S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/27/2019 - 05:02

హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు బయలుదేరే హైదరాబాద్ నగరవాసులకు మస్తు బస్సులు నడుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని మారుమూల ప్రాంతాలకు సైతం టీఎస్ ఆర్టీసీ బస్సులు సిద్ధం అవుతున్నాయి. ప్రత్యేక బస్సుల్లో అధనపు చార్జీలు వసూళ్లు చేస్తామని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగుల్లో ఒకటైన సంక్రాంతి పండుగుకు బయలు దేరడానికి నగరవాసులు రిజర్వేన్ల కోసం పోటీపడుతున్నారు.

12/27/2019 - 00:35

విజయవాడ: రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా గురువారం 104 కోట్ల రూపాయలను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులకు ప్యాకేజీల వారీగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను టిడ్కో నిర్వహిస్తోంది. నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించిన ప్యాకేజీలో 942 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 19,296 యూనిట్ల నిర్మాణానికి

12/27/2019 - 04:48

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయం పన్ను విధానాన్ని సంపూర్ణంగా సంస్కరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి మినహాయింపులు లేని ‘్ఫ్లట్’ ఆదాయం పన్ను, అధిక ఆదాయం ఉన్న వారికి కొత్త స్లాబ్‌లు, వ్యక్తిగత ఆదాయం పన్ను తగ్గింపువంటి ప్రతిపాదనలను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

12/26/2019 - 23:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: రైల్వే చార్జీలు పెరగనున్నాయా? రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఔనన్నట్లుగానే సమాధానం ఇస్తున్నాయి. ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీల పెంపు యోచనపై మీమాంసలో ఉన్నట్లు యాదవ్ గురువారం తెలియజేశారు. అయితే, చార్జీలను పెంచుతారా? అని అడిగిన ప్రశ్నను ఆయన తిరస్కరించారు.

12/26/2019 - 05:32

వాచెంగ్డ: అమెరికాతో వాణిజ్య సంబంధాల విషయంలో క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న చైనా ఈ విషయంలో తన పొరుగు దేశాలతో స్నేహ బంధాన్ని విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. ప్రధానంగా జపాన్, దక్షిణ కొరియాలతో వౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన అంశాలపై వాణిజ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు చైనా కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పొరుగు దేశాల ప్రతినిథులతో ఈ వారం విస్తృతంగా చర్చలు సాగిస్తోంది.

12/26/2019 - 00:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుల్లో సమాచారాన్ని పంచుకున్న వ్యవహారాల్లో అవినీతికి పాల్పడిన వారికి విధించే శిక్ష లు, లేదా జరిమానాలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సరికొత్త విధానాలను చేపట్టింది. ఈ సరికొత్త మార్గదర్శకాల మేరకు పంచుకున్న సమాచారానికి సంబంధించిన వనరుల వివరాలను వెల్లడించాలి. ఐతే సమాచారాన్ని అందజేసిన వ్యక్తి, లేదా సంస్థ వివరాలను గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.

12/26/2019 - 00:17

ముంబయి, డిసెంబర్ 25: ఈఏడాది భారత్ కృత్రిమ మేథస్సుకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. సంబంధిత ఉద్యోగుల శాతాన్ని ఇప్పటికే ద్విగుణీకృతం చేసింది. ఇందుకు ప్రధానంగా సాంకేతికాభివృద్థి, వాణిజ్య మేథస్సు విస్తరణ వంటి అంశాలు దోహదం చేశాయని తాజా అధ్యయనం తేల్చింది. ఐతే ఇందుకు అనుగుణంగా నైపుణ్యాభివృద్థి జరగకపోవడం వల్ల ఇందుకు సంబంధించిన ఉద్యోగాల్లో అనేక ఖాళీలు ఇప్పటికీ పేరుకుపోయి ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది.

12/25/2019 - 04:41

న్యూఢిల్లీ: భారత కేపిటల్ మార్కెట్ కళకళలాడడం ఖాయంగా కనిపిస్తున్నది. అంతర్జాతీయంగా ద్రవ్య లబ్ధత మెరుగు పడడంతో, దాని ప్రభావంతో దేశీయ కేపిటల్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చి చేరుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలోనే విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) సుమారు 38,211 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు.

12/25/2019 - 01:52

విజయవాడ, డిసెంబర్ 24: జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (ఆంధ్రప్రదేశ్)పై ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించి 7.9 శాతం వడ్డీ చెల్లింపును ప్రభుత్వం కొనసాగించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ వడ్డీ చెల్లింపు వరిస్తుంది. జీపీఎఫ్ సహా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇతర ఫండ్స్‌కు ఈ నిర్ణయం వర్తిస్తుంది.

12/24/2019 - 22:51

ముంబయి, డిసెంబర్ 24: చివరి క్షణాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 30 షేర్ సూచీలు ప్రారంభంలో పెరిగినప్పటికీ, లావాదేవీలు చివరి దశకు చేరుకున్నప్పుడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా యి. ఫలితంగా సెనె్సక్స్ 181.40 పాయింట్లు (0.44 శాతం) పతనమై, 41,461.26 పాయింట్లకు చేరింది.

Pages