S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/01/2020 - 23:39

న్యూఢిల్లీ, జనవరి 1: వ్యవసాయ వ్యర్థాలతో కూడిన గుళికలను సైతం ఇకపై బొగ్గుతోబాటు విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించాలని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) నిర్ణయించింది. ఈమేరకు ఆరు మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థ గుళికలను సేకరించాలని తీర్మానించింది.

01/01/2020 - 23:34

న్యూఢిల్లీ, జనవరి 1: ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా రూ. 1000 కోట్లు సమీకరించాలని ‘అపీజయ్ సురేంద్ర పార్క్ హోటల్స్’ యా జమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోసం ఆ సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్‌తో కూడిన దరఖాస్తు అందజేసింది. ఈ ఐపీఓలో రూ. 400 కోట్ల తాజా ఇస్యూతోబాటు మరో రూ. 600 కోట్ల విలువైన ‘ఆఫర్ ఫర్ సేల్’ (ఓఎఫ్‌ఎస్) ఇస్యూ ఉన్నాయి. ఓఏఫ్‌ఎస్ ద్వారా సమీకరిం చే మొత్తంలో రూ.

01/01/2020 - 23:32

న్యూఢిల్లీ, జనవరి 1: దేశవ్యాప్తంగా వౌలిక వసతుల రంగానికి చెందిన 388 ప్రాజెక్టులు అదనపు వ్యయ భారంతో అలమటిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు విలువ సుమారు రూ. 150 కోట్లుకాగా వీటి నిర్మాణంలో వివిధ కారణాలతో జాప్యం నెలకొని సుమారు రూ. 4లక్షల కోట్ల మేర అదనపు వ్యయభారం పడింది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ రూ. 150 కోట్లు, అంతకుమించిన వ్యయ అంచనాలతో కూడిన వౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

01/01/2020 - 05:22

న్యూఢిల్లీ: దేశాన్ని 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేసేందుకు 102 లక్షల కోట్ల జాతీయ వౌలిక సదుపాయాల పెట్టుబడుల పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంధనం, రైల్వే, పట్టణ, రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో పెద్ద ఎత్తున వౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.

01/01/2020 - 04:33

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం తొలి రోజునే అమలులోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం రైల్వే చార్జీలను పెం చింది. సబర్బన్ రైళ్లకు ఈ పెంపుదల నుంచి మినహాయింపునిస్తూ ఆర్డిన రీ, నాన్ ఏసీ, నాన్ సబర్బన్ చార్జీల ను కిలోమీటర్‌కు పైసా చొప్పున పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసిం ది.

12/31/2019 - 23:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అంతర్జాతీయ సానుకూలతతో దేశీయంగా బంగారు ధరలు మంగళవారం మరోమారు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ. 256 పెరిగి మొత్తం ధర 39,985కు చేరింది. అలాగే వెండి ధర సైతం కిలోపై రూ. 494 పెరిగి మొత్తం ధర రూ. 48.313కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,524.30 డాలర్లుగా ట్రేడైంది. వెండి ధర 10.10 డాలర్లు పలికింది.

12/31/2019 - 23:53

గత కొన్ని నెలలుగా ఉల్లి రేటు ఘాటు జనానికి కన్నీళ్లే తెప్పించింది. ఇది నిత్య వినియోగ వస్తువు కావడం, పైగా దాని ధరలు గగన విహారం చేయడంతో దిక్కుతోచక ఇటు ప్రజలు, అటు వర్తకులు డీలా పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది అయినా ఉల్లి ఉపశమనం ఇస్తుందా అన్న ఆశతో ఉల్లిపాయలను 2020 ఆకృతిలో అమర్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న సిమ్లాలోని వర్తకులు

12/31/2019 - 23:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది 2020లో సరికొత్త గరిష్ట స్థాయి లాభాలను ఆర్జిస్థాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. సూచీలు కనీసం 12 నుంచి 15 శాతం అదనంగా లాభపడే అవకాశాలున్నాయంటున్నారు. ఇందుకు వచ్చే ఏడాది జరిగే ఆర్థికాభివృద్ధి ప్రధాన కారణమవుతుందని అంచనా వేస్తున్నారు.

12/31/2019 - 23:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బీమా నియంత్రణ సంస్థ ఇర్దాయ్ మంగళవారం ‘హీరో ఇన్సూరెన్స్ బ్రోకింక్ ఇండియా’ కంపెనీపై కొరడా ఝళిపించింది. నిబంధనలకు నీళ్లొదిలిన ఆ కంపెనీకి రూ. 2.18 కోట్ల జరిమానా విధించింది.

12/31/2019 - 23:13

ముంబయి, డిసెంబర్ 31: ఏటీఎంలలో జరుగుతున్న అనధికారిక లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) సరికొత్త చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు జరిగే లావాదేవీల్లో రూ.10 వేలకు పైబడిన లావాదేవీలకు ఇకపై వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చినట్టు ఆ బ్యాంకు మంగళవారం నాడిక్కడ ప్రకటించింది.

Pages