S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/03/2018 - 01:35

విశాఖపట్నం, ఫిబ్రవరి 2: కేవలం 0.7 శాతం పన్నుల చెల్లింపుతో 50నుంచి 60 శాతం మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సెంట్రల్ జీఎస్‌టీ కమిషనరేట్(విశాఖపట్నం) ప్రిన్సిపల్ కమిషనర్ బి.హరేరామ్ అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో ‘పోస్ట్‌బడ్జెట్ అనాలసిస్’పై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. అదే నూరుశాతం చెల్లిస్తే ఆదాయం మరింతగా పెరుగుతుందన్నారు.

02/03/2018 - 01:34

హైదరాబాద్, ఫిబ్రవరి 2: అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్‌లకు యునైటెడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యుఎస్ ఐఇఎఫ్) దరఖాస్తులను స్వీకరిస్తోంది. వంద ఫుల్ బ్రైట్ స్కాలర్‌షిప్‌లను, మరో ఆరు ఫుల్‌బ్రైట్ కలాం క్లైమేట్ ఫెలోషిప్‌లకు దరఖాస్తులను కోరుతోంది.

02/03/2018 - 01:33

విజయవాడ, ఫిబ్రవరి 2: ఆహారశుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి చేసేందుకు మరో ముందడుగు పడుతోంది. రాజమహేంద్రవరంలో శనివారం జరిగే సదస్సు ఇందుకు కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా నిర్వహించే ఈ సదస్సుకు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు.

02/03/2018 - 01:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జనవరి మధ్య కాలంలో 440 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అయితే ఈ పది నెలల కాలంలో ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా 29.9 మిలియన్ టన్నుల బొగ్గును తక్కువగా ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో 469.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని కోల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

02/03/2018 - 01:32

హైదరాబాద్, ఫిబ్రవరి 2: కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, వౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాలకే ప్రాధాన్యత ఇచ్చిందని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఏమి ప్రకటన చేయలేదని, ప్రస్తావన లేదని తెలంగాణ, ఆంధ్ర వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్ టాప్సీ) అధ్యక్షుడు గౌర శ్రీనివాస్ అన్నారు.

02/03/2018 - 01:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మూడో త్రైమాసికంలో తన నికర లాభం 3.8 శాతం పెరిగినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో రూ. 1,013.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో బజాజ్ ఆటో లిమిటెడ్ రూ. 976.82 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

02/02/2018 - 04:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ముద్ర యోజన పథకం కింద ఇచ్చే రుణాల లక్ష్యాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. మూడు లక్షల కోట్లకు పెంచుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. స్వయం ఉపాధి కోసం ఈ పథకం కింద రుణాలు ఇస్తుంటారు. 2015 ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు 10.38 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 4.6 లక్షల కోట్ల రుణాలు అందజేశారు.

02/02/2018 - 01:04

ముంబయి, ఫిబ్రవరి 1: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్జించే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ పన్నును విధించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

02/02/2018 - 01:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సీ) పరిధిలోని అన్ని ఆర్థిక సేవలను నియంత్రించడానికి ఒక యూనిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఐఎఫ్‌ఎస్‌సీ ఉంది.

02/02/2018 - 01:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడంపై 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేంద్రీకరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో వ్యవసాయ సంబంధ కంపెనీల షేర్ల ధరలు పుంజుకున్నాయి.

Pages