S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/05/2018 - 00:31

మహబూబ్‌నగర్, జనవరి 4: కరవుకు, వలసలకు నిలయంగా మారి కొట్టుమిట్టాడుతున్న పాలమూరు రైతాంగానికి వ్యవసాయం కత్తిమీద సాముగానే మారింది. పండించిన పంటను మార్కెట్‌కు తీసుకువస్తే గిట్టుబాటుధర రాక ఇబ్బందులకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా లో కందిరైతులకు కష్టాలు మొదలయ్యాయి.

01/05/2018 - 00:28

హైదరాబాద్, జనవరి 4: స్టార్టప్‌ల కోసం వాద్వానీ ఫౌండేషన్ అనే సంస్థ నేషషనల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో బిజినెస్ యాక్సలేటర్ డబ్ల్యుఎఫ్ వెంచర్ స్కేప్‌లను హైదరాబాద్, పూణే నగరాల్లో ప్రారంభించినట్లు వాద్వానీ సంస్థ సిఇవో డాక్టర్ అజయ్ కేలా తెలిపారు. వినియోగదారులు, క్యాష్, కెపాసిటీపై కేంద్రీకృత కోచింగ్, కనె్సల్టింగ్‌ను అందిస్తున్నట్లు చెప్పారు.

01/05/2018 - 00:27

న్యూఢిల్లీ, జనవరి 4: బాణసంచాపై నిషేధం వల్ల ఏర్పడిన అనిశ్చితితో తమిళనాడులో 840 ఫ్యాక్టరీలు మూతపడి దాదాపు 8 లక్షల మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారని రాజ్యసభలో డిఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా డిఎంకే సభ్యుడు తిరుచ్చి శివ మాట్లాడుతూ, కాలుష్యానికి బాణసంచా ఒక్కటే కారణం కాదని, పర్యావరణ పరిరక్షణ నిబంధనల నుంచి ఈ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

01/05/2018 - 00:26

విశాఖపట్నం, జనవరి 4: ఆర్థిక రాజధాని విశాఖ నగరంలో పరిశ్రమల స్థాపనకు అనేక కంపెనీలు ఆసక్తికనబరుస్తున్నాయి. గడచిన రెండు సంవత్సరాల నుంచి విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మరో సదస్సు జరగనుంది. గడచిన రెండు సిఐఐ సదస్సుల్లో సుమారు 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావల్సి ఉంది. అయితే, విశాఖకు అనుకున్న స్థాయిలో పరిశ్రమలు రావడం లేదు.

01/05/2018 - 00:25

న్యూఢిల్లీ, జనవరి 4: ఐదొందల రూపాయలు చెల్లిస్తే పేటియంలో వ్యక్తుల ఆధార్ వివరాలు పొందవచ్చన్న మీడియా కథనాలను విశిష్ట గుర్తింపుప్రాథికారిత సంస్థ (యూఐడీఏఐ) కొట్టిపారేసింది. 500 రూపాలతో లక్ష మంది వ్యక్తుల ఆధార్ వివరాలు క్షణాల్లో లభిస్తాయని ఓ ఆంగ్ల పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై యూనిక్‌ఐడీ తీవ్రంగానే స్పందించింది. ‘ఆధార్ వివరాలకు పూర్తి భద్రత ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వచ్చే అవకాశం లేదు.

01/05/2018 - 00:24

న్యూఢిల్లీ, జనవరి 4: ఏపీలో లాభాలలో లేని పొగాకు బ్యారన్లను తీసివేయడానికి అనుమతి ఇవ్వాలని గోదావరి జిల్లా రైతులు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభుకి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు తోట నరసింహం, మురశీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కంభంపాటి హరిబాబు, కొత్తపల్లి గీత గురువారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

01/03/2018 - 23:27

ముంబయి, జనవరి 3: బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీ స్వల్ప లాభంతో ముగియగా, సెనె్సక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. సెనె్సక్స్ 18.88 పాయింట్లు నష్టపోయి 33,998.37 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కేవలం ఒక్క పాయింట్ స్వల్ప లాభంతో 10,443.20 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.63.54 వద్ద కొనసాగింది.

01/03/2018 - 23:26

షేర్లను విక్రయించి తమ మూలధనాన్ని పెంచుకునేందుకు కొన్ని ‘బలహీన’ బ్యాంకులు ఇప్పటికే ‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్’ నుంచి ఆమోదం పొందాయి. 1,375 కోట్ల రూపాయల మేరకు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు షేర్లను జారీ చేయాలని యూకో బ్యాంకు బుధవారం నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కూడా 323 కోట్ల రూపాయలను షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకునేందుకు కసరత్తు చేసింది.

01/03/2018 - 23:25

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతమని డెల్ ఎక్సెల్ ఫార్మా సియివో రఘుపతి కందారపు కొనియాడారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావుకు రఘుపతి బుధవారం సందేశం పంపారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి ప్రస్తుతం సొంతంగా పరిశ్రమను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వపరంగా, పారిశ్రామిక విధానం వల్ల తనకు కలిగిన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.

01/03/2018 - 23:24

హైదరాబాద్, జనవరి 3: ప్రతిష్టాత్మకమైన సిబిఐపి అవార్డును తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అవార్డును సిబిఐపి అధ్యక్షుడు రవీంద్రకుమార్ ప్రదానం చేశారు.

Pages