S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/30/2018 - 04:33

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో అంచనా కంటే ఎక్కువగా రూ.47వేల కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ ఇండియా ఆడిట్‌లో తేలింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు బ్యాంకుల బకాయిలను ఆడిటర్లు లెక్కించారు. పెద్ద బ్యాంకుల జాబితాలో ఐడిబిఐ లేనన్పటికీ, ఈ బ్యాంకు మొండి బకాయిలు రూ. 56వేల కోట్లకు చేరడం గమనార్హం.

05/30/2018 - 01:09

ముంబయి, మే 29: త్వరలో రిజర్వు బ్యాంక్ ఇండియా ప్రకటించే ద్రవ్య విధానంపై భగ్గుమంటున్న చమురు ధరల ప్రభావం పడే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే నెల 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ద్రవ్య విధానంపై ఆర్‌బిఐ సమీక్షించనుంది. గతంలో ప్రతి రెండు నెలలకోసారి రెండురోజుల పాటు ఆర్‌బిఐ ద్రవ్య విధానాన్ని సమీక్షించేది. మొదటిసారిగా మూడు రోజులపాటు ఆర్‌బిఐ ద్రవ్య విధానాన్ని సమీక్షించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

05/30/2018 - 01:07

ముంబయి, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల లాభాలకు తెరపడింది. బ్యాంకింగ్, ఇతర రంగాల షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం 216 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 55.35 పాయింట్లు దిగజారింది.

05/30/2018 - 01:05

న్యూఢిల్లీ, మే 29: పంటలకు తగ్గట్టుగా ఎరువులను తయారు చేసే మిశ్రమ ఎరువుల సంస్థలు యూరియా, డిఏపిని రిటైలర్ల నుంచి కొనుగోలు చేస్తేనే సబ్సిడీ లభిస్తుంది. ప్రస్తుతం కేంద్రం గత ఆరునెలలుగా నేరుగా నగదు బదలాయింపుస్కీంను (డిబిటి) అమలు చేస్తున్న విషయం విదితమే. యూరియా, డిఏపి తయారు చేసే సంస్థలకే ప్రస్తుతం సబ్సిడీ లభిస్తోంది.

05/30/2018 - 01:04

ముంబయి, మే 29: రిజర్వ్ బ్యాంకు మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా ఎన్‌ఎస్‌డీఎల్ వైస్ ప్రెసిడెంట్ సుధా బాలకృష్ణన్ నియమితులయ్యారు. సంస్థాపరమైన మార్పుల్లో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నారని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన బాలకృష్ణన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ర్యాంకులో పనిచేస్తారు. ఈ కొత్త పోస్టును గత ఏడాది మే నెలలో ఆర్‌బీఐ సృష్టించింది.

05/29/2018 - 04:24

భువనేశ్వర్: అంతర్జాతీయ మార్కెట్లకనుగుణంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు కళ్లెం వేసే లక్ష్యంతో దీర్ఘకాలిక ఏకీకృత వ్యూహాన్ని అనుసరించేవిధంగా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అయితే ఈ వ్యూహానికి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. వరుసగా 15వ రోజైన సోమవారం చమురు ధరలు పెరిగాయి.

05/29/2018 - 01:20

ముంబయి, మే 28: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గిపోవడం, రూపాయి బలపడటంతో సోమవారం దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో కొనసాగాయి. ఫలితంగా సెనె్సక్స్ 35,000 బెంచ్‌మార్క్‌ను దాటగా నిఫ్టీ 10,700 స్థాయిని దాటింది. దేశీయ మదుపర్లు కొనుగోళ్లను సాగించడంతో మార్కెట్ల జోష్ కొనసాగింది.

05/29/2018 - 01:18

న్యూఢిల్లీ, మే 28: జర్మనీకి చెందిన లగ్జరీకార్ల ఉత్పత్తి సంస్థ ఆడి భారతీయ మార్కెట్‌లో, ఎంపిక చేసిన కొన్ని మోడల్ కార్లపై రాయితీలను ప్రకటించింది. ఈ రాయితీలు రూ.10 లక్షల వరకు ఉండటం గమనార్హం. దేశీయంగా కార్ల పోటీని తట్టుకోవడం కోసమే ఈ రాయితీయలు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.7 లక్షలనుంచి, రూ.10 లక్షల వరకు రాయితీలు ఉంటాయని కంపెనీ తెలిపింది.

05/29/2018 - 01:16

న్యూఢిల్లీ, మే 28: టెక్ దిగ్గజం గూగుల్ వేసవి సెలవుల్లో, పిల్లలు, తల్లిదండ్రులకోసం కొత్త విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ‘సమ్మర్ విత్ గూగుల్’ కార్యక్రమంలో భాగంగా 13-18 సంవత్సరాల మధ్య వయసున్న టీనేజర్లకు అవసరమైన వివిధ కృత్యాలను గూగుల్ అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ ఇండియా డైరెక్టర్ (ట్రస్ట్ అండ్ సేఫ్టీ) సునీతా మెహంతీ వెల్లడించారు.

05/28/2018 - 03:19

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవల వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గత ఆరునెలల్లో వైఫై సేవల వినియోగం 190 శాతం వృద్ధి చెందింది. దాదాపు 95 టెరాబైట్ డాటా వివినియోగం జరిగినట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ పేర్కొంది. రూరల్ బ్రాడ్ బాండ్ ప్రాజెక్టు భారత్ నెట్ కింద వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేశారు. భారత్ నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వైఫై సేవలను అందిస్తున్నారు.

Pages