S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/07/2019 - 01:38

మావోయిస్టుల లక్ష్యం ‘ఎర్రకోట’పై ఎర్రజెండా ఎగురవేయడం. ఆ లక్ష్యం చేరుకోవడానికి వీలుగా సాయుధ దాడులకు తెగబడుతున్నా రు. అలాంటి దాడుల విజయంతో మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుని, ఆదివాసీలతో సైన్యం ఏర్పరచి, కవాతు చేసి ఢిల్లీలో పాగా వేయాలన్నది వారి వ్యూహం. ఈ వ్యూహం-ఎత్తుగడల్లో భాగంగానే గత సంవత్సరం మోదీ హత్యకు వారు కుట్ర పన్నారన్న సంగతి సంచలనం సృష్టించింది.

06/05/2019 - 03:13

‘‘సమాజ సరోవరంలో ఒక మనిషి సృష్టించిపోయిన అలలు సమసిపోయేంతవరకూ- అతగాడు మరణించినట్లు భావించకూడ’’ దన్నాడు ప్రముఖ ఇంగ్లిష్ రచయిత టెర్రీ ప్రాచెట్. కిందటి నెల (మే) 26న తన ఎనభయ్యోయేట హైదరాబాద్‌లో కన్నుమూసిన ప్రముఖ ప్రచురణకర్త, ‘ప్రాచీ’ ప్రచురణ సంస్థ వ్యవస్థాపకుడు, పేరేప పూరణ్‌చంద్ జోషీ (1939-2019) కన్నా తొమ్మిదేళ్ళ తర్వాత పుట్టి, నాలుగేళ్లు ముందుపోయిన ప్రాచెట్‌కు జోషీతో పరిచయం ఉన్నట్లు ఎక్కడా వినలేదు.

06/02/2019 - 01:49

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొంత అనూహ్యంగా ఉన్నమాట నిజం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందున్న అంచనాలు ఫలితాలు వెలువడే వేళకు మారిపోయాయి. అందుకే కావచ్చు.. ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాక సైతం రాజకీయ పండితులు చాలా సందేహాలను వ్యక్తం చేశారు. ఫలితాలు మరీ ఇంత ఏకపక్షంగా ఉంటాయని ఊహించలేకపోవడం లేదా ఇష్టపడకపోవడం ఇందుకు కారణం కావచ్చు.

06/01/2019 - 01:38

దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఆర్థిక, సామాజిక వ్యవస్థలను నిర్వీర్యం చేసి, జాతిని సంక్షోభంలోకి నెడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందక ఎంతోమంది ప్రా ణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది పేదలు తమ ఆరోగ్య సంరక్షణకు సరైన సౌకర్యాలు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. సామాన్య మానవుడు ‘ఆరోగ్య భద్రత’ కొరవడి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

05/25/2019 - 22:54

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఫలితాలు వెలువడే వరకూ దేశంలోని రాజకీయ పార్టీల అధినాయకులు ఉత్కంఠ భరితంగా ఊగిపోయారు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమయ్యాక దేశ విదేశాల ప్రజలందరూ ఫలితాలను టీవీల్లో వీక్షించటం మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ అఖండ విజయం సాధించింది. దేశప్రజల ఆకాంక్ష నెరవేరింది.

05/25/2019 - 22:49

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఫలితాలు వెలువడే వరకూ దేశంలోని రాజకీయ పార్టీల అధినాయకులు ఉత్కంఠ భరితంగా ఊగిపోయారు. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమయ్యాక దేశ విదేశాల ప్రజలందరూ ఫలితాలను టీవీల్లో వీక్షించటం మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ అఖండ విజయం సాధించింది. దేశప్రజల ఆకాంక్ష నెరవేరింది.

05/24/2019 - 23:34

కృత్రిమ మేధకు ఆహ్వానం పలికే కాలమిది. కృత్రిమ మేధ అంతటా పరివ్యాప్తమవుతున్న సందర్భమిది. మానవ మేధకు ‘ప్రచ్ఛన్నం’గా కృత్రిమ మేధను అభివృద్ధి పరుస్తున్న సమయమిది. ఈ విషయం అందరి అనుభవంలోకి వస్తోంది. తదనుగుణంగా తమను తాము మలచుకుంటున్న వైనాన్ని సైతం చూస్తున్నాం.

05/22/2019 - 01:39

ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. భారతీయ సమాజంలో నరనరాన వేళ్లూనుకుంది. మనుధర్మాన్ని పాటించిన ఈ వ్యవస్థలో ఉన్నత కులాలు లేదా అగ్రకులాలు లేదా ఆధిపత్య కులాలు (ఓసీలు) రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానంలో ఉండటమే కాక సర్వసుఖాలు అనుభవించారు. అనుభవిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యంత దారుణమైన వివక్షకు గురై, అణచివేయబడి తీవ్రంగా నష్టపోయారు.

05/19/2019 - 02:37

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో అనేక మంది రాజకీయ నాయకులు చౌకబారు విమర్శలు, స్థాయికి తగని ఆరోపణలు, క్షమాపణలతో మనకు దర్శనమిచ్చారు. సరే.. వీరి విషయంలో ఎన్నికల తదనంతరం- ఈ ప్రదర్శనలు- ఈ ప్రకరణం ముగుస్తుందని మనం సంతోష పడవచ్చు.

05/18/2019 - 01:41

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుడు విభిన్న రంగాల్లో అనూహ్య అభివృద్ధిని సాధిస్తూ, విశ్వ రహస్యాలను సైతం ఛేదిస్తున్నా- ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు బలంగా పాతుకొని ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలలో బాబాలు, స్వాములు, మంత్రగాళ్లు తమ వద్ద మహిమలు, మాయలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతూ అమాయకులను దోచుకొంటున్నారు.

Pages