S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/02/2018 - 02:33

ముంబయి, జూన్ 1: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఒకవైపు సానుకూలంగా ఉన్నప్పటికీ, అమెరికా నిర్ణయాలతో తలెత్తిన వాణిజ్య వివాదాలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయేమోనన్న తాజా భయాందోళనల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా నష్టపోయాయి.

06/02/2018 - 02:31

హైదరాబాద్ జూన్ 1 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్ప త్తిలో సింగరేణి అత్యధిక రికార్డు సృష్టించిందని సింగరేణి సంస్థ సిఎండి శ్రీ్ధర్ వెల్లడించారు. దీంతో 11.6 శాతం బొగ్గు రవాణాలో కూడా లక్ష్యాలను సాధించామని ఆయన అన్నారు. గత ఏడాది మే నెలలో సింగరేణి సంస్థ 52,4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, అదే ఈ ఏడాది 58.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని చెప్పారు.

06/02/2018 - 02:30

న్యూఢిల్లీ, జూన్ 1: నష్టాల నుంచి రెండేళ్లలో తేరుకుంటామని, ఈ మేరకు గడువు ఇవ్వాలని కోరుతూ తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్ధలు కేంద్రానికి ఒక కార్యాచరణ ప్రణాళికతో కూడిన నివేదిక ఇచ్చాయి. ఈ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని ప్రస్తుతం ఆర్‌బిఐ నిశితంగా పరిశీలిస్తోంది.

06/02/2018 - 02:29

న్యూఢిల్లీ, జూన్ 1: ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ ముందస్తు ప్రణాళిక ప్రకారం వార్షిక సెలవుపై వెళ్లారని, బ్యాంకు బోర్డు వత్తిడిపై సెలవుపై వెళ్లారన్న ప్రచారంలో నిజంలేదని ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఈ విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని బ్యాంకు ప్రకటనలో పేర్కొంది.

06/02/2018 - 02:29

న్యూఢిల్లీ, జూన్ 1: యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌కు సంబంధించిన నిధుల అక్రమ తరలింపు కేసులో విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను సెక్యూరిటీస్ మార్కెట్లనుంచి మరో మూడేళ్ల పాటు సెబీ నిషేధించింది. ఇదే సమయంలో లిస్టెడ్ కంపెనీల జాబితాలో డైరెక్టర్‌గా మరో ఐదేళ్లపాటు నిషేధించింది. దీంతో పాటు ఇద్దరు మాజీ కంపెనీ డైరెక్టర్లయిన అశోక్ కపూర్, పి.ఎ. మురళిలపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

06/02/2018 - 02:28

న్యూఢిల్లీ, జూన్ 1: స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపునకు చెందిన రూ.4,700 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. గుజరాత్‌కు చెందిన ఈ సంస్థ రూ.5వేల కోట్ల మేర బ్యాంకు కుంభకోణానికి పాల్పడిందన్న అరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకుంది. ఈ సంస్థపై గత అక్టోబర్‌లో కేసు నమోదు చేసిన ఈడీ, ఇప్పుడు ఆస్తులను జప్తు చేసింది.

06/02/2018 - 02:28

విశాఖపట్నం, జూన్ 1: విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడం, ఏసీల వినియోగం తారాస్థాయికి చేరడం, పరిశ్రమలకు కోతల్లేని సరఫరాను అందివ్వడంతో విద్యుత్ వాడకం విపరీతంగా ఉంటోంది.

06/01/2018 - 01:59

ముంబయి, మే 31: డిపాజిటర్లకు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు చెప్పింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేస్ పాయింట్లు పెంచింది. మే 28 నుంచి బ్యాంకు ఏడాది, రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ 6.65 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంతకు ముందు ఇది 6.60 శాతంగా ఉండేది.

06/01/2018 - 00:15

ముంబయి, మే 31: ఎయిర్ ఇండియాలో మెజార్టీ వాటాలను విక్రయించాలన్న అంశంపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఈ సంస్ధ వాటాలను విక్రయించేందుకు గురువారంతో గడువు ముగిసింది. ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఒక్క బిడ్‌ను కూడా సంస్థలు దాఖలు చేయలేదు. ఈ సంస్థ వాటాలను కొనుగోలు చే సేందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకు రావడంలేదని, తమను సంప్రదించడం లేదని విమానయాన మం త్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌదరి చెప్పారు.

06/01/2018 - 00:13

న్యూఢిల్లీ, మే 31: చెరకు రైతులకు మిల్లర్లు బకాయి ఉన్న రూ.22వేల కోట్లను క్లియర్‌ చేసేందుకు వీలుగా మూడు మిలియన్ టన్నుల చక్కెర నిల్వలను ఏర్పాటు చేయనున్నట్లు ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. 2017-18లో రికార్డు స్థాయిలో 31.6 మిలియన్ టన్నుల చెరకు ఉత్పత్తి జరిగిందన్నారు. దీని వల్ల చక్కెర ధరలు తగ్గి చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు.

Pages