S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/05/2018 - 04:09

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర బడ్జెట్ తరువాత కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్‌ను సోమవారం నుంచి మొదలుకానున్న వారంలో.. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన నిర్ణయాలు, టాటా మోటార్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), సిప్లా వంటి బ్లూచిప్‌ల మూడో త్రైమాసిక ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి.

02/05/2018 - 04:07

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: భారత్‌నుం చి సంపన్నులు తరలిపోతున్నారా? అంతర్జాతీయంగా అన్నిరంగాల్లోనూ తన ఉనికిని చాటుకుంటూ ఆరో అతిపెద్ద సంపన్నులు కలిగిన దేశంగానూ గుర్తింపు పొందిన భారత్ నుంచి గత ఏడాది 7వేల మంది సంపన్నులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఓ నివేదికలో స్పష్టమైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత సంవత్సరం దేశం నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య 16 శాతం పెరిగిందని తెలిపింది.

02/05/2018 - 04:06

హైదరాబాద్, ఫిబ్రవరి 4: అంతర్జాతీయ ప్రీమియం స్మార్ట్ఫోన్ కంపెనీ ఒన్ ప్లస్ ఇక్కడ అధికారికంగా బైబ్యాక్ కార్యక్రమాన్ని ఈ స్టోర్ ఒన్‌ప్లస్ డాట్ ఇన్‌లో ప్రకటించింది.

02/05/2018 - 04:06

హైదరాబాద్, ఫిబ్రవరి 4: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రవాణా వాహనాలపై ప్రస్తుతం ఉన్న పన్నుల విధానంలో మార్పులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ రంగంపై పెనుభారం పడనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల్లో ఉన్న రవాణారంగ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

02/05/2018 - 04:05

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి జనవరి నెలలో భారీగా 3.5 బిలియన్ డాలర్ల (రూ. 22వేల కోట్లకు పైగా) నిధులు తీసుకువచ్చారు. కార్పొరేట్ల ఆదాయాలు బాగుండటంతో పాటు భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆకర్షణీయమైన లాభాలను ఆర్జించడానికి వీలుండటం వల్ల భారీగా నిధులను తరలించారు.

02/04/2018 - 01:13

ముంబయి, ఫిబ్రవరి 3: వరుసగా ఎనిమిది వారాల పాటు లాభాల్లో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కుప్పకూలింది. మదుపరులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చిన బడ్జెట్‌లో ఈక్విటీలపై ఆర్జించే లాభాలపై పది శాతం పన్ను విధించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 3.5 శాతానికి పెంచడం వల్ల స్టాక్ మార్కెట్ శుక్రవారం అతలాకుతలమయింది.

02/04/2018 - 01:11

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: ఫుడ్ ప్రాసెస్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు స్థాపిస్తే ఆశించిన పురోగతి లభిస్తోందని రాష్ట్ర ఫుడ్ ప్రాసెస్ సొసైటీ సీఈవో వైఎస్ ప్రసాద్ చెప్పారు. ఆహార శుద్ధి రంగంలో అవకాశాలపై రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో శనివారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించారు.

02/04/2018 - 01:10

విజయవాడ (బెంజిసర్కిల్), ఫిబ్రవరి 3: మానవ శరీర నిర్మాణానికి అవసరమైన సుఖవంతమైన నిద్రకోసం ఉపయోగపడే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారు చేసిన స్లీప్‌వెల్ కంఫర్ట్‌సెల్ మ్యాట్రసెస్ (పరుపులు) నవ్యాంధ్ర బహిరంగ విపణిలోనికి ప్రవేశించాయి.

02/03/2018 - 04:18

ముంబయి, ఫిబ్రవరి 2: ఈక్విటీలపై ఆర్జించే లాభాలపై పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం అతలాకుతలం అయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గత రెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఒక్క రోజే 840 పాయింట్లు పడిపోయింది. 2015 ఆగస్టు 24 తరువాత సెనె్సక్స్ ఒక్క రోజే ఇంత భారీగా దిగజారడం ఇదే మొదటిసారి.

02/03/2018 - 01:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వంపై ఉన్న అధిక రుణభారం దేశ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను నిరోధిస్తుందని ఫిచ్ రేటింగ్స్ శుక్రవారం పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సర ద్రవ్య లోటును స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 3.5 శాతానికి పెరుగుతుందని ప్రకటించిన మరుసటి రోజే ఫిచ్ రేటింగ్స్ చేసిన ఈ ప్రకటన ప్రాధా న్యం సంతరించుకుంది.

Pages