S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/31/2019 - 23:13

ముంబయి, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు 2019 చివరి రోజైన మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెనె్సక్స్ 304.26 పాయింట్లు, నిఫ్టీ 87.40 పాయింట్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచే మంచి లాభాలతో ఆరంభమైన సెనె్సక్స్ పరుగు ఇంట్రాడేలో 423 పాయింట్లు అదనంగా లాభపడింది.

12/31/2019 - 05:02

ముంబయి: పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు తరహా భారీ కుంభకోణాలకు భవిష్యత్తులో తావులేకుండా ఉండేందుకు ఆర్‌బీఐ కఠిన చర్యలను తెరపైకి తేబోతోంది. పట్టణ సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలను గరిష్ఠస్థాయిలో కుదించే చర్యలను సోమవారంనాడు చేపట్టింది. ఒకే సంస్థ లేదా ఒకే గ్రూప్‌కు 10 శాతం, 20 శాతం మించి రుణాలను ఇవ్వడానికి వీల్లేదని నిబంధన విధించింది.

12/31/2019 - 04:39

హైదరాబాద్, డిసెంబర్ 30: దేశంలో వ్యాపార రంగానికి 2019 గడ్డు పరిస్థితినే మిగిల్చిందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలతో 2020 సంవత్సరంలోనైనా సానుకూలత ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యాపార, వాణిజ్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.

12/31/2019 - 02:02

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 30: వినియోగదారులకు మార్కెటింగ్ శాఖ అధికారులు సరఫరా చేయాల్సిన ఉల్లిపాయలకు వారం పాటు విరామం వచ్చింది. మహారాష్టల్రోని షోలాపూర్ ఉల్లిపాయల దిగుబడికి ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. టర్కీ, ఈజిప్టు నుండి ఉల్లిపాయలు కొనాల్సి వచ్చింది. సముద్ర యానం ద్వారా రావాల్సిన సరుకు సకాలంలో చేరటం లేదు.

12/30/2019 - 23:24

ముంబయి, డిసెంబర్ 30: దేశీయంగాను, అంతర్జాతీయంగాను ఎలాంటి స్పష్టమైన సంకేతాలు లేని నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ స్పందనతోనే ముగిశాయి. సోమవారం వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ లావాదేవీలు ముగిసేనాటికి 17.14 పాయింట్లు పెరిగి 41,568 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10.05 పాయింట్లు పుంజుకుని 12,255.85 పాయింట్ల వద్ద ముగిసింది.

12/30/2019 - 23:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: అంతర్జాతీయంగా అనిశ్చిత మార్కెట్ పరిస్థితులు, రక్షిత వాదం బలంగా నెలకొన్న నేపథ్యంలో కూడా భారతీయ ఎగుమతులు సమీప భవిష్యత్తులో 330-340 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారుల సంస్థ (ఎఫ్‌ఐఈఓ) సోమవారంనాడు వెల్లడించింది.

12/30/2019 - 23:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: వెండర్లకు చెల్లించాల్సిన దాదాపు 1,700 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ చెల్లించిందని దాని సీఎండీ సీకే పుర్వార్ వెల్లడించారు. అలాగే, ఉద్యోగుల నవంబర్ జీతాలు కూడా చెల్లించినట్టు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ కాంట్రాక్టర్లు, వెండర్లకు 1,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినప్పటికీ రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం 10వేల కోట్ల రూపాయల మేర ఉందని తెలిపారు.

12/30/2019 - 04:48

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లలో ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడిదారులే అధిక సంఖ్యలో వాటాలు కొనుగోళ్లు చేశారు. గత శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారం వరకు ఈనెలలో రూ. 2,613 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న ఆర్థికాభివృద్ధి చర్యలతో కార్పొరేట్ సంస్థల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న ఆశావహ దృక్పథమే ఇందుకు ప్రధాన కారణమని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు.

12/30/2019 - 04:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) రూపకల్పన అన్నది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారమని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. రెండు దేశాల సరిహద్దు పరిరక్షక దళాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నాయని బీజీబీ డైరెక్టర్ జనరల్ షఫీనుల్ ఇస్లాం ఆదివారంనాడు ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

12/30/2019 - 04:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మనదేశం ఆర్థికంగా వచ్చే 2020లో గణనీయంగా పుంజుకుంటుందని ‘్భరత పరిశ్రమల సమాఖ్య’ (సీఐఐ) ఆదివారం నాడిక్కడ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్య ఉద్రిక్తతలు, కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకులు సంయుక్తంగా తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి ఆలంబన అవుతాయని తెలిపింది.

Pages