S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/06/2018 - 01:22

ముంబయి, జనవరి 5: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దిగ్గజమైన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారులకు నిజంగా ఇది ఉపశమనం కలిగించే వార్త. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వల మొత్తాన్ని తగ్గించాలని ఎస్‌బీఐ భావిస్తోంది. ప్రస్తుతం మెట్రో నగరాలకు సంబంధించి నెలవారీ కనీస నగదు నిల్వ లక్ష్యం 3,000 రూపాయలు కాగా దీన్ని 1,000 రూపాయలకు కుదించాలని బ్యాంకు యోచిస్తోంది.

01/06/2018 - 01:21

న్యూఢిల్లీ, జనవరి 5: విదేశీ నిధులు ఎడతెరిపి లేకుండా తరలి వస్తుండటంతో పాటు మదుపరులు టెలికం, కన్జ్యూమర్ డ్యూరేబుల్స్, స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్ షేర్లను విస్తృతంగా కొనుగోలు చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల కీలక సూచీలు శుక్రవారం రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 184 పాయింట్లు పుంజుకొని, జీవితకాల గరిష్ఠ స్థాయి 34,153.85 పాయింట్ల వద్ద ముగిసింది.

01/06/2018 - 01:19

మైలవరం, జనవరి 5: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో భాగంగా మెకాన్, ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు శుక్రవారం జిల్లాకు చేరుకున్నాయి. బృందం సభ్యులు మైలవరం మండలంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు గల అనుకూల పరిస్థితులను అధ్యయనం చేశారు. నీటి లభ్యత విషయమై మైలవరం జలాశయాన్ని బృందం సభ్యులు పరిశీలించారు.

01/06/2018 - 01:17

కొత్తగూడెం, జనవరి 5: ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ కోరారు.

01/06/2018 - 01:15

ముంబయి, జనవరి 5: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) త్వరలో కొత్త పది రూపాయల నోటును చలామణిలోకి తేనుంది. చాక్లెట్ గోధుమ రంగులో ఉండే ఈ నోటుపై వెనుకవైపు దేశ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన కోణార్క్ సూర్య దేవాలయం చిత్రాన్ని ముద్రించనున్నట్టు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

01/06/2018 - 01:15

కాకినాడ, జనవరి 5: దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న కాకినాడ- పిఠాపురం రైల్వే లైన్ పనులను ప్రస్తుతానికి స్తంభింపజేశామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం వల్ల రైల్వే శాఖకు ఎటువంటి ఆర్థిక లాభం ఉండదన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్‌కు తనిఖీల నిమిత్తం శుక్రవారం ఇక్కడకు వచ్చిన వినోద్‌కుమార్ యాదవ్ విలేఖర్లతో మాట్లాడారు.

01/06/2018 - 01:15

విశాఖపట్నం, జనవరి 5: విశాఖ స్టీల్ ప్లాంట్ వాటాల విక్రయంపై నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాట్‌లో 10 శాతం వాటాలను విక్రయిస్తున్న కథనాలు వచ్చాయని, వాటాలు విక్రయించాలంటే, కేంద్రం చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు.

01/06/2018 - 01:14

న్యూఢిల్లీ, జనవరి 5: దేశవ్యాప్తంగా వంద లక్షల టన్నుల ఆహారధాన్యాలను నిల్వ చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికను ఆమోదించినట్టు, మూడు దశల్లో ఇది పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో శుక్రవారం నాడు కేంద్ర ఆహారశాఖ ఉప మంత్రి సీఆర్ చౌదరి ఈ విషయమై లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, ఇప్పటికే 6.25 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ చేసేందుకు పటిష్టమైన స్టోరేజీ సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.

01/05/2018 - 00:34

బెంగళూరు, జనవరి 4: ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించిన సలీల్ పరేఖ్ ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వేరియేబుల్ కాంపోనెంట్‌తో కలుపుకొని రూ. 18.6 కోట్ల వార్షిక వేతనం తీసుకోనున్నారు. ఈ సంవత్సరం తొలి మూడు నెలలకు అతను ఫిక్స్‌డ్ వేతనం, ఇతర ప్రయోజనాలతో పాటు రూ. 2.37 కోట్ల ఇనిషియల్ వేరియేబుల్ వేతనాన్ని అందుకోనున్నారు. ఇన్ఫోసిస్ పోస్టల్ బ్యాలెట్ ఈ వివరాలను వెల్లడించింది.

01/05/2018 - 00:32

ముంబయి, జనవరి 4: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కార్యక్రమం అమలులో ముందడుగు వేయడంతో పాటు స్థూలార్థిక గణాంక సూచీలు మదుపరులను ఆకట్టుకోవడం, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ కొత్త సంవత్సరం 2018లో తొలిసారి గురువారం 176 పాయింట్లు పెరిగి, 33,970 పాయింట్ల వద్ద ముగిసింది.

Pages