S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/25/2018 - 00:55

ముంబయి, మే 24: ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం 2018, మే 11తో ముగిసిన పదిహేను రోజుల కాలానికి బ్యాంకుల రుణాలు 12.64 శాతం పెరిగి రూ.85,51,099 కోట్లకు చేరుకున్నాయి. 2017,మే 12తో ముగిసిన పదిహేను రోజుల కాలంలో బ్యాంకుల రుణాలు రూ.75,90,941 వద్ద స్థిరంగా ఉన్నాయి.

05/25/2018 - 00:55

న్యూఢిల్లీ, మే 24: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ, అతని అసోసియేట్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం దాఖలు చేసింది. దేశ వ్యాప్తంగా పిఎన్‌బి స్కాంగా ఈ కేసు చరిత్రలో నిలిచిపోనుంది. ఈ స్కాంలో రెండు బిలియన్ డాలర్లను బ్యాంకుకు నీరవ్ మోదీ ఎగగొట్టాడని ఇడి అధికారులు అభియోగం మోపారు.

05/25/2018 - 00:54

న్యూఢిల్లీ, మే 24 : మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో గెయిల్ ఇండియా నాలుగు రెట్ల లాభాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1,021 కోట్ల నికర లాభం పొందింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పొందిన లాభం రూ.260 కోట్లతో పోలిస్తే ఇది 293 శాతం అధికమని గెయిల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ త్రిపాఠి వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ 13 శాతం పెరిగి రూ.15,396 కోట్లకు చేరుకుంది.

05/24/2018 - 01:03

ముంబయి, మే 23: ఇంధన, లోహ రంగాల షేర్ల నేతృత్వంలో విస్తృతంగా సాగిన అమ్మకాల ఒత్తిడి వల్ల బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా బలహీనపడ్డాయి. మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 306 పాయింట్లు పడిపోయి, నెల రోజుల కనిష్ట స్థాయి 34,344.91 పాయింట్ల వద్ద ముగిసింది.

05/24/2018 - 00:51

వాషింగ్టన్, మే 23: ఎఫ్-16 యుద్ధ విమానాల తయారీని చేపట్టడం వల్ల, భారత్ ఈ విమానల ఎగుమతుల హబ్‌గా రూపొందుతుందని లాక్‌హీడ్ మార్టిన్ పేర్కొంది. రానున్న కొద్ది దశాబ్దాల కాలంలో భారత్ 165 బిలియన్ డాలర్ల మేర యుద్ధ విమానాల మార్కెట్‌లో చోటు సంపాదిస్తుందని పేర్కొంది. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ వైస్-ప్రెసిడెంట్ వివేక్ లాల్ మాట్లాడుతూ ఎఫ్-16 బ్లాక్ 70 అత్యాధునిక యుద్ధవిమానమన్నారు.

05/24/2018 - 01:01

న్యూఢిల్లీ, మే 23: మూడు మిలియన్ టన్నుల మేర చక్కెరను నిల్వచేయడానికి వీలుగా కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఒక ముసాయిదాను రూపొందించింది. ఎక్స్- మిల్లు కనీస ధరను నిర్ణయించడం ద్వారా, ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని చక్కెర మిల్లులు చెరకు పండించే రైతులకు బకాయిలు చెల్లించలేని దుస్థితికి చేరుకున్నాయి.

05/24/2018 - 00:47

న్యూఢిల్లీ, మే 23: రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు రంగాల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందేందుకు వీలుగా ఏబీబీ ఇండియా, నితి ఆయోగ్‌లు ఒక అవగాహనకు వచ్చాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు ‘స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్’ (ఎస్‌ఓఐ)పై సంతకాలు చేశాయి. ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడం, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వంటి రంగాల్లో కలిసి కృషి చేస్తామని ఏబీబీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

05/24/2018 - 00:45

న్యూఢిల్లీ, మే 23: ప్లోరిడాలో తన కార్యకలాపాలను ప్రారంభించినట్టు దేశంలోని అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ టీసీఎస్ బుధవారం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఫ్లోరిడాలో 430 ఉద్యోగులతో సంస్థను ప్రారంభించామని తెలిపింది. ట్రాన్స్‌అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ కంపెనీ ప్రారంభించామని వివరించింది. గత జనవరిలో టీసీఎస్, ట్రాన్స్‌అమెరికా సంస్థతో 2బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసింది.

05/24/2018 - 00:44

కోయంబత్తూర్, మే 23: కోయంబత్తూరుకు చెందిన ఎస్‌వి గ్లోబల్ మిల్ మెజార్టీ వాటాదారులు, మైనార్టీ వాటాదారులకు రూ. 100కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బిన్నీ కంపెనీ నుంచి బిన్నీ మిల్స్, ఎస్‌వి గ్లోబల్ మిల్ గతంలోనే విడిపోయాయి. అసలు కంపెనీలో మైనార్టీ వాటాలను ఎస్ నటరాజన్ అనే ప్రమోటర్ కలిగి ఉన్నారు.

05/23/2018 - 01:55

నాగాయలంక: భారతదేశంలో సహజ సిద్ధ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయటంలో ఓఎన్‌జీసీ ప్రధాన భూమిక పోషిస్తోందని ఆ సంస్థ సీఎండీ, ఓఎన్‌జీసీ గ్రూ ప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ శశిశంకర్ అన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామ సమీపంలో ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో ఆయిల్ నిక్షేపాల వెలికితీత కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.

Pages