S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/09/2019 - 23:27

ముంబయి, అక్టోబర్ 9: ముంబయి విమానాశ్రయంలో దుకాణాలకు సుంకాల రాయితీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దుకాణాలకు జీఎస్‌టీ ఇన్‌పుట్ పన్ను రీఫండింగ్‌ను నిరాకరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్ను విభాగం జారీ చేసిన ఆదేశాలను బుధవారం ముంబయి హైకోర్టు కొట్టి వేసిం ది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను తిరిగి పొందేందుకు ఆ దుకాణాలకు అర్హత ఉందని కోర్టు స్పష్టం చేసింది.

10/09/2019 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వివిధ సంస్థల నుంచి 300 బస్సుల సరఫరా కోసం ఆర్డర్లు అందుకున్న జేబీఎస్ ఆటో సంస్థ వాటాలు బుధవారం 20 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఈ సంస్థకు చెందిన ఒక్కో వాటా రూ. 224.55 వంతున ట్రేడైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 19.98 శాతం వృద్ధితో రూ. 225.15 వంతున ట్రేడయ్యాయి.

10/08/2019 - 06:26

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సైతం నష్టాల పాలయ్యాయి. రోజంతా ఒడిదుడుకుల పాలైన సూచీలు ఆఖరి గంటలో నెలకొన్న అమ్మకాల వత్తిడితో డీలాపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, పార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు నష్టాల్లోకి జారాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 141.33 పాయింట్లు కోల్పోయి 0.38 శాతం నష్టాలతో 37,531.98 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది.

10/08/2019 - 00:01

ముంబయి, అక్టోబర్ 7: గత పాతిక సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో ఈ సారి ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

10/08/2019 - 00:01

ముంబయి, అక్టోబర్ 7: బ్యాంకుల్లో డిపాజిటర్ల బీమా కవరేజీ పరిమితిని ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయలను మరింతగా పెంచాల్సిన తక్షణావసరం ఏర్పడిందని సోమవారం నాడిక్కడ విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయన నివేదిక సూచించింది.

10/07/2019 - 23:43

న్యూఢిల్లీ/బెర్నే, అక్టోబర్ 7: స్విస్‌బ్యాంకు ఖాతాల వివరాలు భారత్‌కు అందాయి. విదేశీ బ్యాంకులో కుదవబెట్టిన నల్లధనం వెనక్కితెప్పిస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. స్విస్ ఖాతాల వివరాలు భారత్‌కు చేరడం ద్వారా ప్రయత్నాలకు తొలి అడుగుగా చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి పద్ధతి కింద ఖాతాల వివరాలు స్విస్ అందజేసింది.

10/07/2019 - 06:48

అమరావతి : దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌లకు అదనంగా హైదరాబాద్ నుంచి 110, బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు.

10/07/2019 - 05:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారతీయ పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ పేర్కొంది. పెట్టుబడుల అవకాశాల గురించి చైతన్యం పెరగడంతో పాటు వ్యాపార సరళతను మెరుగు పరచడానికి నిరంతరం చేస్తున్న కృషి బంగ్లాదేశ్.. భారత వ్యాపార సంస్థలను ఆకర్షించడానికి దోహదపడిందని పేర్కొంది.

10/06/2019 - 23:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఫిన్‌టెక్ సంస్థ ‘పే వర ల్డ్’ వాణిజ్య విస్తరణపై దృష్టి నిలిపింది. గ్రామీణ ప్రాంతాలు, నగరాల అనుబంధ ప్రాంతాల్లో రీటెయిల్ టచ్ పాయింట్లను ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. డిజిటల్ లావాదేవీల్లో నెలకొన్న వృద్ధిని సానుకూలంగా మలుచుకుని వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించాలన్న కృతనిశ్చయానికి వచ్చింది.

10/06/2019 - 23:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. పలు సంస్థలను జాతీయకరణ చేస్తూ 1976లో చట్టం రూపొందింది. అందులో భాగంగానే బీపీసీఎల్ కూడా ప్రభుత్వరంగ సంస్థగా అవతరించింది. 2016లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేయడం ద్వారా పాక్షిక ప్రైవేటీకరణ సాధ్యమైంది.

Pages