S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/30/2019 - 04:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారత్‌లో పారిశ్రామిక, వాణిజ్య ఔత్సాహికులు (ఎంటర్‌ప్రెన్యూర్స్) గణనీయ శక్తితో ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టిన మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి తన దృష్టిని రాజకీయాల వైపు మార్చ డం మంచి పరిణామం కాదని ఫ్రెంచ్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త గై సోర్మన్ హితవుపలికారు.

12/30/2019 - 04:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: భారతీయ ఉక్కు సాధికార సంస్థ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ‘సెయిల్’)కు తదుపరి చైర్మన్ ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా ప్రఖ్యాతిగాంచిన సెయిల్‌కు ప్రస్తుత చైర్మన్ ఏకే చౌదరి 2018 సెప్టెంబర్‌లో బా ధ్యతలు చేపట్టారు. వచ్చే 2020 డిసెంబర్‌తో ఆయన పదవీకాలం ముగుస్తుం ది.

12/30/2019 - 03:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: వివిధ సంస్ధల్లో యాజమాన్యాలకు, కార్మికుల మధ్య నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి ‘సంతుష్ట్’ పేరిట ఓ ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది. వచ్చే నెలలో ఆవిష్కృతం కానున్న ఈ పోర్టల్ ద్వారా క్రింది స్థాయి నుంచి కార్మిక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలన్న ప్రధాన లక్ష్యం ఉందని సంబంధిత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

12/29/2019 - 04:25

ముంబయి: క్రిస్మస్ సందర్భంగా ఒక రోజు సెలవు రావడంతో, నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ జరిగిన ఈవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 106.40 పాయింట్లు, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 26 పాయింట్లు పతనమయ్యాయి.

12/29/2019 - 02:19

తిరుపతి, డిసెంబర్ 28: భారతదేశం త్వరలోనే ఆర్థిక మాంధ్యంను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రముఖ ఆర్థిక విశే్లషకులు డి.పాపారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి అధ్యక్షతన శనివారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ‘సంక్షోభంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై సదస్సు జరిగింది.

12/29/2019 - 02:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రూపే, యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి కేంద్రం ప్రభుత్వం ఊరట కల్పించింది. మర్చెంట్ డిస్కంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలను ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో శనివారం ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/27/2019 - 04:39

న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీకే) పింఛన్ పథకంలో సబ్‌స్క్రైబర్లుగా మారేందుకు ఇకపై ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ గురువారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ద్వారా జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) లబ్ధిదారులకు ఏడాదికి 8 శాతం రేట్ ఆఫ్ రిటర్న్ చెల్లిస్తుంది. 2017-18, 2018-19 కేంద్ర బడ్జెట్లలో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది.

12/27/2019 - 04:37

ముంబయి, డిసెబంర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజైన గురువారం సైతం నష్టాల బాటలో నడిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల కాలవ్యవధి ముగుస్తుండటంతో మదుపర్లు ఆచితూచి అడుగేసినట్టు విశే్లషకులు అంచనావేస్తున్నారు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఇంట్రాడేలో ఏకంగా 328.37 పాయింట్ల దిగువకు జారిపోయింది.

12/27/2019 - 04:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆరోగ్య రక్షణ (హెల్త్‌కేర్) సేవలకు జీరో రేటింగ్ జీఎస్టీ విధానాన్ని అమలు చేయాలని హెల్త్‌కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఏటీహెచ్‌ఈఏఎల్‌టీహెచ్) గురువారం నాడిక్కడ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అలాగే ఈ రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక ఆర్థికావసరాలు, నిధుల సహకారం విషయంలో ప్రాధాన్యతను ఇవ్వాలని కోరింది.

12/27/2019 - 04:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: త్వరలో అమల్లోకి రానున్న 5జీ నెట్‌వర్క్‌లో కొత్తగా 24.75 నుంచి 27.25 గిగాహెడ్స్ బ్యాండ్ల విక్రయాల నిమిత్తం కొన్ని సవరణలను, ధరల విధానాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా టెలీకమ్యూనికేషన్ల శాఖ ట్రాయ్‌ను కోరనుంది. బహుశా వచ్చే ఏడాది ఆరంభం, లేదా ప్రథమార్థంలో ఈ కొత్త స్పెక్ట్రం వేలం జరుగనున్న దృష్ట్యా ప్రతిబంధకాలను తొలగించుకునే విషయంపై టెలికాం శాఖ దృష్టి సారించింది.

Pages