S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/04/2016 - 16:48

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 530 పైగా పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 170 పాయింట్లు క్షీణంచింది. ముఖ్యంగా నిఫ్టీ గట్టిమద్దతు స్థాయి 7800 పాయింట్లకు దిగజారి మరింత బలహీన సంకేతాలను అందజేసింది.

01/04/2016 - 07:52

న్యూఢిల్లీ, జనవరి 3: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

01/04/2016 - 07:50

న్యూఢిల్లీ, జనవరి 3: భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది.

01/04/2016 - 07:50

విశాఖపట్నం, జనవరి 3: విశాఖ నగరాన్ని పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారని కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, మన చరిత్ర, సంస్కృతిని కాపాడుకునేందుకు విశాఖ ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

01/04/2016 - 07:49

హైదరాబాద్, జనవరి 3: వరంగల్‌లో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (పిఎఫ్‌సి) బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్లను ఈ నెల 29వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు సమర్పించాల్సి ఉంది. టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా వీటికి బిడ్లను ఆహ్వానిస్తారు.

01/04/2016 - 07:48

రాజమహేంద్రవరం, జనవరి 3: అర్ధ శతాబ్దానికిపైగా వ్యవసాయాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది.

01/04/2016 - 07:48

న్యూఢిల్లీ, జనవరి 3: కాల్ డ్రాప్స్‌కు నష్టపరిహారం మొదలు పెట్టాలని టెలికాం ఆపరేటర్లను టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ కోరింది. ఈ మేరకు అన్ని టెలికాం సంస్థలకు ట్రాయ్ లేఖలు రాసిందని పిటిఐకి సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

01/03/2016 - 07:16

సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారుల సూచన

01/03/2016 - 07:15

కాకినాడ, జనవరి 2: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో అన్యాక్రాంతమైన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు చేపట్టిన విచారణ నత్తనడకన సాగుతోంది. ఈ నగరంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు.

01/03/2016 - 07:14

సూళ్లూరుపేట, జనవరి 2: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకమైన విక్రమ సారాభాయ్ అవార్డుకు ఎంపికయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర సైన్స్ అకాడమీ తరపున ఈ అవార్డును అందిస్తారు.

Pages