S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/06/2019 - 01:35

హైదరాబాద్, అక్టోబర్ 5: జీఎస్‌టీ వల్ల ధరలు తగ్గాయని, ఈ పన్ను వల్ల దేశంలోని అన్ని అమ్మకం పన్నులను ఏకీకృత వ్యవస్థ పరిధిలోకి తెచ్చామని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన బ్యాంకుల రుణమేళా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముద్రబ్యాంక్ కింద కోట్ల మంది చిన్న, మధ్య తరగతి వ్యాపపారులకు రుణ సాయం అందుతుందన్నారు.

10/04/2019 - 23:48

హైదరాబాద్, అక్టోబర్ 4: ఐటీ రంగం విస్తరణకు హైదరాబాద్‌కు మించిది మరొటి లేదని, ఇక్కడ ఐటీ మంత్రి కేటీఆర్ మోస్ట్ డైనమిక్ లీడర్ అని, ఆయన పరిశ్రమల స్థాపనకు ఎంతో సహకారం అందిస్తున్నారని నీతి అయోగ్ సీఇఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి అమితాబ్ కాంత్ ప్రారంభించారు.

10/04/2019 - 22:34

ముంబయి, అక్టోబర్ 4: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వరుసగా అయిదోసారి శుక్రవారం కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఇతర రుణాలు చవకగా లభించనున్నాయి. ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పునరుద్ధరింప చేయడానికి తన దూకుడు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించి రికార్డు సృష్టించింది.

10/04/2019 - 21:52

ముంబయి, అక్టోబర్ 4: ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల మనుగడపై వస్తున్న ఆందోళనకర వార్తలను నమ్మవద్దని, సహకార బ్యాంకుల సహా ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చిన ప్రమాదమేదీ లేదని రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడిక్కడ భరోసా ఇచ్చారు. బ్యాంకులు ఆర్థికంగా బలోపేతంగా, స్థిరత్వాన్ని కలిగివున్నాయని ఆయన పేర్కొన్నారు.

10/04/2019 - 21:50

ముంబయి, అక్టోబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరిరోజు సైతం భారీగా నష్టపోయాయి. ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ మరింతగా తగ్గించి చూపిస్తూ రెపోరేట్లలో మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. దీంతో బ్యాంకింగ్, శీఘ్రవిక్రయ వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎఫ్‌సీజీ) స్టాక్స్ భారీగా నష్టపోయాయి.

10/04/2019 - 21:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను బెంచ్‌మార్క్‌కన్నా మరింత తక్కువ చేస్తూ రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి చేయూతనిచ్చేలా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడిక్కడ పేర్కొంది. ఆర్థిక ఉద్దీపన నిమిత్తం కార్పొరేట్ పన్నుల కోత వంటి చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బాసటగా నిలుస్తోందని ఆ మంత్రిత్వ శాఖ కితాబిచ్చింది.

10/04/2019 - 21:47

ముంబయి, అక్టోబర్ 4: కార్పొరేట్ పన్నుల కోత, విదేశీ పెట్టుబడులపై సుంకాల వెసులుబాటు వంటి చర్యలతో ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం మరోదఫా మధ్యంతర డివిడెండ్‌ను ఆర్బీఐ నుంచి కోరుతుందన్న విషయంపై తనకెలాంటి సమాచారం లేదని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.

10/04/2019 - 05:35

న్యూఢిల్లీ : అత్యున్నత నిర్ణయాత్మక నాయకత్వం కలిగిన భారత ప్రభుత్వం దేశాన్ని వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్న లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడు బోర్గ్‌బ్రెండే గురువారం నాడిక్కడ పేర్కొన్నారు. అలాగే వచ్చే దశాబ్ధకాలంలో 10ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగానూ భారత్ అవతరిస్తుందని ఆయన తెలిపారు.

10/04/2019 - 05:30

విశాఖపట్నం, అక్టోబర్ 3: ఆలస్యంగా నడిచే రైళ్ల కోసం రైల్వే స్టేషన్లలో నిరీక్షించే ప్రయాణికులకు కాస్త ఊరట కలిగించే విషయమిది. ఇకపై ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో గేమింగ్ ఫన్ జోన్లు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలకు వినోదం, సృజనాత్మకతను పెంచే అనేక రకాలైన క్రీడలకు సంబంధించి గేమింగ్ ఫన్ జోన్లు ఏర్పాటవుతున్నాయి.

10/04/2019 - 02:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలో ఉల్లి ధరలు దిగొస్తున్నాయని కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించినందున రిటైల్ అలాగే హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు తగ్గడం మొదలైందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే కిలో అరవై నుంచి 70 రూపాయల వరకూ ధర పలికింది.

Pages