S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

08/24/2016 - 07:36

దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని దీవులు తనవే నంటూ చైనా చేస్తున్న వాదనను తిరస్కరిస్తూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పినదగ్గరినుంచి, డ్రాగన్‌లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. యుద్ధోన్మాదంతో సైనిక పరమైన ప్రతిచర్యకు పూనుకునే రీతిలో చైనా ప్రతిస్పందన ఉంటుందన్నది అంతా అనుకున్నదే అయినప్పటికీ, మరోవిధమైన యుక్తులు కూడా వ్యక్తం కా వడం గమనార్హం.

08/22/2016 - 23:53

ఎన్నికల కోసం ఎవరెన్ని చిత్రవిచిత్ర విన్యాసాలు చేసినా తమ మూలాలను విస్మరించకూడదు. ఒక్కొక్క తరానికి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి తనదైన ఒక్కొక్క నినాదం ఉంటుంది. దాని సాఫల్యం కోసం వారు జన్మతః అహరహరం శ్రమిస్తుంటారు. నరేంద్ర మోదీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రధాన నినాదం ‘సబ్‌కా భలా సబ్‌కా వికాస్’. నిజానికి భాజపాకు ఒక స్పష్టమైన ఎజెండా ఉంది.

08/22/2016 - 07:31

తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సుమారు వారం రోజుల క్రితం ఒక టెలివిజన్ ఛానల్‌కు ఇంటర్‌వ్యూ ఇస్తూ, తాను దేవాలయాలకు వెళ్తుంటానని చెప్పారు. ఒక కమ్యూనిస్టు నాయకుడు అయివుండి అట్లా చెప్పటం వినేవారికి ఆశ్చర్యం కలిగిస్తుందని, అపోహలకు తావిస్తుందని భావించినట్లున్నారు. దాంతో అంతలోనే సర్దుకొని అక్కడ ప్రజలు ఉంటారు కనుక వెళతానని వివరణ ఇచ్చారు.

08/21/2016 - 00:56

ఛీ..ఇదేం జర్నలిజం? ఇదేం మీడియా? అస లు మీడియా మారాలి! చిన్నారులు, మహిళలపై దాడులను పదేపదే చూపించడమేమిటి? చనిపోయి పుట్టెడు కష్టంలో ఉన్న వారి వద్దకు వె ళ్లి ఎలా ఫీలవుతున్నారని అడగడమేమిటి’?.. ఇదే దో రోజూ చానెళ్లు చూసేందుకు అలవాటుపడిన సామాన్యుడి వ్యాఖ్య కాదు. ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరుడు, విసుగుతో మీడియాను నిలదీసిన వైనమిది!

08/20/2016 - 08:12

నాలుగేళ్ల కోసారి జరిగే ఒలింపిక్ ఆట ల్ని దృశ్యమాధ్యమమైన టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటగాళ్లని, ఆటల్ని ప్రత్యక్షంగా చూడడం జరుగుతున్నది. కొందరు ఆటగాళ్ల దేశాన్ని ప్రపంచ పటంలో వెతికినా తొందరగా గుర్తించని స్థితి. అయినా అలాంటి దేశాలు సైతం స్వర్ణాల్ని చేజిక్కించుకుని పెట్టుబడి దారి దేశాలకు, సంపన్న దేశాలకు వలస వాద దేశాలకు సవాళ్లని విసురుతూనే వున్నా యి.

08/18/2016 - 23:33

చెన్నై నుండి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన ఎన్-32 విమానం ఆచూకీ లభించకపోవడంతో భారత భద్రతా వ్యవస్థ పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది శిక్షణ పొందిన సైనికులు సైతం గల్లంతవడం దురదృష్టకరం. ఈ విమా నం ఆచూకీ కనుగొనడానికి భారత ప్రభు త్వం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు ఫలితం లేదు.

08/17/2016 - 23:29

పైసలను రక్షించుకున్నట్టయితే రూపాయలు సహజంగా రక్షితవౌతాయి- అన్నది జనజీవనంలోని లోకోక్తి. చిన్న చిన్న సంస్కారాలను రక్షించుకున్నట్టయితే సం స్కారాల సమాహారమైన సంస్కృతి సురక్షితం కావడం కూడ హైందవ జాతీయ జీవనంలో వికసించిన యుగయుగాల వాస్తవం. చైనీస్ ఫుడ్, అంకుల్ షామ్ చిప్స్, నెజల్ నూడుల్స్, క్యాడ్బరీ చాక్లెట్లు- ఇవన్నీ వేరువేరు దుకాణాలలో లభించడం రెండేళ్ల క్రిందటి మాట...

08/16/2016 - 23:39

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 18 నుంచి మొ దలై, ఆగస్టు 12 వరకు జరిగిన ఉభ య సభలు సుమారు 250 గంటలపాటు ప్రజాసమస్యలపై చర్చించాయి. ఓ పదిశాతం సమయం అంతరాయంతో వృథా అయినా మరో పదిశాతం సమయం అదనంగా కేటాయించి, మొత్తంమీద 14 బిల్లు లు ఆమోదించడంతో ఉభయ సభల సభ్యులు పరిణితి ప్రదర్శించారు.

08/16/2016 - 00:23

మానవత్వం ఇతివృత్తంగా ఉండే సినిమాలు, కథలలో మనకు తరచుగా తారసపడే సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఎదుటి మనిషి బాధను, అది జరిగినపుడు వెంటనే అర్థం చేసుకోలేనివారు తర్వాత అటువంటి బాధే తమకు కలిగినపుడు అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇద్దరూ పరస్పరం ఎదురవుతే ఒకరినొకరు కౌగిలించుకుని కలిసి ఏడుస్తారు.‘‘అప్పుడు నాకు తెలిసిరాలేదన్నా’’ అంటే ఇవతలి మనిషి, ‘‘జరిగిందేదో జరిపోయిందిలే. నేను మరిచిపోయాను, నువ్వూ మరిచిపో.

08/15/2016 - 05:58

‘జయజయ జయభారత జనయిత్రీ దివ్యథాత్రి’ అనే సంగీతం భూనభోంతరాళాలు మార్మోగుతున్నవేళ. ఉదయ సంధ్యారాణి మరో స్వేఛ్చా స్వాతంత్య్ర హేల. ఈ పవిత్ర సమయంలో జాతి విముక్తికై రక్తతర్పణం చేసి దివికేగిన దేశభక్తులను ఒక్కసారి స్మరించుకుందాం. వారి అడుగుజాడలను అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.

Pages