S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/04/2017 - 23:26

ముంబయి, సెప్టెంబర్ 4: ముంబయి స్టాక్ మార్కెట్లో సోమవారం ఉత్తర కొరియా వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ధిక్కరించి భూగర్భంలో హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించిన ప్రభావ ఫలితంగా సెనె్సక్స్ కుదుపునకు లోనైంది. గత మూడు రోజులుగా లాభాల బాటలో పయనించిన భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయి. సెనె్సక్స్ ఏకంగా 190 పాయింట్లు పడిపోయింది.

09/04/2017 - 23:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బిలు) ఈ ఆర్థిక సంవత్సరంలో తమ వాటాలను తగ్గించుకోవడం ద్వారా దాదాపు 58 వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోనున్నాయి.

09/04/2017 - 23:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశంలో చమురు, సహజ వాయువును ఉత్తత్తి చేస్తున్న సంస్థల్లో అతిపెద్దదైన ఓఎన్‌జిసి (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు అవసరమైన 37 వేల కోట్ల రూపాయలను సర్దుబాటు చేసుకునేందుకు తొలిసారి రూ.25 వేల కోట్ల రుణాలను సమీకరించుకోనుంది.

09/04/2017 - 23:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పెద్ద నోట్ల రద్దు వలన దేశానికి ఎదురయ్యే కష్టనష్టాలపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) రఘురామ్ రాజన్ వెల్లడించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా సాధించదల్చుకున్న ప్రధాన లక్ష్యాలను అందుకునేందుకు అంతకంటే ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు.

09/04/2017 - 23:21

భీమవరం, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రొయ్యల సాగును ‘యాంటి బయోటిక్స్’ బెదడ పట్టిపీడిస్తోంది. వీటి వినియోగంవల్ల అటు రొయ్యల రైతులు కోట్లాది రూపాయలు నష్టపోవడమేకాకుండ ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతోంది. అంతేకాకుండ చెడ్డపేరూ వస్తోంది. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా వెనక్కి వస్తున్న కంటైనర్లతో భారత ప్రభుత్వం కూడా హెచ్చరించింది.

09/04/2017 - 23:18

హైదరాబాద్, సెప్టెంబర్ 4: పసిడి ధర మరోసారి ఆకాశాన్నంటింది. కొద్దిరోజుల క్రితం కొంత దిగొచ్చినట్టే దిగొచ్చిన బంగారం ధర ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించటంతో వేడిక్కిన రాజకీయ పరిణామాల కారణంగా ఏడాదిలోనే గరిష్టస్థాయికి చేరుకుంది. దీంతో పాటు స్థానికంగా బంగారు ఆభరణాలు తయారీదారుల నుంచి కొనుగోలు దారుల మద్దతు లభించటం ధర పెరుగుదలకు కారణమన్న వాదన సైతం ఉంది. సోమవారం బంగారు ఒక గ్రాముకు రూ.

09/04/2017 - 23:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: టాటా మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సిటిఓ) తిమోతీ లెవెర్టన్ తన పదవుల నుంచి వైదొలిగారు. సోమవారం ఆ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

09/04/2017 - 23:17

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 4: తూర్పు కనుమలు ల్యాటరేట్ మైనింగ్‌తో గుల్లవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండల పరిధిలోని షెడ్యూలు ప్రాంతంలోని రిజర్వు ఫారెస్టులో కేంద్ర ప్రభుత్వం అనుమతితో మైనింగ్ లీజులు కొనసాగుతున్నాయి. వంతాడ కొండపై అక్రమ తవ్వకాలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ నివేదికలో రూ.కోట్ల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉందని ప్రభుత్వానికి సమర్పించింది.

09/04/2017 - 01:00

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: మందులపై వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. 120 కోట్లు జనాభా ఉన్న భారతదేశంలో ప్రాణాంతక రోగాలు, ఇతర జబ్బులుకు సంబంధించి మందుల కొనుగోలుకే ప్రజలు అత్యధిక నిధులు వెచ్చిస్తుంటారు. ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం కోసం బడ్జెట్‌లో వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది.

09/04/2017 - 00:59

హైదరాబాద్, సెప్టెంబర్ 3: ఎగవేతదారులకు అక్రమంగా వేల కోట్ల రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ డిమాండ్ చేశారు. నల్లధనాన్ని రాబడుతున్నాం, అవినీతిని నిర్మూలిస్తున్నామంటూ రోజూ ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న పాలకులపై ఆయన మండిపడ్డారు.

Pages