S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/04/2018 - 01:25

న్యూఢిల్లీ, జూన్ 3: ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఉన్నతోద్యోగులు, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), బ్యాంకింగ్ కుంభకోణాలపై పార్లమెంటరీ ప్యానల్‌కు సోమవారం సంక్షిప్తంగా వివరించనున్నారు. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్‌కు చెందిన అధికార్లు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థారుూ సంఘం ఆదేశాలు జారీచేసింది.

06/04/2018 - 01:25

లండన్, జూన్ 3: ముంబయి నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ప్రారంభించి సరీగ్గా 70 ఏళ్లు నిండాయి. ఈ రెండు నగరాల మద్య 1948లో తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. తొలినాళ్లలో ఈ విమాన సర్వీసు లో ప్రయాణించిన భారత సంతతి వారు తమ అనుభవాలను పంచుకోవాలని ఎయిర్ ఇండియా పిలుపునిచ్చింది.

06/04/2018 - 01:24

ముంబయి, జూన్ 3: స్టార్టప్‌లకు నిర్దేశించిన నిధులను పెట్టుబడి పెట్టడంలో విఫలమవుతున్న భారతీయ స్టేట్ బ్యాంకు, నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. ‘మాది ప్రభుత్వరంగ సంస్థ. స్టార్టప్‌ల్లో పెట్టుబడి సాధారణంగా అధిక రిస్క్‌తో కూడుకున్నది. సంప్రదాయ మార్గంలో జరిపే పెట్టుబడుల వల్ల ప్రయోజనం లేదన్న అంశాన్ని మేం అర్థం చేసుకున్నాం’ అని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు.

06/03/2018 - 02:42

న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం అభివృద్ధి చేసేందుకు వీలుగా భారత్‌లో విమానాలను తయారు చేసే సంస్థను నెలకొల్పాల ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్‌ను కోరారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు చేయూత ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఫ్రాన్స్‌లో టౌలౌజ్‌లో ఎయిర్ బస్ విమానాల నిర్మాణాల సంస్థను సందర్శించారు.

06/03/2018 - 02:20

న్యూఢిల్లీ, జూన్ 2: తమకు అత్యవసరంగా జూన్ నెలవసరాలకు అదనంగా ఒక మిలియన్ బారెల్స్ ముడి చమురును సమకూర్చాలని భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీని కోరింది. అమెరికా ఏ క్షణమైనా ఆంక్షలు విధిస్తుందన్న సమాచారం నేపథ్యంలో బిపిసిఎల్ సంస్థ ముందు జాగ్రత్తగా ముడి చమురుకు ఆర్డర్ ఇచ్చింది. ఇరాన్ పెట్రోలియం రంగంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.

06/03/2018 - 02:18

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఎగుమతుల విభాగంలో స్టార్ పెర్‌ఫార్మర్ అవార్డును దక్కించుకుంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల సహాయ మంత్రి సీఆర్ చౌదరి చేతుల మీదుగా విశాఖ ఉక్కు మార్కెటింగ్ జీఎం ఎస్‌కే చక్రబర్తి అందుకున్నారు.

06/03/2018 - 02:16

ముంబయి, జూన్ 2: అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 302.39 పాయింట్లు పుంజుకొని 35,227.26 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 91.05 పాయింట్లు పెరిగి 10,696.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.

06/03/2018 - 02:14

న్యూఢిల్లీ, జూన్ 2: దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల మార్కెట్లో వరుసగా రెండో నెల మేలో కూడా రెండు అంకెల వృద్ధిరేటుతో అమ్మకాలను నమోదు చేశాయి. మారుతి సుజుకి ఇండియా, టాటామోటార్స్, హోండా కార్ల అమ్మకాల్లో వృద్ధిరేటు నమోదైంది. ఫోర్డ్ ఇండియా కూడా రెండు అంకెల వృద్ధిరేటు నమోదు చేయగా, హోండాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా మహీంద్రా దేశీయ మార్కెట్లో సింగిల్ డిజిట్ వృద్ధిరేటును నమోదు చేశాయి.

06/03/2018 - 02:12

భీమవరం, జూన్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగ సంక్షోభం తాత్కాలికమేనని నెల్లూరుకు చెందిన బీఎంఆర్ సంస్థ ఛైర్మన్ బీ మస్తాన్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించి ఆదుకుంటున్నారన్నారు.

06/02/2018 - 04:13

న్యూఢిల్లీ: వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) వసూళ్లు మే నెలలో రూ.94,016.16 కోట్లు వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ. 1.03 లక్షల కోట్ల జిఎస్‌టి వసూలైంది. ఏప్రిల్ నెలపైన తగ్గినా, మొత్తం పైన పన్ను వసూళ్ల తీరు సంతృప్తికరంగా ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి హష్ముక్ ఆదియా పేర్కొన్నారు. మే నెలలో 62.47 లక్షల మంది, ఏప్రిల్ నెలలో 60.47 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారు.

Pages