S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/25/2016 - 05:43

బెంగళూరు, మార్చి 24: దేశంలోని 26 జాతీయ బ్యాంకులకు గత నాలుగేళ్లలో జరిగిన మోసాల వలన రూ.30 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ప్రభుత్వం నుంచి రూ.25 వేల కోట్ల ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యాంకులు 2011-12 నుంచి 2014-15 మధ్య కాలంలో జరిగిన మోసాల వలన రూ.30,873.86 కోట్లు నష్టపోయాయి.

03/25/2016 - 03:09

న్యూఢిల్లీ, మార్చి 24: భారత ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గణాంక శాఖ కార్యాలయం మందస్తు అంచనా వేసిన 7.6 శాతంకన్నా తక్కువగా 7.2 శాతం వృద్ధి చెందవచ్చని బిఎంఐ రిసెర్చ్ అంచనా వేసింది. పెట్టుబడులు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా తలెత్తిన సమస్యలు దీనికి ప్రధాన కారణమని ఆ సంస్థ అభిప్రాయ పడింది.

03/25/2016 - 03:08

చెన్నై, మార్చి 24: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ) ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి స్పష్టం చేసింది. దేశంలో బ్యాంకింగ్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం బుధవారం జైట్లీతో సమావేశమై ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ అంశం గురించి చర్చించింది.

03/25/2016 - 03:08

ముంబయి, మార్చి 24: ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలపై చేసే వ్యయం ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 4.4 శాతం పెరిగి 561 మిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని, ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రకటనలపై చేసే ఖర్చులో మొబైల్ ఫోనే ప్రధాన పాత్ర వహించనుందని అంతర్జాతీయ మార్కెటింగ్ ఇంటెలిజన్స్ సంస్థ వార్క్ అభిప్రాయ పడింది.

03/25/2016 - 03:07

ఆంధ్రభూమి బ్యూరో

03/25/2016 - 03:06

హైదరాబాద్, మార్చి 24: దేశంలో వినిమయ వాహనాల (యుటిలిటీ వెహికల్స్)ను తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘మహీంద్రా’ రానున్న 18 నెలల కాలంలో ఆఫ్రికాకు తమ భారీ, వాణిజ్య (హెవీ, కమర్షియల్) వాహనాలను ఎగుమతి చేయాలని యోచిస్తోంది. మహీంద్రా సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.

03/25/2016 - 03:06

ముంబయి, మార్చి 24: హోలీ పండుగను పురస్కరించుకుని గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి (ఎన్‌ఎస్‌ఇ), ఫోరెక్స్, మనీ, బులియన్ మార్కెట్లతో పాటు ప్రధానమైన ఇతర కమోడిటీ మార్కెట్లన్నీ మూతబడ్డాయి. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కూడా వీటికి సెలవు ప్రకటించారు.

03/25/2016 - 03:05

న్యూఢిల్లీ, మార్చి 24: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ అమెరికా మదుపరులు నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ చైనాను అధిగమించేసింది. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలను బట్టి అమెరికా విదేశీ ఈక్విటీ పెట్టుబడుల్లో భారత్ వాటా 1.8 శాతానికి పెరగ్గా, చైనా వాటా 1.6 శాతమే ఉంది.

03/25/2016 - 03:04

భీమవరం, మార్చి 24: జిల్లాను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దుతానని పదేపదే ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడంలేదని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆక్వాకల్చర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వస్తుంది వస్తుందని ఊరించిన వనామీ తల్లి రొయ్య ఉత్పత్తి కేంద్రం సిక్కోలు తరలిపోవడంతో ఆక్వా రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

03/24/2016 - 08:23

న్యూఢిల్లీ/ముంబయి: ప్రధాన మంత్రి పసిడి నగదీకరణ పథకంలో టన్నులకొద్దీ బంగారాన్ని డిపాజిట్ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి).. ఇందుకు వడ్డీని నగదు కంటే బంగారం రూపంలోనే కావాలంటోంది. పసిడి నగదీకరణ పథకంలో భాగంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో బంగారాన్ని టిడిడి డిపాజిట్ చేస్తుండగా, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన టిటిడి వద్ద 7 టన్నుల పుత్తడి ఉంది.

Pages