S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/11/2019 - 05:48

ముంబయి : సహకార బ్యాంకుల్లో సక్రమ పాలన (నిర్వహణ) జరిగేలా శాసనపరమైన మార్పులు సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కుంభకోణాల్లో చిక్కుకున్న పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) డిపాజిటర్లు, ఖాతాదారుల ఆగ్రహాన్ని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి నిర్మల పై ప్రకటన చేశారు.

10/10/2019 - 22:44

ముంబయి, అక్టోబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ నష్టాల బాటలోకి మళ్లాయి. బలహీన వృద్ధిరేటు అంచనాలు ప్రధానంగా త్వరలో వెలువడనున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలను ప్రభావితం చేయవచ్చన్న ఆందోళనకు గురైన మదుపర్లు వాటాల విక్రయానికి పాల్పడినట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, వాహన స్టాక్స్ తీవ్ర అమ్మకాల వత్తిడికి గురయ్యాయి.

10/10/2019 - 22:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రత్నాలు, బంగారు ఆభరణాల ఎగుమతుల్లో గడచిన ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసం వరకు 7 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈకాలంలో మొత్తం 12.4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. అంతర్జాతీయం గా అతిపెద్ద మార్కెట్లలో సైతం డిమాండ్ తగ్గడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది.

10/10/2019 - 22:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌తో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీన ప్రతిపాదనను అమలు చేసేందుకు గురువారం రిజ ర్వు బ్యాంకు నిరాకరించింది. దీంతో ఈ రెండు సం స్థల వాటాలు 23శాతం మేర భారీగా నష్టపోయా యి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్) స్టాక్స్ ప్రధానంగా 18.65 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఒక్కో వాటాధర రూ. 195కు పడిపోయింది.

10/10/2019 - 22:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 150 రైళ్లను, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించడానికి చర్యలు ప్రారంభించింది. దీనికోసం ఒక బ్లూప్రింట్‌ను తయారు చేసేందుకు ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయింది.

10/10/2019 - 06:29

న్యూఢిల్లీ : ఆభరణాల వాణిజ్య ఆదాయంలో తగ్గుదలను చూపిన టైటాన్ కంపెనీ వాటాలు బుధవారం 2శాతం పైగా నష్టపోయాయి. ఈమేరకు 2019-20 ఆర్థిక సంవత్సరం రెండోత్రైమాసిక ఫలితాలను ఆ కంపెనీ వెల్లడించిన వెంటనే స్టాక్ మార్కెట్లో వాటాలు విక్రయాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 2.41 శాతం నష్టపోయిన వాటాలు రూ. 1.229.05కు పడిపోయాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈలో 2.27 శాతం నష్టంతో ఒక్కో వాటా రూ. 1,230గా ట్రేడైంది.

10/10/2019 - 00:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: వివిధ స్లాబుల్లో ఇతర నెట్ వర్క్‌లకు చేసే ఫోన్ కాల్స్‌కు ఇకపై రుసుం వసూలు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో నుంచి ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్ నిమిషానికి ఆరు పైసలు చొప్పున వసూలు చేయాలని తీర్మానించింది. ఈ నిర్ణయం గురువారం నుంచి అమలులోకి రానున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ఈ అదనపు భారం నుంచి తప్పించడానికి ఐయుసీ టాప్‌అప్ ఓచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

10/09/2019 - 23:31

చిక్మగళూరు (కర్నాటక)లో రైతులు రోడ్డుపై పారేసిన టమాటోలను తింటున్న పశువులు. భారీ వర్షాల కారణంగా టమాట పంటలు ధ్వంసం కావడంతో ఉత్పత్తులను రైతులు రోడ్లపై పారేశారు.

10/09/2019 - 23:29

ముంబయి, అక్టోబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఇప్పటి వరకు వరుస నష్టాలతో మదుపరులను కలవరపరచిన మార్కెట్లు మంగళవా రం విజయదశమి సెలవుదినానంతరం లాభాల్లోకి రావడం శుభ సూచికం. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, లో హ స్టాక్స్ భారీగా లాభాలను సంతరించుకున్నాయి. తొలు త ఆచితూచి వ్యవహరించిన మదుపర్లు మధ్యాహ్నం తర్వా త భారీగా వాటాల కొనుగోళ్లకు దిగారు.

10/09/2019 - 23:28

న్యూఢిల్లీ/జనీవా, అక్టోబర్ 9: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థికంగా బలపడి పోటీలో దూసుకువెళుతుంటే మనదేశం మాత్రం ఈ పోటీలో వెనుకబడిపోతోంది. ఆర్థికాభివృద్ధి పోటీలో ఈ ఏడాది ర్యాకింగ్స్‌లో 10 స్థానాలు కోల్పోయిన భారత్ 68వ స్థానానికి పడిపోయింది. ఈ విషయంలో సింగపూర్ వేగంగా ముందుకెళుతోంది.

Pages