S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/13/2019 - 05:44

విజయవాడ, ఫిబ్రవరి 12: గన్నవరం విమానాశ్రయం వద్ద 3360 మీటర్లు పొడవు, 45 మీటర్ల వెడల్పుతో విస్తరించిన రన్‌వేను కేంద్ర వాణిజ్య, పౌర విమానయాన శాఖామాత్యులు సురేష్‌ప్రభు న్యూఢిల్లీ నుండి వీడియో లింక్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయం వద్ద మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డి మధుసూదనరావు, అధికారులు పాల్గొన్నారు.

02/13/2019 - 05:40

విజయవాడ: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ ఏడాది మామిడి పంటపై ప్రభావం చూపిస్తున్నాయి. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా తేనెమంచు పురుగు ఉద్ధృతి పెరిగింది. కొన్ని జిల్లాల్లో ఇంకా పూత సరిగా రాకపోవడంతో దీని ప్రభావం దిగుబడిపై చూపనుంది. రాష్ట్రంలో 3.38 లక్షల హెక్టార్లలో మామిడి పంట సాగు చేస్తున్నారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు, తదితర రకాల మామిడి సాగుకు రాష్ట్రం ప్రఖ్యాతి గాంచింది.

02/13/2019 - 04:02

ముంబయి: వరుసగా నాలుగో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాటపట్టాయి. మంగళవారం చివరి గంటల్లో మదుపర్లు వాటాల అమ్మకాలకు పాల్పడటంతోబాటు అంతర్జాతీయంగా నెలకొన్న వ్యతిరేకతతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ 241.41 పాయింట్లు కోల్పోయి 0.66 శాతం నష్టాలతో 36,153.62 వద్ద స్థిరపడింది.

02/13/2019 - 04:00

మెల్బోర్న్, ఫిబ్రవరి 12: మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అత్యధిక సాంకేతిక మూలాలతో కూడిన ప్రాజెక్టు’ అంతర్జాతీయ పోటీల్లో ముగ్గురు సభ్యుల భారతీయ జట్టు మంగళవారం జరిగిన ఆసియా ప్రాంతీయ విభాగపు ఫైనల్‌లో విజయం సాధించింది. దీంతో 100,000 డాలర్ల ప్రైజ్ మనీతో కూడిన ఈ పోటీల ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే దిశగా భారత జట్టు ఓ అడుగు ముందుకేసింది.

02/13/2019 - 03:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ మంగళవారం హాంగ్‌కాంగ్‌లో విదేశీ పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రకటన ద్వారా విలేఖలకు తెలియజేశారు. దాస్ ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ఇలా పెట్టుబడిదారుతో ముఖిముఖి నిర్వహించడం ఇదే తొలిసారి.

02/13/2019 - 03:55

వాషింగ్టన్, ఫిబ్రవరి 12: అమెరికాను కృత్రిమ మేధస్సు (ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) రంగంలో గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

02/13/2019 - 03:54

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,236.00
8 గ్రాములు: రూ.25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,687.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు : రూ. 344.80

02/12/2019 - 07:05

ముంబయి: బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో, పార్మా రంగాల్లో మదుపర్లు పెద్దయెత్తున వాటాల అమ్మకాలకు దిగడంతో సోమవారం మరోమారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ 49.80 పాయింట్ల వంతున నష్టపోయాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తికి సంబంధించిన గణాంకాలు ఈవారం వెల్లకావాల్సి వుండటంతో మదుపర్లు జాగరూకతతో వ్యవహరించారు.

02/11/2019 - 23:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తూత్పత్తిలోనే కాకుండా ఎగుమతుల హబ్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలన్న ప్రధానోద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఎంఏఐటీ నేతృత్వంలో సోమవారం నాడిక్కడ ఏర్పాటైన ‘ఎలక్ట్రానిక్స్ మానిఫాక్చరింగ్ సమ్మిట్-2019’ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సౌహ్నే పాల్గొని ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

02/11/2019 - 23:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణులను ప్రదర్శించడంతో, ఈవారం బులియన్ మార్కెట్‌లో లావాదేవీలకు మొదటి రోజైన సోమవారం బంగారం కళతప్పింది. పది గ్రాముల బంగారం ధర 55 రూపాయలు తగ్గడంతో, 34,255 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ సూచీలతోపాటు, దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా బంగారం ధర తగ్గుదలకు కారణమైంది. వెండి లావాదేవీలు కూడా అదే దారిలో నడిచాయి.

Pages