S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/23/2018 - 00:38

మంగళూరు, మే 22: రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే తప్పనిసరిగా ఫుడ్ ప్రోసెసింగ్ రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్రం ఉందన్నారు. అసోచామ్ అనే వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

05/23/2018 - 00:21

ముంబయి, మే 22: అయిదు వరుస సెషన్ల నష్టాలకు తెరదించుతూ మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 35 పాయింట్లు పెరిగి 34,651.24 పాయింట్ల వద్ద ముగిసింది.

05/23/2018 - 00:39

హైదరాబాద్, మే 22: ప్రముఖ వాహన తయారీ సంస్ధ హోండా ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త వాహనాన్ని రాష్ట్ర మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్ధ సీఈఓ గాకు నకానిషి హోండా అమేజ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి హోండా అమేజ్‌ను రూపొందించానట్టు తెలిపారు.

05/23/2018 - 00:42

రాజమహేంద్రవరం, మే 22: దేశంలో ఈ ఏడాది చమురు, సహజవాయు అనే్వషణకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేశామని ఓఎన్జీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శశిశంకర్ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తులు పెంచి దిగుమతులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వచ్చే రెండు మూడేళ్లలో చమురు, సహజ వాయు ఉత్పత్తులు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

05/22/2018 - 01:58

న్యూఢిల్లీ: మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ పంజాబ్ నేషనల్ బ్యాంకు రేటింగ్‌ను తగ్గించింది. ఇటీవల బ్యాంకులో చోటుచేసుకున్న 2 బిలియన్ యుఎస్ డాలర్ల అవినీతి, అంతర్గత నియంత్రణ వ్యవస్థ బలహీనతను బయటపెట్టిందని మూడీస్ పేర్కొంది. రేటింగ్‌కు సంబంధించిన బాహ్య దృక్కోణాన్ని మాత్రం స్థిరంగా ఉంచింది. కాగా మూడీస్, బ్యాంకు విదేవీ కరెన్సీ జారీ రేటింగ్‌ను ‘బిఏ1’కు తగ్గించింది. అంతకుముందు ఇది ‘బిఏఏ3’ గా ఉండేది.

05/21/2018 - 23:58

న్యూఢిల్లీ, మే 21: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రభావం వరుసగా ఐదోరోజూ మార్కెట్లపై పడింది. ఫలితంగా దేశీయ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని చివరకు నష్టాల్లో ముగిసాయి. సోమవారం సెనె్సక్స్ 232 పాయింట్లు నష్టపోయి, 34,616.13 వద్ద ముగియగా, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 10,516.70 వద్ద ముగిసింది.

05/21/2018 - 23:47

దుబాయ్, మే 21: పదేళ్ల కాలం వరకు రెసిడెన్సీ వీసాలను జారీ చేస్తున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మదుపర్లు, ‘అద్భుతమైన ప్రతిభను’ కనబరచే విద్యార్థులు, నిపుణులకు వీటిని జారీ చేయనున్నట్టు యుఏఈ మంత్రి మండలి స్పష్టం చేసింది. అమెరికా ఇటీవల అనుసరిస్తున్న మార్గంలోనే యుఏఈ కూడా పయనిస్తున్నట్టు దీన్నిబట్టి తేలుతోంది.

05/21/2018 - 23:45

న్యూఢిల్లీ, మే 21: పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాన్ని కోరాయి. ఈవిధంగా అడ్డూ అదుపూ లేకుండా పెరిగే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దేశాభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని హెచ్చరించాయి.

05/22/2018 - 00:03

న్యూఢిల్లీ, మే 21: కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వశాఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా వచ్చే జూన్‌లో ప్యాకేజీలను ప్రకటించనుంది. ఇందుకోసం కొత్త జాతీయ ఎలక్ట్రానిక్ పాలసీని అమల్లోకి తీసుకురానున్నది.

05/21/2018 - 01:28

న్యూఢిల్లీ, మే 20: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొండి బకాయల భారం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరుకు ఈ బ్యాంకుకు పెద్ద బకాయిదారులు బకాయి ఉన్న సొమ్ము రూ.15,199.57 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో ఈ బ్యాంకు రికార్డు స్థాయిలో రూ. 13,40 కోట్ల నష్టాలను చవి చూసింది. ఈ వివరాలను పంజాబ్ నేషనల్ బ్యాంకు విడుదల చేసింది.

Pages