సామాన్యుడికి ఊరట లభించనుంది. ఈఎంఐ చెల్లింపులు తగ్గడం వల్ల సాధారణ పౌరుడు ఊపిరి పీల్చుకుంటాడు.

Pages