S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/26/2018 - 02:03

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో పనిచేస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అల్లాడుతున్నాయి. దీని వల్ల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. తక్షణమే బొగ్గును సేకరించి థర్మల్ ప్లాంట్లకు కొరత రాకుండా చూసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది.

05/26/2018 - 01:47

ముంబయి, మే 25: ఐసిఐసిఐ బ్యాంకు సిఇవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌కు సెబి సంస్థ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్, నూపవర్ సంస్థలో ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా ఈ సంస్ధలతో ఐసిఐసిఐ ఆర్థిక వ్యవహరాలు నడిపారనే అభియోగాలు వచ్చిన విషయం విదితమే. త్వరలో సెబి ఇచ్చిన నోటీసును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నివేదికను సెబికి సమర్పిస్తామని ఐసిఐసిఐ పేర్కొంది.

05/26/2018 - 01:21

న్యూ ఢిల్లీ, మే 25: వ్యక్తుల గోప్యతను కాపాడేందుకు తక్షణమే డాటా రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిన్మయ్ అరుణ్ అన్నారు.

05/26/2018 - 01:19

న్యూఢిల్లీ, మే 25: ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపు, వీసాలపై ఆంక్షలు అంశాలపై ఐదు రోజుల అమెరికా పర్యటనలో ఆ దేశ ఉన్నతాధికారులతో వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చర్చించనున్నారు. సురేష్ ప్రభు ఐదు రోజుల అమెరికా పర్యటన జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆయన అమెరికాలో అమెరికా వాణిజ్య ప్రతినిధి, అమెరికన్ వాణిజ్య సెక్రటరీ (యుఎస్‌టిఆర్)తో విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు.

05/26/2018 - 01:13

విజయవాడ, మే 25: దేశంలోనే తొలిసారిగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌పై డిజిటల్ రుణాల మంజూరు ప్రక్రియను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేపట్టింది. ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ సీఎఎంఎస్ భాగస్వామ్యంతో శుక్రవారం నుంచి రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గత ఏడాది లోన్స్ ఎగెనెస్ట్ సెక్యూరిటీస్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

05/26/2018 - 01:49

ముంబయి, మే 25: దేశీయ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లోనే ముగిసాయి. రూపాయి కోలుకోవడం, దేశీయ సంస్థాగత మదుపర్లు నిరంతరం కొనుగోళ్లు జరపడం మార్కెట్ల జోరుకు కారణమని బ్రోకర్లు తెలిపారు. ఫలితంగా సెనె్సక్స్ 261 పాయింట్లు లాభపడి 34,924.87 వద్ద ముగియగా, నిఫ్టీ 91.30 పాయింట్ల లాభంతో 10,605.15 వద్ద ముగిసింది.

05/25/2018 - 02:51

ముంబయి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), బ్యాంకింగ్, లోహ, ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ తిరిగి 318 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి కీలకమయిన 10,500 స్థాయికి పైన ముగిసింది.

05/25/2018 - 00:59

న్యూఢిల్లీ, మే 24: పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం రికార్డు స్థాయికి చేరుకోవడంతో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రమైంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఒక పరిష్కారం కనుగొనాలంటూ అన్నివైపులనుంచి ప్రభుత్వంపై వత్తిళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోధరలు మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచే స్థాయిలో పెరగడం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది.

05/25/2018 - 00:58

న్యూఢిల్లీ, మే 24: రాష్ట్రాలు పెట్రోల్‌పై విధించే పన్నును తగ్గించాలని, ఇదే సమయంలో కేంద్రం పెరుగుతున్న చమురు ధరల ప్రభావం లేకుండా కొంత మేర ఆర్థిక వెసులుబాటును కల్పించాలని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను వరుసగా 11వ రోజు కూడా పెంచేశాయి.

05/25/2018 - 00:57

న్యూఢిల్లీ, మే 24: విదేశీపెట్టుబడిదారులకు శుభవార్త. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సి) ద్వారా స్టాక్‌మార్కెట్ లావాదేవీలను విదేశీపెట్టుబడిదారులకు నిర్వహించేందుకు అనుమతిస్తూ సెబి నిర్ణయం తీసుకుంది. దీనిపై సెబి ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ఇనె్వస్టర్లకు సెగ్రిగేటెడ్ నామినీ అకౌంట్ ద్వారా ఐఎఫ్‌ఎస్‌సిలో ప్రవేశం కల్పించారు. వీరికి విశిష్ట క్లైంట్ కోడ్‌ను కేటాయిస్తారు.

Pages