S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/08/2018 - 05:48

ఐరాస: అమెరికా, భారత్‌తో సహా ఎనిమిది దేశాలు వీలైనంత త్వరగా సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందాన్ని (సీటీబీటీ) ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని ఐరాస చీఫ్ ఆంటోనియో గాటెర్రెస్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాత్సారం చేస్తే ప్రపంచ శాంతి, ప్రపంచ దేశాలను అణ్వస్త్ర రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్నారు. సీటీబీటీ ఒప్పందంపై ప్రపంచంలో 180 దేశాలు సంతకాలు చేశాయన్నారు.

09/08/2018 - 04:42

ప్రాగ్యూ, సెప్టెంబర్ 7: భారత రక్షణ రంగం అవసరాలకు అనుగుణంగా పరికరాల తయారీ సంస్థల ఏర్పాటుకు ముందుకు రావాలని రాష్టప్రతి రామ్ నాథ్‌కోవింద్ చెక్ దేశ రక్షణ కంపెనీలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ ఆయన చెక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్‌తో సమావేశమై ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ధి అంశాలపై చర్చించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చెక్ దేశంలోని సంస్థలను రాష్టప్రతి కోరారు.

09/07/2018 - 23:34

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 7: ఎంతోప్రసిద్ధిగాంచిన చారిత్రక గురుద్వారను సిక్కు భక్తులు సందర్శించడానికి వీలుగా కర్తార్‌పూర్‌లోని సరిహద్దు మార్గాన్ని తెరుస్తామని, ఎలాంటి వీసాలు లేకుండానే భక్తులు అక్కడకి వెళ్లడాన్ని అంగీకరిస్తామని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి తెలిపారు. కర్తార్‌పూర్ గురుద్వార పాకిస్తాన్ నాటోవల్ జిల్లాలో భారత సరిహద్దుకు సమీపంలో ఉంది.

09/07/2018 - 02:44

టోక్యో, సెప్టెంబర్ 6: భూకంపం, కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో జపాన్ దేశంలో తొమ్మిది మంది మృతి చెందారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. దేశంలోని ఉత్తర ప్రాంతంలో గురువారం సంభవించిన భూకంపం వల్ల తొమ్మిది మంది చనిపోగా, చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఈ వారంలో పెద్దతుపాను దేశాన్ని తాకడంతో అనేక ఇళ్లు నేలమట్టమైన సంగతి తెలిసిందే.

09/07/2018 - 04:21

సోఫియా: తాము ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తమ దేశంలో పెట్టుబడులను పెట్టాలని భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బల్గేరియా దేశ కంపెనీలను ఆహ్వానించారు. గురువారం ఆయన ఆ దేశ ప్రధాని బోయ్‌కో బొరిసేవ్‌ను కలిసి పలు అంశాలను చర్చించారు.

09/06/2018 - 02:17

సోఫియా, సెప్టెంబర్ 5: పౌర అణు విధాన రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, బల్గేరియా దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. భారత రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్, బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాడేవ్‌లు రెండు దేశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భారత రక్షణ రంగం అభివృద్ధిలో బల్గేరియా కీలక భాగస్వామి కావాలని రాష్టప్రతి కోరారు.

09/06/2018 - 02:16

జపాన్‌లో బుధవారం సంభవించిన తుపాను తాకిడికి ధ్వంసమైన కన్‌సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బ్రిడ్జి. తుపాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎయిర్‌పోర్టులలో దాదాపు 3వేల మంది ప్రయాణికులు నిలిచిపోయారు.

09/06/2018 - 02:10

వాషింగ్టన్, సెప్టెంబర్ 5: మండే సూర్యుడి దృశ్యాలను, పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నాసా త్వరలో సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించనుంది. భూమి వాతావరణం నుంచి ఈ రాకెట్ సూర్య మండలంలో మార్పులను అధ్యయనం చేస్తుంది. ఎక్స్‌రే ద్వారా సూర్య మండల దృశ్యాలను బంధిస్తుంది. ఈ రాకెట్‌కు ఫోకసింగ్ ఆప్టిక్స్ ఎక్స్ రే సోలార్ ఇమేజర్ మిషన్ అని నామకరణం చేశారు. ఈ నెల 7వ తేదీన న్యూ మెక్సికో నుంచి ఫోక్స్‌సీని ప్రయోగిస్తారు.

09/06/2018 - 02:06

యారెన్ (నౌరు): ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటైన చైనా ప్రతినిధికి, కేవలం 11 వేల జనాభా మాత్రమే ఉన్న నౌరు దేశ అధ్యక్షునికి ఇక్కడ జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మాటామాటా పెరగడంతో ఇద్దరూ కోపంతో సమావేశాన్ని బహిష్కరించారు. చైనాదేశ ప్రతినిధి తనను అవమానించాడని, అగౌరవంగా మాట్లాడాడని నౌరు అధ్యక్షుడు ఆరోపించారు. దీని కి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

09/06/2018 - 02:00

సియోల్: అణు నిరాయుధీకరణపై చర్చించేందుకు వీలుగా దక్షిణ కొరియా రాయబారి నాయకత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బుధవారం పియాంగ్‌యాంగ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్‌తో భేటీ అయ్యారు. ఐదుగురు సభ్యులు కలిగిన దక్షిణ కొరియా బృందానికి ఆ దేశ అధ్యక్షుడు మూన్ జాయె-ఇన్‌కు సంబంధించిన ప్రత్యేక రాయబారి ఛుంగ్ ఎయి-యంగ్ నాయకత్వం వహించారు.

Pages