S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/21/2019 - 02:01

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ తీసుకొంటున్న సత్సంకల్ప నిర్ణయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొత్త ఆశలు చివురింప చేస్తున్నాయి.

06/19/2019 - 02:06

ఇంటర్నెట్ వినియోగంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. మేరీ మీకర్ అనే అధ్యయన సంస్థ జరిపిన సర్వేలో ఇది నిరూపితమైంది. అభివృద్ధికి ఇంటర్నెట్ ఇరుసుగా మారింది. భారత్‌లో ఈ ఘన విజయానికి రిలయన్స్ ‘జియో’ కారణమని తేటతెల్లమైంది. ఎక్కువ వేగం (4జీ)తో తక్కువ ధరకు సమాచార బట్వాడా కారణంగా మన దేశంలో జియో గొప్ప అంతర్జాల విప్లవాన్ని తీసుకొచ్చింది.

06/18/2019 - 01:54

తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా సందుసందునా బెల్టుషాపులు ఎల్లవేళలా మందుబాబులకు స్వాగతం పలకడానికి తెరుచుకొని ఉంటాయి. ఒకప్పుడు ఒక వ్యక్తి పొద్దంతా పనిచేసి అలసిపోయి, సాయంత్రం అయ్యే సరికి ఒక గ్లాసు మద్యం తాగి, బుక్కెడు బువ్వ తిని నిద్రబోయేవాడు. ఇరవై ముప్పయి సంవత్సరాల వయసొచ్చిన వ్యక్తులెవ్వరైనా ఒకప్పుడు మద్యం సేవించాలనుకుంటే ఎంతో భయపడేవారు.

06/16/2019 - 01:45

కమ్యూనిస్టుల పాలన ఎలా ఉంటుందో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ తాజాగా ‘రుచి’ చూపించారు. ప్రపంచమంతటా ప్రజాస్వా మ్యం పరిఢవిల్లుతున్న సమయంలో లింగూ లిటుకూమంటూ ఉత్తర కొరియాలో కమ్యూనిస్టు వ్యవస్థ కొనసాగుతోంది. ఆ వ్యవస్థను తన కనుసైగలతో కొనసాగిస్తున్న కిమ్ సరికొత్త కిరాతకం ఇటీవల వెలుగు చూసింది.

06/14/2019 - 22:20

ఈఏడాది నైరుతి రుతుపవనాలు మందగమనంతో ప్రవేశిస్తున్నాయి. గత సంవత్సరం కంటే 10 రోజులు ఆలస్యం కావచ్చునని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మన దేశంలో ఏటా రుతుపవనాలు కేరళను తొలుత తాకి, ఆ తరువాత మిగిలిన రాష్ట్రాలను అనుగ్రహించటం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక ప్రకృతి ధర్మంగా మారింది. దేశ వ్యాప్తంగా రైతన్నలు తొలకరి చినుకుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా ఎక్కడా ఊరట లేదు.

06/14/2019 - 01:47

అఖండ భారత్‌లో అనాది భాష సంస్కృతం. అనాది సాహిత్యం సంస్కృత భాషలోనిదే. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు సంస్కృతంలోనే లిఖించబడినవి. వాల్మీకి రచించిన రామాయణం ఇరవై నాలుగవ త్రేతాయుగం లోనిది. వ్యాసుడు-కృష్ణద్వైపాయణుడు రచించిన మహాభారతం ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగం లోనిది. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం రాసిన పతంజలి ఇరవై ఎనిమిదవ కలియుగం 1844- క్రీస్తుపూర్వం 1258కి చెందినవాడు.

06/13/2019 - 01:19

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, తమిళనాడులో డీఎంకే మినహా దేశంలోని ప్రాం తీయ పార్టీల కోటలన్నింటిపై భారతీయ జనతాపార్టీ బాద్‌షా నరేంద్ర మోదీ జయకేతనం ఎగురవేశారు. ఆయన ‘చాయ్‌వాలా’, ‘చౌకీదార్’ పలుకుబడుల ఆకర్షణలు జన సమ్మోహితంగా ఆకట్టుకొన్నాయి. కేంద్రంలో మళ్లీ సారథ్యం వహించే అవకాశం భారత ప్రజాస్వామ్యం మోదీకి కట్టబెట్టింది. ప్రస్తుత రాజకీయ స్థితిగతులు ప్రజల మనోభావాలను ప్రతిబింబింప చేస్తున్నాయి.

06/12/2019 - 01:25

‘పిల్లలంతా పనిలో కాదు- బడిలో ఉండాలి’- అనే నినాదం ఆచరణలో నిజమైనపుడు ‘బాల కార్మిక వ్యవస్థ’ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. అప్పుడు పిల్లలు వారి హక్కులను ఆనందంగా అనుభవిస్తారు. కొందరు పిల్లలు పనులకు వెళ్లడం వల్ల వారు శారీరకంగా, మానసికంగా అవస్థలు పడుతున్నారు. దీంతో వారు తమ భవిష్యత్తును అందంగా ఊహించుకోలేక పోతున్నారు. బాల కార్మిక వ్యవస్థ మరోవైపు సామాజిక సమస్యలను సృష్టిస్తుంది.

06/09/2019 - 02:16

హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న ‘టీ-హబ్’ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని రతన్‌టాటా లాంటి వాణిజ్య దిగ్గజాలు కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ లాంటివారు సందర్శించి ప్రపంచస్థాయి ఇంక్యుబేటర్ అని ప్రశంసించారు. దాంతో అక్కడి స్టార్టప్‌ల పని సంస్కృతిలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తోంది. దేశం నలుమూలల నుంచి ఎందరో యువతీ యువకులు తమ స్టార్టప్‌లతో అక్కడ ఎదిగేందుకు కృషిచేస్తూ వున్నారు.

06/07/2019 - 22:36

సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. ‘ఆకాశాతృతితం తోయం యథారచ్ఛతి సాగరం’ అంటారు. అంటే ఆకాశం నుండి పడిన ప్రతి నీటిబొట్టు చివరికీ కలిసేది సముద్రంలోనే అనీ. అలాగే ‘నదీ నాం సాగరో గతిః’ అంటారు. నదులకు సముద్రమే గతి అని అర్థం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సముద్రాలు కాలుష్యానికి గురికావడం విచారకరం. మనం పీల్చే ప్రాణవాయువు సగం సముద్రాల నుంచే వస్తుంది.

Pages