S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/03/2019 - 23:18

ముంబయి, అక్టోబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాల పాలయ్యాయి. ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు, అపరిష్కృతంగా సాగుతున్న వాణిజ్య యుద్ధాలు మరింత ముదరడం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ గురువారం పెద్దయెత్తున ఒడిదుడుకులకు గురైంది.

10/03/2019 - 23:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో దేశీయ కార్పొరేట్ సంస్థలు మొత్తం 10 ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ)ల ద్వారా రూ. 6000 (0.86 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. గడచిన ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ వచ్చే ఏడాది ప్రథమార్థానికి ఈప్రక్రియ మరింత లబ్థిని చేకూర్చే అవకాశాలున్నాయి.

10/03/2019 - 23:15

ముంబయి, అక్టోబర్ 3: గీతాంజలీ జెమ్స్, దాని విదేశాలకు పరారైన యజమాని మెహుల్ చోక్సీ ఉద్దేశ పూర్వకంగానే రుణం చెల్లించకుండా డీఫాల్టర్లుగా మారారని ప్రభుత్వ రంగ బ్యాంకు యునైటెడ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం బహిరంగంగా ప్రకటించింది. మొత్తం రూ. 332 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది.

10/03/2019 - 06:23

*చిత్రం... మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం అహ్మదాబాద్‌లో 150 రూపాయల ప్రత్యేక నాణాన్ని విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

10/03/2019 - 05:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: వాతావరణ మార్పు, మానవ హక్కుల విధానాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల స్థూలంగా వాతావరణపరంగా అత్యయిక పరిస్థితులు నెలకొని బ్యాంకింగ్ రంగం ఒడిదుడుకులకు గురైందని ఓ నివేదిక వెల్లడించింది. ఫెయిర్ ఫైనాన్స్ గైడ్ ఇండియా గణాంకాల విశే్లషణ మేరకు వాతావరణ, సామాజిక, పరిపాలన (ఇఎస్‌జి) విధానాలు సరైన రీతిలో పాటించకపోవడం, కట్టుబడి ఉండకపోవడం వంటివి అనేవి పలు భారతీయ బ్యాంకులు అనుసరిస్తున్నాయి.

10/03/2019 - 05:08

ముంబయి, అక్టోబర్ 2: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సంక్షోభానికి ఆడిటర్లే కారణమని సస్పెండైన ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) జాయ్ థామస్ ఆరోపించారు. ఆడిటర్లు సమయాభావం వల్ల బ్యాంకు పుస్తకాలను పైపైన తనిఖీ చేశారని ఆయన ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కు సెప్టెంబర్ 21న రాసిన అయిదు పేజీల లేఖలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఆయన తన లేఖలో ఆడిటర్ల పేర్లు మాత్రం పేర్కొనలేదు.

10/02/2019 - 23:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: బ్యాంకులు దేశ వ్యాప్తంగా సుమారు 250 జిల్లాల్లో గురువారం నుంచి తొలివిడత రుణ మేళాలు నిర్వహించనున్నాయి. పండుగ సీజన్‌లో డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు క్రెడిట్, రీటెయిల్ ఖాతాదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలకు) ఈ సందర్భంగా రుణాలను అందజేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

10/02/2019 - 23:29

హైదరాబాద్, అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ విభాగం సిబ్బంది బుధవారం ఇక్కడ నెక్లెస్ రోడ్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ హిత సంచులను పంపిణీ చేశారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ బ్యాగ్‌లను సేకరించారు.

10/02/2019 - 23:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్థిరాస్తి వ్యాపార దిగ్గజం లోథాగ్రూప్ ప్రత్యేకంగా స్థిరాస్తి పెట్టుబడుల నిధి (ఆర్‌ఈఐటీ)ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే మూడేళ్ల కాలంలో ఇది కార్యరూపం దాల్చవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ రూ. 13వేల కోట్ల విలువైన వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

10/02/2019 - 23:28

ఎక్సోన్ మొబైల్, చెవ్రాన్, షెల్, భారత్ పెట్రోలియం వంటి ఇంధన ఉత్పాదక సంస్థలతో ఒప్పందాలను రద్దు చేసుకుని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సీటిల్‌లోని అమెజాన్ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న ఆ సంస్థ ఉద్యోగులు. పెరుగుతున్న కాలుష్యం తమపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Pages