S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/23/2016 - 00:16

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అయిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా రూ. 820 కోట్లకు పైగా సేకరించగలుగుతామని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే తదుపరి విడుదల చేయబోయే గోల్డ్ బాండ్స్ మరింత ఆకర్షణీయమైన ఫీచర్సతో దీపావళికి ముందే విడుదల చేయాలని కూడా భావిస్తోంది. ‘అయిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా వచ్చే మొత్తం రూ, 820 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నాం.

09/23/2016 - 00:14

సింగపూర్, సెప్టెంబర్ 22: దేశంలో అత్యధికంగా సంపదను సృష్టించే ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో గుజరాతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌లోని అత్యంత సంపన్నులైన 100 మందితో ప్రముఖ పత్రిక ‘్ఫర్బ్స్’ గురువారం విడుదల చేసిన జాబితాలో అంబానీలు, అదానీలు, సంఘ్వీలు, పటేళ్లు సహా గుజరాత్‌కు చెందిన పలువురు ప్రముఖ స్థానాలను ఆక్రమించారు.

09/23/2016 - 00:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో రుతుపవనాలు మెరుగ్గా ఉండటంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పెరుగుతుందని, గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 124.01 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది 135.03 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

09/23/2016 - 00:08

కాకినాడ, సెప్టెంబర్ 22: తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా కృష్ణా-గోదావరి బేసిన్ (కెజి బేసిన్)లో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికి తీస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి తగిన వాటాను సాధించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

09/23/2016 - 00:08

ముంబయి, సెప్టెంబర్ 22: ఆదాయ ధ్రువీకరణ పథకాన్ని (ఐడిఎస్) విజయవంతం చేసేందుకు ఆ శాఖ అధికారులు ఏ అవకాశాన్ని వదలడం లేదు.

09/23/2016 - 00:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంల సంపన్నులైన మదుపరులు తమ సొమ్మును సరయిన వాటిలోనే పెట్టుబడులు పెడతారని పోర్ట్ఫులియో మేనేజర్లపై విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఆగస్టు చివరి నాటికి భారతీయ పెట్టుబడుల మార్కెట్లో మదుపరులకు సలహాపూర్వక సేవలందించే ఈ సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తులు రూ.11.4 లక్షల కోట్లకు పెరిగి పోయాయి.

09/23/2016 - 00:06

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వచ్చే 2020 నాటికి భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) చైర్మన్ ఎ జయతిలక్ తెలిపారు.

09/22/2016 - 16:58

హైదరాబాద్‌: కింగ్‌ఫిషర్‌ మాజీ సీఎఫ్‌వో రఘునాథన్‌కు రెండు చెక్కు బౌన్స్‌ కేసుల్లో మూడో ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షను గురువారం విధించింది. జైలు శిక్షతోపాటు రూ.20,000 జరిమానా కూడా విధించారు. జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి కింగ్‌ఫిషర్‌ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్‌ కాగా, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా, రఘునాథన్‌లపై కేసులు నమోదయ్యాయి.

09/22/2016 - 16:52

దిల్లీ: గురువారం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 300 పెరిగింది. దీంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ. 31,550గా ఉంది. మరోవైపు ఒక్కరోజే రూ. 600 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 46,800కు చేరింది. వెండి ఒక్కరోజే రూ. 600 పెరిగి రూ.46వేల పైకి చేరింది.

09/22/2016 - 16:30

ముంబయి: వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నట్లు అమెరికా ఫెడ్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో దేశీయ మార్కెట్లలో గురువారం పెట్టుబడులు పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.74 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 8,800 మార్కును దాటింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 266 పాయింట్ల లాభంతో 28,773 వద్ద ముగిసింది.

Pages