S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

10/07/2018 - 02:10

కేరళలో జీసస్ ప్రభువును ఓ ‘ఆర్థడాక్స్ చర్చి’ శిలువపైకి ఎక్కించింది. ఆ రోమన్ కాథలిక్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన ఆర్చిబిషప్ పేరు ఫ్రాంకో ములక్కాడ్. ఇటీవల ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో మార్మోగింది. భారతదేశంలో ‘తప్పిపోయిన గొర్రెల’కు మోక్షం ప్రసాదించ వలసిన నైతిక దైవిక ఆధ్యాత్మిక బాధ్యత ‘వాటికన్’ మీద ఉంది. అందుకని ఇక్కడికి విదేశాల నుండి మత ప్రచారకులకు భారీ మొత్తంలో ధన సంపత్తి రావడం జరుగుతున్నది.

10/06/2018 - 00:10

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న చివరి రోజులలో పలు సున్నితమైన అంశాలపై కీలకమైన తీర్పులు ఇస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా దేశ ప్రజల దృష్టిని ఆక ట్టుకున్నారు. ఆయనతో పాటు ఇతర న్యాయమూర్తులు కూడా గత పక్షం రోజులలో పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన తీర్పులలో- క్రిమినల్ కేసు లున్నవారిని చట్టసభలకు ఎన్నిక కాకుండా చేయడం ఎ లా? అనేది ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.

10/04/2018 - 01:55

ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పురస్కారంతో నన్ను మంగళవారం సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకుని నేను పులకాంకితుడనయ్యాను. ఇది ఒక వ్యక్తికి దక్కిన గౌరవంగా కాక.. ప్రకృతిమాతతో సామరస్య పూర్వక జీవన విధానాన్ని సర్వదా బోధించే భారతీయ సంస్కృతికి, విలువలకు లభించిన గుర్తింపుగా పరిగణిస్తున్నాను.

10/03/2018 - 02:16

మునె్నన్నడూ లేనంతగా ఇపుడు కుల, మత, సైద్ధాంతిక విభేదాలతో జనం చీలిపోయారంటూ సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు స్వీకరించే జస్టిస్ రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచనల్లో పడవేశాయి. ఏం చదవాలి? ఏం తినాలి? ఎలా మాట్లాడాలి?

10/02/2018 - 01:30

నేడు గాంధీ మహాత్ముని 150వ జయంతి
*

09/30/2018 - 00:27

కె.సోమేశ్వరరావు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం ఎంఎల్‌ఏ. ఈయన లోగడ వై.ఎస్.ఆర్ పార్టీలో ఉండేవాడు. 23 సెప్టెంబర్ 2018 నాడు సోమేశ్వర్‌ను, మాజీ ఎంఎల్‌ఏ సోమను మావోయిస్టులు కాల్చిచంపారు. ఈ బృందానికి చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి నాయకత్వం వహించాడు. దాదాపు యాభై మంది నక్సలైట్లు ఈ హత్యాకాండలో పాల్గొన్నారు. హత్య జరగడానికి ముందు తనను చంపవద్దు అంటూ సోమేశ్వరరావు ప్రాధేయపడ్డాడు.

09/29/2018 - 00:26

బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సహకారోద్యమ పితామహుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం జరిపిన ధీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి గ్రామంలో దివంగత కొండా హన్మక్క, పోషెట్టి బాపూజీ దంపతులకు లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న జన్మించారు.

09/27/2018 - 00:32

మరో నెల రోజుల్లో అక్టోబర్ 21వ తేదీన విధి నిర్వహణలో అమరులైన పోలీసుల దినోత్సవాలను జరుపుకోబోతున్న తరుణంలో అనంతపురం జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, పోలీసులు, కాకలు తీరిన రాజకీయ నాయకుడి మధ్య జరిగిన మాటల తూటాల సంగతి అందరికీ తెలిసిందే.

09/26/2018 - 00:47

క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభల సభ్యులు దోషులుగా తేలకముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడం ప్రజాప్రతినిధులకు ఎంతో ఊరట కలిగించే అంశమే అయినా, సుప్రీం కోర్టు చేసిన పలు వ్యాఖ్యలు మాత్రం నేతలకు ఇబ్బందికరమే.

09/25/2018 - 02:26

మావోయిస్టులు మరోసారి పంజా విసిరి ఇద్దరు ప్రజానాయకులను హతమార్చడం ఉభయ తెలుగు రాష్ట్రాలను ఒక్కసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడకు సమీపంలో మావోయిస్టులు తుపాకులతో కాల్చివేసి తమ ఉనికిని చాటుకున్నారు.

Pages