S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/10/2019 - 02:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: నిర్మాణంలో ఉన్న నివాస ఆస్తులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని వివిధ రాష్ట్రాల మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ ప్రతిపాదించింది. అంటే ప్రస్తుతం ఉన్న పన్నులో 3శాతం తగ్గించాలని కమిటీ సూచించింది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ నేతృత్వంలో ఈ మంత్రుల కమిటీని కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఏర్పాటు చేసింది.

02/10/2019 - 02:41

ముంబయి, ఫిబ్రవరి 9: మహిళ స్వయం సహాయక బృందాలు సాధికారతను సాధించేందుకు అవసరమైన వేదికను కేంద్రం ఏర్పాటు చేసిందని కేంద్రమంత్రి సురేష్ ప్రభు అన్నారు. మహిళల్లో పోటీతత్వాన్ని పెంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని ఆయన అన్నారు.

02/10/2019 - 03:11

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

02/08/2019 - 23:31

ఫరక్కా నుంచి పాట్నా వరకు రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఆర్‌ఐఎస్)ను శుక్రవారం అలహాబాద్‌లోని సంగంలో ఆవిష్కరిస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య.

02/08/2019 - 21:49

మాడ్రిడ్, ఫిబ్రవరి 8: స్పానిష్ సూపర్ మార్కెట్ గ్రూప్ ‘దియా’ ఆర్థిక ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో 2,100 ఉద్యోగాల్లో కోత విధించాలని నిర్ణయించింది. దియా గ్రూప్ ఇప్పటికే 352.5 మిలియన్ యూరోల నష్టంలో ఉంది. కంపెనీలో ప్రధాన వాటాదారుగా రష్యా ఉంది. 2018లో గ్రూపు 399.3 యూఎస్ డారల్ల నికర నష్టాన్ని చవిచూసింది.

02/08/2019 - 21:48

ముంబయిలో

బంగారం (22 క్యారెట్స్)

1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00

బంగారం (24 క్యారెట్స్)

1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10

వెండి

02/08/2019 - 21:46

ముంబయి, ఫిబ్రవరి 8: అపరిష్కృతంగా సాగుతున్న చైనా-అమెరికా వాణిజ్య వైరుద్ధ్యాలతోబాటు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎదురైన వ్యతిరేక పరిస్థితులు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఆటో, లోహ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు వాటాల విక్రయానికి పాల్పడంతో సెనె్సక్స్ 424 పాయింట్లు, నిఫ్టీ 125.80 పాయింట్ల వంతున నష్టపోయాయి.

02/08/2019 - 21:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తమ అంతర్జాతీయ విమాన సర్వీసులలో ఆన్‌బోర్డు అమ్మకాల నిమిత్తం భారత్ కరెన్సీ వాడకంపై ప్రస్తుతమున్న విదేశీ మారకద్రవ్య నిబంధనలను సవరించాలని బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో రిజర్వ్ బ్యాంకు అధికారులను కోరింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. దీనిని రిజర్వ్ బ్యాంకు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

02/08/2019 - 21:41

శాన్‌ఫ్రాన్సిక్కో, ఫిబ్రవరి 8: ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసి దానికి కారణాలను ఆన్‌లైన్‌లో చదివి ప్రాణాలు తీసుకుంటున్న దృశ్యాల ప్రసారంపై ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం మోపింది. ఇకపై ఈ తరహా దృశ్యాలు ప్రసారం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన ఒక టీనేజీ బాలిక ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో నమోదు చేశాడు.

02/08/2019 - 04:50

కాగజ్‌నగర్: నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గురువారం సాయంత్రం ఉత్పత్తి ప్రారంభం కావడంతో కాగజ్‌నగర్‌కు పూర్వ వైభవం వచ్చి మళ్లీ కళకళలాడే రోజులు వచ్చాయి. నాలుగన్నరేళ్లుగా పట్టణ ప్రజలు, కార్మికులు నిరీక్షిస్తున్న కళ నెరవేరడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

Pages