S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/03/2020 - 02:11

గన్నవరం, జనవరి 2: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో న్యూ కార్ పార్కింగ్, అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన మెయిన్ మేనేజ్‌మెంట్ ఆటోమెటిక్ టోల్ ప్లాజాను గురువారం విమానాశ్రయ డైరెక్టర్ ఎం మధుసూదనరావు ప్రారంభించారు. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

01/02/2020 - 23:56

గన్నవరం, జనవరి 2: విజయవాడ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించే విదేశీ ప్రయాణికుల సౌకర్యార్థం ముంబయి మీదుగా దోహా, అబుదాబీ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం మధుసూనరావు తెలిపారు.

01/02/2020 - 23:31

న్యూఢిల్లీ, జనవరి 2: ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువుల సంస్థ ఓఎన్‌జీసీ గురువారం జరిగిన టెండర్లలో ఏడు చమురు, సహజ వాయువుల బ్లాక్స్‌ను హస్తగతం చేసుకుంది. తాజా రౌండ్-4 వేలంలో కేవలం ఎనిమిది బిడ్లు మాత్రమే దాఖలవడం విశేషం. ఈమేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోబాటు ఆ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో ఓఎన్‌జీసీ ఈ కాంట్రాక్టు లైసెన్స్ ఒప్పందాలపై గురువారం సంతకాలు చేసింది.

01/02/2020 - 23:30

న్యూఢిల్లీ, జనవరి 2: గడచిన డిసెంబర్ మాసంలో తమ కంపెనీ మోటారు వాహనాల విక్రయాలు 14.67 శాతం తగ్గిపోయిందని టీవీఎస్ మో టార్ కంపెనీ గురువారం నాడిక్కడ వెల్లడించింది. 2019 డిసెంబర్‌లో మొత్తం 2,3,571 యూనిట్ల వాహన విక్రయాలు జరిగాయని తెలిపింది. 2018 డిసెంబర్‌లో 2,71,495 యూనిట్ల విక్రయాలు జరిగాయని వివరించింది.

01/02/2020 - 23:29

న్యూఢిల్లీ, జనవరి 2: బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ వినియోగదారులకు తక్కువ సబ్‌స్క్రిప్షన్ ధరతో అదనపుచానళ్ల సదుపాయాన్ని కల్పించనున్నట్టు నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ప్రకటించింది. ఈక్రమంలో స్టాక్ మార్కెట్లలో బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల వాటాలు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.

01/02/2020 - 23:29

న్యూఢిల్లీ, జనవరి 2: జిందాల్ ఉక్కు కర్మాగా రం (జేఎస్‌పీఎల్) వాటాలు గురువారం 4 శాతం లాభపడ్డాయి. గడచిన డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ముడి ఇనుమును తయారు చేసినట్టు ఆ కంపె నీ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్లో వాటాలను బలం చేకూరింది. బీఎస్‌ఈలో ఈ వాటాలు 4.27 శా తం లాభపడి ఒక్కో వాటా ధర 173.40కు చేరింది. ఇక జాతీ య స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈ వాటాలు 4.32 శాతం లాభపడ్డాయి.

01/02/2020 - 05:28

ముంబయి: వివిధ బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్ర త్యేక కోర్టులో చుక్కెదురైంది. చెల్లించాల్సిన అప్పులను తీర్చుకోవడానికి ఆయనకు సం బంధించిన చరాస్థులను ఉపయోగించుకోవచ్చని ప్రత్యేక న్యాయస్థానం ఎస్‌బీఐ నేతృత్వంలోని 15 బ్యాంకుల కన్సార్టియంకు అనుమతినిచ్చింది.

01/02/2020 - 05:27

హైదరాబాద్, జనవరి 1: డీజిల్, ఇతర ముడిసరుకుల ధరలు పెరగడంతో రైల్వే చార్జీలు స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ (హైదరాబాద్) నుంచి వివిధ ప్రాంతలకు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో పెరిగిన చార్జీల వివరాలను అధికారులు వెల్లడించారు. ప్యాసింజర్ రైళ్లల్లో చార్జీలను పాత పద్దతినే అమలు చేస్తున్నామన్నారు.

01/02/2020 - 04:47

హైదరాబాద్, జనవరి 1: హైదరాబాద్ గీతం డీమ్డ్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సురేంద్రబాబు మనుబోలు సూర్యకు ముంబైలోని అణుశక్తి విభాగానికి చెందిన అణుశక్తి పరిశోధనా బోర్డు భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ విషయాన్ని గీతం వర్శిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ బుధవారం నాడు తెలిపారు.

01/02/2020 - 05:32

ముంబయి, జనవరి 1: నూతన సంవత్సరం 2020 తొలి వాణిజ్య దినం దేశీయ స్టాక్ మార్కెట్లకు శుభారంభాన్నిచ్చింది. ఇన్పోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, లార్సన్ అండ్ టర్బో భారీ లాభాలను సంతరించుకోవడంతో నష్టాల బాటను అధిగమించిన స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. 2019 చివరి రోజైన మంగళవారం అధిక స్థాయిలో నష్టాలపాలైన స్టాక్ మార్కెట్లు మదుపర్లను నిరాశపరచిన సంగతి తెలిసిందే.

Pages