S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/08/2018 - 01:38

రేణిగుంట, జనవరి 7: విమానయాన రంగంలో దేశీయ సర్వీసుల విస్తరణలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం ఆయన తిరుపతి విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభించారు. ఈసందర్భంగా విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ మనదేశం విమానయాన రంగం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని అన్నారు.

01/08/2018 - 01:35

హైదరాబాద్, జనవరి 7: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) వచ్చే ఐదేళ్లలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పథక రచన చేసింది. ఉన్నతవర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం వచ్చే ఐదేళ్లలో సంస్థ ఆదాయం 34 వేల కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆదాయం 24 వేల కోట్ల రూపాయలని వివరించారు.

01/07/2018 - 00:52

ముంబయి, జనవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం పుంజుకున్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో మార్కెట్ కీలక సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ కీలకమైన 34వేల స్థాయికి పైన 34,153.85 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా సరికొత్త గరిష్ఠ స్థాయి 10,558.85 పాయింట్ల వద్ద ముగిసింది.

01/07/2018 - 00:51

సింగపూర్, జనవరి 6: భారతీయ పోర్టులు ఈ ఏడాది ఏడువేల కోట్ల రూపాయల మేరకు లాభాలను ఆర్జించే పరిస్థితి ఉందని రహదారులు, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

01/07/2018 - 00:50

జకార్తా, జనవరి 6: ‘భద్రతలో, శ్రేయస్సులో భాగస్వామ్యం’ అనే సిద్ధాంతం ప్రాతిపదికగా ప్రాంతీయ వ్యవస్థ ఎదగాలన్నదే భారత్ ఆకాంక్ష అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్)లోని ‘భారతీయ మేధో వ్యవస్థ’ అయిదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.

01/07/2018 - 00:48

సీలేరు, జనవరి 6: విశాఖ మన్యం, సీలేరులో మరో జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కానుంది. ఇక్కడ ఎత్తిపోతల పథకం నిర్మించి, దీని ద్వారా వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించామని జెన్‌కో హైడల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడారు.

01/07/2018 - 00:46

రాజమహేంద్రవరం, జనవరి 6: పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలిస్తే పవర్ హౌస్ నిర్మాణ ఏజెన్సీ ఖరారైంది. మొత్తం రూ. 5385.91 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం హెడ్ వర్క్సు జరుగుతున్నాయి. 2012-13లో హెడ్ వర్క్సు రూ.4054 కోట్లతో చేపట్టారు. సవరించిన అంచనాల ప్రకారం ఇపుడు రూ. 5385.91 కోట్లకు చేరుకుంది.

01/07/2018 - 00:44

నల్లగొండ, జనవరి 6: పాడి రైతును ఆదుకోవడంతో పాటు ప్రజలకు అవసరమైన పాల సరఫరా డిమాండ్‌ను అధిగమించేలా కొత్త పథకం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదేపదే పాల ధరలు పడిపోతుండటం, డిమాండ్‌కు సరిపడ పాల ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో వినియోగదారులు, పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

01/07/2018 - 00:42

విజయవాడ, జనవరి 6: కేంద్ర ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్న 12 దేశాలకు ప్రతి పోస్ట్ఫాస్ నుంచి కూడా రూ.100 గ్రాముల నుంచి రెండు కిలోల వరకు ప్యాకింగ్‌తో కూడిన పార్శిల్స్‌ను పంపించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని తపాలాశాఖ విజయవాడ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కైరంకొండ సంతోష్ నేత తెలిపారు. అతి త్వరలోనే విజయవాడలో సబ్ ఫారిన్ పోస్ట్ఫాస్ ఏర్పాటు కాబోతున్నదని అన్నారు.

01/06/2018 - 01:23

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.5 శాతానికి దిగజారుతుందని అంచనా. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పడిపోవడం ఇదే మొదటిసారి.

Pages