S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/12/2016 - 07:40

మహబూబ్‌నగర్, జనవరి 11: సుందర, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ప్రపంచం ముందు ఉంచుతామని, తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటన్నింటినీ వెలుగులోకి తెచ్చి మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందులాల్ అన్నారు.

01/11/2016 - 16:07

ముంబయి: స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 24,825 వద్ద ముగిసింది. 38 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,568 వద్ద ముగిసింది.

01/11/2016 - 07:11

న్యూఢిల్లీ, జనవరి 10: కార్పొరేట్ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లోని మూడో త్రైమాసికాని (అక్టోబర్-డిసెంబర్)కి సంబంధించి విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై ఆధారపడి ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/11/2016 - 07:08

న్యూఢిల్లీ, జనవరి 10: విదేశీ మదుపరులు ఈ నూతన సంవత్సరం దేశీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 3,700 కోట్లకుపైగా పెట్టుబడులను తెచ్చారు.

01/11/2016 - 07:07

ముంబయి, జనవరి 10: ఆసియా ఖండంలో పురాతన స్టాక్ ఎక్స్‌చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. తనకంటూ సొంత పోస్టేజ్ స్టాంప్ గుర్తింపును పొందనుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం, సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘బిఎస్‌ఇ కోరిక మేరకు దానికి ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను జారీ చేస్తున్నాం. నేను చాలా ఆనందిస్తున్నాను. బిఎస్‌ఇ సేవలకు ప్రభుత్వ గుర్తింపు ఇది.’ అని అన్నారు.

01/11/2016 - 07:07

అమలాపురం, జనవరి 10: ఇంతవరకు నదులు, వాగుల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను గురించి విన్నాం... కానీ ఇప్పుడు సముద్ర తీరంలోనూ ఇసుకను మింగేస్తున్నారు కొందరు అక్రమార్కులు. గత కొంత కాలంగా పెరిగిన నిర్మాణ రంగ కార్యకలాపాలతో ఇసుక బంగారంగా మారిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో సరికొత్తగా సముద్ర తీర ప్రాంతంలోని ఇసుకను సైతం అక్రమంగా తవ్వి విక్రయించేస్తున్నారు.

01/11/2016 - 07:06

హోస్టన్, జనవరి 10: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టిస్తూ వంద కోట్ల డాలర్ల స్థాయిని దాటిపోయింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న 90 కోట్ల డాలర్ల జాక్‌పాట్ కోసం శనివారం రాత్రి జరిగిన లాటరీలోనూ ఎవరినీ అదృష్టం వరించలేదు.

01/11/2016 - 07:06

న్యూఢిల్లీ, జనవరి 10: భారతీయ ఐటి సంస్థల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై వరదలు, అమెరికా, ఐరోపా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

01/11/2016 - 07:05

న్యూఢిల్లీ, జనవరి 10: అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ దూసుకెళ్తోందని, ఈ ఏడాది 7.7 శాతం వృద్ధిరేటును అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పిడబ్ల్యుసి పేర్కొంది. ఈ ఏడాది కూడా చైనా ఆర్థిక వ్యవస్థలో మందగమనం నడుస్తుందన్న పిడబ్ల్యుసి..

01/10/2016 - 06:00

ముంబయి, జనవరి 9: తపాలా శాఖ ప్రారంభించనున్న పేమెంట్స్ బ్యాంక్‌లో భాగస్వాములు కావడానికి దేశ, విదేశాలకు చెందిన దాదాపు 40 ఆర్థిక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని కేంద్ర సమాచార, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వీటిలో సిటిగ్రూప్, బార్క్‌లేస్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర సంస్థలున్నాయన్నారు. శనివారం సెంట్రల్ ముంబయిలోని పరెల్ వద్ద ఈ-కామర్స్ పార్సిల్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రసాద్ ప్రారంభించారు.

Pages