S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/28/2018 - 01:43

న్యూఢిల్లీ, మే 27: భారత్ సామాజిక మాధ్యమాల్లోని డాటాను అక్రమ పద్ధతుల్లో చొరబడి చాకచక్యంగా తస్కరించే ఫ్లై బై నైట్ డాటా మైనింగ్ విధానానికి అడ్డుకట్టవేస్తామని, ఈ విధానాన్ని అనుమతించే ప్రసక్తిలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. సామాజిక మాధ్యమాలకు భారత్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

05/28/2018 - 01:41

న్యూఢిల్లీ, మే 27: వ్యూహాత్మక పెట్టుబడులకోసం, నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) పేరుతో నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ యోచిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలో డీపీ వరల్డ్‌తో కలిసి ఎన్‌ఐఐఎఫ్ తన ఫండింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది.

05/28/2018 - 01:40

న్యూఢిల్లీ, మే 27: అనేక కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు ఇప్పటికే వెలువడటంతో సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని రూపాయి విలువలో వచ్చే మార్పులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, స్థూలార్థిక గణాంకాలు నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

05/28/2018 - 01:38

ముంబయి, మే 27: దేశ వ్యాప్తం గా సంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ కొనుగోళ్లపై ఒక విభాగాన్ని కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఏర్పాటు చేసింది. ఈ విభాగానికి సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో సైంటిస్టుగా పనిచేస్తున్న తరుణ్ సింగ్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.

05/28/2018 - 01:35

హైదరాబాద్, మే 27: ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా ఆందోళన కలిగిస్తున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహా ర ఉత్పత్తులను పండించడం సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని వలాగ్రో చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సివోవో) ప్రేమ్ వారియర్ అన్నారు.

05/27/2018 - 03:36

న్యూఢిల్లీ: మరో 11 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదనను కేంద్రం చురుకుగా పరిశీలిస్తోంది. ఈ సంస్థల్లో ఢిల్లీలోని అశోక్ హోటల్, ఎంటిఎన్‌ఎల్ టవర్ బిజినెస్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బిహెచ్‌ఇఎల్) తదితరమైనవి ఉన్నా యి. దీర్ఘకాలిక లీజ్, వ్యూహాత్మక ఒప్పందాల ద్వారా వీటిని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది.

05/27/2018 - 00:57

ముంబయి, మే 26: అత్యంత అనిశ్చితిలో సాగిన ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎదుగూ బొదుగూ లేకుండా ముగిశాయి. మార్కెట్ కీలక సూచీల పెరుగుదలను అనిశ్చితి నిరోధించింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో మొత్తంమీద కీలక సూచీలు స్వల్ప లాభాలతో సానుకూల ధోరణిలో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ క్రితం వారంతో పోలిస్తే 76.57 పాయింట్లు పుంజుకొని, 34,924.87 పాయింట్ల వద్ద ముగిసింది.

05/27/2018 - 00:34

న్యూఢిల్లీ, మే 26: ఆదాయం పన్ను చెల్లింపులకు సంబంధించి మొత్తం ఏడు ఐటి రిటర్న్స్ దరఖాస్త్ఫురాలను ఈ-ఫైలింగ్ ద్వారా దాఖలు చేసే ప్రక్రియను ఆదాయం పన్ను శాఖ శనివారం ప్రారంభించింది. ఈ ఏడు ఐటి రిటర్న్స్ దరఖాస్తు ఫారాలను ఐటి శాఖ నెల రోజుల క్రితం నోటిఫై చేసిం ది. ఈ ఏడాదికి సంబంధించి కొత్త ఆదాయం పన్నురిటర్న్స్ ఫారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభించింది.

05/27/2018 - 00:32

విశాఖపట్నం, మే 26: ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించే అంశంపై ఇక ఆశలు వదులుకున్నట్టేనా! ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని భావించగా, అసలు గనుల కేటాయింపు అంశం రాష్ట్రాల పరిధిలోనిదే నంటూ తేల్చేశారు.

05/27/2018 - 01:05

కాకినాడ, మే 26: ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత నగరాల్లో తీరైన నగరంగా పేరొందిన కాకినాడ తీర ప్రాంతం పర్యాటకంగా ప్రాధాత్యత సంతరించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న స్వదేశీ దర్శన్ పథకం కింద కాకినాడ తీర ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడంతో గత నాలుగేళ్లలో సుందరమైన పర్యాటక కేంద్రంగా కాకినాడ తీరం నూతన శోభ సంతరించుకుంటోంది.

Pages