S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/22/2017 - 23:30

కొచ్చి చేరిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ట్రోఫీ. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం కన్నుల పండుగా జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ క్రీడాశాఖ మంత్రి ఎసి మోయిదీన్ ఈ ట్రోఫీని ఆవిష్కరించాడు. పలువురు అభిమానులు, క్రీడాకారులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని వివిధ నగరాల్లో ఈ ట్రోఫీని ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రదర్శిస్తారు.

09/22/2017 - 23:28

కోల్‌కతా, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ఆధ్వర్యంలో జరిగే అండర్-17 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టుకు ఐ-లీగ్‌లో చోటు కల్పించడమేగాక, ఢిల్లీని హోం గ్రౌండ్ చేసే అవకాశాలున్నాయి. వచ్చేనెల మొదటి వారంలో జరిగే సమావేశంలో ఈ విషయంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ ఏడాది అండర్-17 వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

09/22/2017 - 23:27

కోల్‌కతా, సెప్టెంబర్ 22: విదేశాల్లో ఆస్ట్రేలియా గత పది మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కోవడం ఆ జట్టు పతనానికి నిదర్శనం. మ్యాచ్‌లకు ముందు వేసుకున్న వ్యూహాలుగానీ, తీసుకున్న నిర్ణయాలుగానీ సక్రమంగా అమలు కావడం లేదని భారత్‌తో జరిగిన రెండు వనే్డలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అంగీకరిస్తున్నాడు.

09/22/2017 - 23:26

కరాచీ, సెప్టెంబర్ 22: ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడకుండా మొండి చేయి చూపిస్తున్న భారత్ నుంచి కనీసం మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వివాదాల పరిష్కార కమిటీ (డిఆర్‌సి)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అప్పీల్ చేసింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య 2015 నుంచి 2023 మధ్య కాలానికి ఒక ఒప్పందం కుదిరింది.

09/22/2017 - 23:25

టోక్యో, సెప్టెంబర్ 22: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత్ పోరుకు తెరపడింది. అయితే, మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్ టైటిల్ వేట కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పివి సింధు పరాజయాలను ఎదుర్కొగా, శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా వారి దారినే అనుసరించారు.

09/22/2017 - 23:23

ముంబయి, సప్టెంబర్ 22: కోల్‌కతాలో వచ్చేనెల 17న అట్లాటికో డి కోల్‌కతా (ఎటికె), నిరుటి రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ నాలుగో సీజన్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం మీద 10 జట్ల మధ్య 95 మ్యాచ్‌లు జరుగుతాయి. గతం లో ఎనిమిది జట్లతోనే ఈ టోర్నమెంట్‌ను నిర్వ హించారు.

09/22/2017 - 23:22

ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సిసిఐ)లో బిసిసిఐ మాజీ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ పేరుతో ఒక స్టాండ్‌ను శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్

09/22/2017 - 23:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఢిల్లీ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ ఎంపికయ్యాడు. గౌతం గంభీర్ కెప్టెన్సీ నుంచి వైదొగలడంతో, రంజీ తదితర టోర్నీల్లో అతని స్థానంలో ఇశాంత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

09/22/2017 - 23:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో యు ముంబాను ఢీకొన్న దబాంగ్ ఢిల్లీ పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, ఈ మ్యాచ్ చివరి వరకూ హోరాహోరీగా సాగింది. యు ముంబా 30 పాయింట్లు చేయగా, శక్తి వంచన లేకుండా పోరాడిన ఢిల్లీ 28 పాయింట్లు సాధించగలిగింది. ఢిల్లీ తరఫున అబుఫజల్ ఆరు, రోహిత్ బలియన్, మిరాజ్ షేక్, సునీల్ తలా నాలుగు చొప్పున పాయింట్లు సంపాదించారు.

09/22/2017 - 23:19

భారత క్రికెట్‌ను ఒక గొప్ప ఆటగాడిగా, కెప్టెన్‌గా శాసిస్తున్నది విరాట్ కోహ్లీ అన్నది అందరికీ తెలిసిన సత్యం. అయితే, దేశంలోని చాలా నగరాల్లో ఇప్పటికీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే విపరీతమైన క్రేజ్ ఉంది. అతనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్స్‌లో స్టాండ్స్ అన్నీ కిక్కిరిసిపోవడానికి ధోనీ రాకనే ప్రధాన కారణం.

Pages