S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/01/2019 - 20:38

హాంగ్‌కాంగ్, ఫిబ్రవరి 1: అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధానికి స్వస్థి పలికేందుకు ఇరు దేశాలూ సాగిస్తున్న చర్చలు శుక్రవారం సైతం ఓ కొలిక్కి రాలేదు. ఎలాంటి ఒప్పందాలూ జరకుండానే ఈ చర్చలు ముగిశాయి. ఈ శిఖరాగ్ర చర్చలు తదుపరి కూడా కొనసాగించాలని ఇరుదేశాలూ తీర్మానించాయి. ఈక్రమంలో ఇనె్వస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఆసియన్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలనే అందుకున్నాయి.

02/01/2019 - 20:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వు బ్యాంకు నుంచి 28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుందని ఆశిస్తున్నట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ శుక్రవారం నాడిక్కడ వెల్లడించారు.

02/01/2019 - 20:37

హైదరాబాద్, ఫిబ్రవరి 1: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ శుక్రవారం త్రైమాసిక లాభాలను వెల్లడించింది. పన్నుల చెల్లింపుల అనంతరం దాదాపు 45 శాతం వృద్ధితో గత డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 485 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్టు సంస్థ వెల్లడించింది. గత యేడాది ఇదే కాలంలో రూ.334 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని తెలిపింది.

02/01/2019 - 20:36

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

02/01/2019 - 04:43

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే డబుల్ ధమాకా సాధించింది. ఓ పక్క ప్రయాణికుల టిక్కెట్ల అమ్మకాలు, రెండోవైపుసరుకు రవాణాతో భారీగా రాబడితో కాసుల వర్షం కురిసింది. సంక్రాంతి ప్రత్యేక రైళ్ల ద్వారా భారీగా ఆదాయం ఆర్జించింది. అలాగే 100 మిలియన్ల టన్నుల సరుకులు సరఫరా చేయడంతో ఇబ్బడి ముబ్బడిగా లాభాలొచ్చాయి. 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి 31 వరకూ రూ. 8,655 కోట్లు సాధించింది.

01/31/2019 - 22:17

న్యూఢిల్లీ, జనవరి 31: మన దేశంలో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల నమోదుకావడం అటు అధికారులను, ఇటు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నది. లక్ష్యాలను అందుకోవడంలో విఫలం కావడం, సరికొత్త వ్యూహ రచన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది.

01/31/2019 - 22:15

ముంబయి, జనవరి 31: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతోబాటు త్వరలో రానున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ దేశీయ మార్కెట్ సెంటిమెంటుకు ఊతమివ్వడంతో బ్యాంకింగ్, ఆటో, పార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ వాటాల కొనుగోళ్లు గురువారం ఊపందుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్ సూచీలు పుంజుకుని మంచి లాభాలను సంతరించుకున్నాయి.

01/31/2019 - 22:14

ముంబయిలో గురువారం జరిగిన పార్క్స్ సూపర్ కార్ షోలో పాల్గొని, 1919 సంవత్సరానికి చెందిన
ఫోర్డ్ కారుతో రేమాండ్స్ సంస్థ చైర్మన్/ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా. ఈ వింటేజ్ కారును ప్రదర్శించిన ఆయన సూపర్ కార్ క్లబ్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు

01/31/2019 - 22:12

న్యూఢిల్లీ, జనవరి 31: రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టులు (ఆర్‌ఈఐటీలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టుల (ఐఎన్‌వీఐటీలు) కోసం పెట్టుబడులకు సంబంధించిన నియమాలను సరళీకరిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదన చేసింది.

01/31/2019 - 22:11

న్యూఢిల్లీ, జనవరి 31: గత మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు గురువారం బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో జువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో తులం (పది గ్రాములు) బంగారం ధర గురువారం రూ.70 తగ్గి 34వేలకు చేరింది. అఖిల భారత సరాఫా అసోసియేషన్ గణాంకాల మేరకు వెండి మాత్రం కిలోపై స్వల్పంగా రూ.20 పెరిగి రూ.41,350కి చేరింది.

Pages