S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/14/2019 - 04:23

వాషింగ్టన్: ఈ ఏడాది భారత దేశ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు 6 శాతానికి తగ్గించింది. గడచిన త్రైమాసికాల్లో జరిగిన ఆర్థికాభివృద్థి తీరును పరిగణనలోకి తీసుకుని ఇలా సవరణలు చేసినట్టు ఆదివారం నాడిక్కడ విడుదలైన ప్రపంచ బ్యాంకు ‘సౌత్ ఏసియా ఎకనామిక్ ఫోకస్’ అధ్యయన నివేదిక వెల్లడించింది. 2018-19లో భారత వృద్ధిరేటు 6.9 శాతంగా ఉంది.

10/14/2019 - 00:59

విశాఖపట్నం, అక్టోబర్ 13: రైళ్ల ప్రైవేటీకరణకు కేంద్రం త్వరలో పచ్చజెండా ఊపనుంది. గత కొనే్నళ్లుగా దీనిపై జరుగుతున్న విస్తృత ప్రచారం రానున్న రోజుల్లో వాస్తవంలోకి రానుంది. ఈ విధానం త్వరలో అమలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

10/13/2019 - 23:21

విజయవాడ, అక్టోబర్ 13: 113 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్‌ను విలీనం చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ఇండియన్ బ్యాంక్ మరింత బలపడి దేశ ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషించనున్నదని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్య నిర్వహణాధికారి పద్మజా చుండూరు పేర్కొన్నారు.

10/13/2019 - 07:10

న్యూఢిల్లీ : భారతీయ టెలికం వౌలిక సదుపాయాల రంగం ఆదాయం 2023 నాటికి రూ. 21,500 కోట్ల నుంచి రూ. 31,000 కోట్ల వరకు చేరే అ వకాశాలున్నాయి. తాజా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి పరిణామాలు కొత్త బిజినెస్ మోడళ్లకు డిమాండ్‌ను పెంచుతుండటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంద ని శుక్రవారం సాయంత్రం వెలువడిన ఈవై అధ్యయ నం తెలిపింది. అయితే, ఈ స్థాయిలో ఆదాయాలను ఆర్జించే క్రమంలో ఈ రంగంలో రూ. 66,000 కోట్ల నుంచి రూ.

10/11/2019 - 23:52

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11: పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు.

10/11/2019 - 22:41

పుణే, అక్టోబర్ 11: రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూజలు చేయడం భారతీయ సంస్కృతిలో భాగమని, ఇదేమి ఎంతమాత్రం మూఢనమ్మకం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానం చక్రాల కింద నిమ్మకాయలు పెట్టడం, దానిపైన కొబ్బరికాయ ఉంచడం అన్నది భారతీయ సంప్రదాయమని ఆమె తెలిపారు.

10/11/2019 - 22:12

ముంబయి, అక్టోబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు వాణిజ్య వారం చివరి రోజు మళ్లీ కోలుకున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్యపరమైన సయోధ్య కుదిరే అవకాశాలున్నాయన్న కథనాలతో బాటు చైనా దేశాధినేత భారత పర్యటన నేపథ్యంలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు భారత్-చైనా మధ్య కుదిరే వీలుందన్న అంచనాలతో శుక్రవారం మదుపర్లు వాటాల కొనుగోళ్లకు దిగారు.

10/11/2019 - 22:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వ్యవసాయం, దాన్ని అనుబంధ రంగాల సహకార సంస్థలు దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే విషయంలో కీలక భూమికను పోషించే స్థితిలో ఉన్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు. ఈ సహకార సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లను సైతం అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

10/11/2019 - 22:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశంలో వరుసగా 11వ మాసమైన సెప్టెంబర్‌లో సైతం ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాల్లో తగ్గుదల నమోదైంది. పండుగ సీజన్‌ను సైతం సానుకూలంగా మార్చుకోవడంలో వైఫల్యం చోటుచేసుకుంది. భారత వాహన తయారీదారుల సొసైటీ ‘సియామ్’ శుక్రవారం నాడిక్కడ విడుదల చేసిన ఆందోళన వ్యక్తం చేసింది.

10/11/2019 - 22:09

ముంబయి, అక్టోబర్ 11: బ్యాంకు రుణాల కేటాయింపుశాతం తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజుల్లో రుణాల కేటాయింపుఅతి కనిష్ట స్థాయి 8.79 శాతానికి చేరి మొత్తం కేటాయింపులు రూ. 97.71 లక్షల కోట్లుగా నమోదైంది. రిజర్వు బ్యాంకు నుంచి లభ్యమైన గణాంకాల మేరకు డిపాజిట్ల వృద్ధిరేటు సైతం 9.39 శాతం తగ్గి 129.06 లక్షల కోట్లుకు పడిపోయింది.

Pages