S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/21/2018 - 23:46

ఇస్లామాబాద్, ఆగస్టు 21: పాకిస్తాన్ ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి హాజరైన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూను శాంతిదూతగా ఇమ్రాన్‌ఖాన్ అభివర్ణించారు. సిద్ధూ వ్యవహారాన్ని తప్పుబడుతున్న వారిపై ఇమ్రాన్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. సిద్ధూను విమర్శించడం ద్వారా వీరంతా ఉపఖండంలో శాంతి విఘాతక చర్యలకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ అన్నారు.

08/21/2018 - 02:59

న్యూయార్క్‌లో నిర్వహించిన 38 ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, సినీనటులు కమల్‌హసన్, పూజా కుమార్, ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్.

08/21/2018 - 02:40

ఇస్లామాబాద్, ఆగస్టు 20: ఇరుగుపొరుగు దేశాలతో శాంతియుత చర్చలకు తాము ఎల్లపుడూ సిద్ధమేనని పాకిస్తాన్ కొత్త విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో పాక్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

08/21/2018 - 04:11

కొరియా ద్వీపకల్పం రెండుగా విడిపోయ దశాబ్దాలే గడిచింది. ఆ సమయంలో ఎక్కడి వారక్కడే ఉండిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత... అదీ వృద్ధాప్యంలో కలుసుకునే అవకాశం వారికి కలిగింది. ఈ కొరియన్ కుటుంబాల కలయక వారిలో ఎనలేని ఆనందాన్ని కలిగించింది. దక్షిణ కొరియాలో స్థిరపడ్డ జో హే-డో (86), జో డో-జి (75)లు సోమవారం ఉత్తర కొరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో గల ఓ రిసార్ట్‌లో కలుసుకున్నారు. వీరేకాదు..

08/20/2018 - 06:24

దుబాయ్, ఆగస్టు 19: దుబాయ్‌లో స్థిరపడిన కేరళ వ్యాపారులు కేరళలో వరద బాధితులను ఆదుకునేందుకు రూ.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. గల్ఫ్‌దేశాల్లో లక్షలాది మంది కేరళ ప్రజలు జీవనోపాధి నిమిత్తం ఉద్యోగాలు చేస్తున్నారు. కేరళలో ప్రకృతి విలయతాండవంపై వస్తున్న వార్తలు ఇక్కడి ప్రజలను కలచివేస్తున్నాయి. కేరళకు చెందిన వ్యాపార వేత్త యూసుఫ్ అలీ అనే వ్యక్తి రూ.50 మిలియన్లను విరాళంగా ప్రకటించారు.

08/19/2018 - 07:27

జడ్డా: పవిత్ర హజ్ యాత్ర నిమిత్తం ఇప్పటి వరకు 1.28 లక్షల మంది భారతీయ యాత్రికులు సౌదీ అరేబియాకు చేరారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఈ యేడాది మొత్తం 1,28,702 మంది భారతీయ యాత్రికులకు ప్రభుత్వం హజ్ కమిటీ ద్వారా యాత్రకు అవసరమైన వసతులను కల్పిస్తోంది.

08/19/2018 - 05:34

జకార్తా, ఆగస్టు 18: మినీ ఒలింపిక్స్‌గా విఖ్యాతి గాంచిన ఆసియా క్రీడలు ఈసారి జకార్తాలో అట్టహాసంగా మొదలయ్యాయి. 18వ ఏషియాడ్‌కు ఇండోనేషియా రాజధాని జకార్తాతోపాటు పాలెమ్‌బాంగ్ కూడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నది. శనివారం ప్రారంభమైన 18వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 2వ తేదీన ముగుస్తాయి. మొత్తం 45 దేశాలు, 40 క్రీడలకు సంబంధించిన 465 విభాగాల్లో పతకాల కోసం పోటీపడుతున్నాయి.

08/18/2018 - 05:27

ఖాట్మాండు, ఆగస్టు 17: నేపాల్‌లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర శిక్షా స్మృతిపై మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రభుత్వం కొత్త ఐపీసీని ప్రవేశపెట్టింది. దీని ఫ్రకారం గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ప్రచురించినా, ఆడియో రికార్డు చేసినా, అనుమతిలేకుండా ఫోటోలు తీసినా జైలుకు వెళ్లక తప్పదు.

08/18/2018 - 05:18

కరాచీ, ఆగస్టు 17: మనీ ల్యాండరింగ్ కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీపీపీ కోచైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీతోబాటు మరో 15మంది అనుమానితులను అరెస్టు చేసి విచారణ జరపాల్సిందిగా ఆ దేశానికి చెందిన ఓ బ్యాంకింగ్ కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను న్యాయస్థానం జారీచేసింది. నకిలీ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఈ కుంభకోణంలో 35 మిలియన్ రూపాయల ధనం మనీల్యాండరింగ్‌కు గురైందన్నది ఆరోపణ.

08/18/2018 - 05:17

ఇస్లామాబాద్, ఆగస్టు 17: పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెట్ స్టార్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి పదవి కోసం పీటీఐ పార్టీ తరఫున ఇమ్రాన్ ఖాన్, పీఎంఎల్ నవాజ్ పార్టీ నుంచి షాబాజ్ షరీఫ్ పోటీపడ్డారు. కాగా ఓటింగ్ సమయంలో పీపీపీకి చెందిన 54 మంది సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

Pages