S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/07/2017 - 02:55

కర్నాటకలో గోవిందరాజు అనే కాంగ్రెస్ ఎంఎల్‌సి ఉన్నాడు. ఇటీవల ఇన్‌కంటాక్సు అధికారులు ఆయన డైరీని స్వాధీనం చేసుకున్నారు. నెం: ఎ-కె-జి-03. ఇందులో కొన్ని కోడ్‌నేమ్స్ ఉన్నాయి. అవి ఎస్-జి- ఆర్-జి- ఎం-వో- ఎ-పి- ఇత్యాదులు. వీటిని డీకోడ్ చేస్తే సోనియాగాంధీ రాహుల్ గాంధీ మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్ వంటి పేర్లు అని తెలుస్తున్నాయ. వీరికి కోట్లలో డొనేషన్ల పేరుతో నల్లధనం వున్నట్టు చెప్పబడింది.

03/06/2017 - 07:30

దారిన పోతున్న దానయ్యకు ఓ గుంతను తవ్వుతున్న కూలీలు కనపడ్డారట! గుంత దేనికని ప్రశ్నిస్తే, కూలీలకు ఉపాధి కల్పించడానికని అన్నాడట మేస్ర్తి, తిరిగి వస్తున్న దానయ్యకు అదే గుంతను పూడ్చడం కనపడిందట! కారణమడిగితే- ఉపాధికేనన్న సమాధానం! ప్రపంచీకరణ తర్వాత ఇలాంటి అభివృద్ధి నమూనాలు దేశవ్యాపితమయ్యాయి. పని ఏదైనా జనాలకు కొంత ఉపాధి దొరికిందని వాదించే పాలకులకు, వీరికి వత్తాసుపలికే మేధావులకు ఈ దేశంలో కొదువ లేదు.

03/05/2017 - 00:54

గత కొన్ని రోజులుగా అన్ని ఇంగ్లీషు టీవీ చానళ్లలో ప్రైమ్‌టైమ్, నాన్ ప్రైమ్‌టైమ్ న్యూస్‌లో ఒకే ఒక వార్త అధికభాగం ఆక్రమించింది. మీరు మీ టీవీ చానల్ ఆన్ చేసిన తక్షణం ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి ఎలాంటి ఆడియో లేకుండా వరసగా ప్లకార్డులు చూపుతూ కనిపిస్తుంది. ఒకవేళ వేరే ఏదైనా వార్త చూపించినా టీవీ తెరపై ఓ పక్క ఆ అమ్మాయే ఆక్రమించుకొని ఉంటుంది. రాత్రికిరాత్రి ఆ అ మ్మాయి అంత ముఖ్యమైన వ్యక్తిగా ఎలా మారిపోయింది?

03/04/2017 - 01:29

గతి తప్పుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా నడిపించేందుకు గత రెండున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది.

03/03/2017 - 00:42

‘పెళ్లి అనేది మంచిదైతే అధికస్య అధిక ఫలం’ అన్నారు గనుక- చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లిచేసి, వాడు చస్తే మరొకడికి, మరోడు చస్తే మరోడికి.. ఇలాగ పెళ్లిమీద పెళ్లి అయి- వీడి దగ్గరో వెయ్యి, వాడి దగ్గిరో వెయ్యి- రొట్టెమీద నెయ్యి, నేతిమీద రొట్టెలాగ యేకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధిమంతుణ్ణి పెళ్లాడితే ఇహ సౌఖ్యం పూర్తిగా లభిస్తుంది.

03/02/2017 - 04:31

భూమి వంటి మరో ఏడుగ్రహాలను శాస్తవ్రేత్తలు గుర్తించారట! ఈ ఏడు గ్రహాలు ఒక ‘నక్షత్రం’ చుట్టూ తిరుగుతున్నాయట! ఈ గ్రహాల గృహం మన సౌర కుటుంబానికి ము ప్పయి తొమ్మిది ‘కాంతి సంవత్సరాల’ దూరంలో అంతరిక్షంలో అలరారుతోందట!

03/01/2017 - 00:11

ఉద్యోగం, ఉపాధి, మరో పేరు ఏదైనా కావచ్చు. మనిషికి కావలసింది నిత్య జీవితావసరాలు తీరి, గౌరవంగా జీవించేందుకు సరిపోయే ఆదాయం. కాని జనాభాలో సగానికన్నా ఎక్కువ మందికి ఇందుకు హామీలేని పరిస్థితులు ఏర్పడటం చాలాకాలం క్రితమే మొదలైంది.

02/28/2017 - 00:49

యూరప్‌లోని ఆర్థిక, మత విధానాలపై సమకాలీన స మాజం నిరసన వ్యక్తం చేసింది. ఒక గనికి ఒక అధిపతి ఉంటాడు. అతని కింద వందమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ కార్మికులకు ఎలాంటి ఆర్థిక వనరులు ఉండవు. కొద్దిమంది చేతుల్లో ఆర్థిక వనరులన్నీ కేంద్రీకరింపబడ్డాయి. వారు సమాజాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని తమ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణమైన వారికే రాజ్యాధికారం కట్టబెట్టారు. దీనినే ‘పెట్టుబడిదారీ విధానం’ అన్నారు.

02/27/2017 - 00:21

1967 నాటి వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా దాష్టీకాన్ని ప్రశ్నిస్తూ ‘న్యూయార్క్ రివ్యూ’లో నోమ్ చామ్‌స్కీ రాసిన ‘మేధావుల పాత్ర’ అనే వ్యాసంలో బాధ్యతలున్న వ్యక్తులు, రచయితలు, సామాజిక వేత్తలు, న్యాయాధీశులు లాంటి వారందరూ ప్రభుత్వాలకు సంబంధించిన వాస్తవాలను మాట్లాడాలని, వారు చెప్పే అబద్ధాలను బాహ్య ప్రపంచానికి తెలియచెప్పాలని పేర్కొన్నారు.

02/26/2017 - 00:34

కాశ్మీర్‌లో ‘రాళ్లు రువ్వేవారి’ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించడంపై అనవసర రాద్ధాంతం చేయడం కన్నా, ఈ విషయంలో దేశభక్తిగల భారతీయ పౌరులంతా పార్టీ రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాలి. అధికారం కోసం ఆకాంక్ష తప్ప మరో ఆలోచన లేని, వారసత్వం పేరిట అసమర్ధ నాయకుడిని జాతిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తూ నరేంద్ర మోదీ ఏదీ చెప్పినా, చెప్పక పోయినా గుడ్డిగా వ్యతిరేకిస్తోంది.

Pages