S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

08/06/2018 - 01:11

లండన్, ఆగస్టు 5: భారత్‌లోని ఇంచుమించు సగం రాష్ట్రాలు శిశుమరణాల సంఖ్య తగ్గింపులక్ష్యం దిశగా ఏమాత్రం సాగడం లేదని ఒక నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలసిస్‌కు చెందిన జయంత్ బోర, నందిత సైకియా చేపట్టిన పరిశోధన అనంతరం ఈ విషయాన్ని తెలియజేశారు.

08/05/2018 - 05:23

ఇండోర్, ఆగస్టు 4: కిషోర్ కుమార్... పరిచయం అవసరంలేని పేరు... గాయకుడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కిషోర్ పాటలు వినని వారు లేరనడం అతిశయోక్తి కాదు. హిందీ రాని వారుకూడా ఆయన పాటలకు మైమరచిపోతారు. ఇక అర్థం కూడా తెలిసిన వారు కిషోర్ ఫిదా అవుతారు. పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి ఉన్నత శిఖరాలైనా అధిరోహించవచ్చని నిరూపించిన కిషోర్ ఎంతో మందికి మార్గదర్శకుడు. చదువులో అతని ప్రతిభ అంతంత మాత్రమే..

08/05/2018 - 05:24

ఐక్యరాజ్య సమితి, ఆగస్టు 4: ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆంక్షలను బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియా అణు ప్రయోగాలు, అణ్వస్త్ర తయారీని కొనసాగిస్తునే ఉంది. అంతేగాక, మారణాయుధాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నది. సముద్ర మార్గంలో పెట్రోలియం ఉత్పత్తుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నది. ఈ విషయాలను ఐరాస నిపుణుల నివేదిక బట్టబయలు చేసింది.

08/05/2018 - 05:28

వాషింగ్టన్, ఆగస్టు 4: భారత్‌కు వ్యూహాత్మక వాణిజ్య హోదా-1 గుర్తింపును ఇస్తూ అమెరికా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి. ఆసియాలో ఈ హోదాను పొందిన మూడవ దేశం భారత్. ఇంతవరకు జపాన్, దక్షిణ కొరియాకు వ్యూహాత్మక వాణిజ్య హోదా-1 (ఎస్‌టీఏ)ను మంజూరు చేసింద.

08/04/2018 - 22:45

బిష్‌కెక్, ఆగస్టు 4: కిర్గిస్తాన్‌తో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎర్లాన్ అబ్డీల్‌దాయెవ్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

08/04/2018 - 22:44

రాజ్‌సమంద్ (రాజస్తాన్), ఆగస్టు 4: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజస్తాన్‌లో పర్యటించకుండా ఇంట్లో కూర్చుని అభివృద్ధి జరగలేదంటూ విమర్శించడం తగదని, గ్రామాల్లో పర్యటించాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి నిరోధక పార్టీ అని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలంలో అధికారంలో ఉండి కూడా పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు.

08/04/2018 - 22:42

ఇస్లామాబాద్, ఆగస్టు 4: ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు హసన్, హుస్సేన్‌లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ దేశపు ఉన్నత అవినీతి నిరోధక విభాగం ఇంటర్‌పోల్‌ను కోరింది.

08/04/2018 - 22:41

శ్రీనగర్, ఆగస్టు 4: జమ్మూ-కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటనలో సాధారణ పౌరుడు ఒకరు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం కిలోరా ప్రాంతంలో ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులు పరస్పరం కాల్పులకు తెగబడ్డారు.

08/04/2018 - 04:54

న్యూఢిల్లీ, ఆగస్టు 3: అసోం జాతీయ పౌర రిజిస్టర్‌ను సాకుగా చూపించి దేశంలో మతకల్లోలాలు రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నాలను సహించే ప్రసక్తిలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను అడ్డుగా పెట్టుకుని మతసామరస్యతను దెబ్బతీసే శక్తుల ఆటలు కొనసాగనివ్వమని ఆయన స్పష్టం చేశారు.

08/04/2018 - 05:21

ఆస్తానా, ఆగస్టు 3: రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్-కజకిస్తాన్ నిర్ణయించాయి. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం ఇక్కడ కజకిస్తాన్ ప్రభుత్వాధినేతలతో భేటీ అయ్యారు. కజక్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఈ సందర్భంగా సుష్మా స్పష్టం చేశారు. వాణిజ్యం, ఇంధనం, భద్రత, ఐటీ రంగాలకు సంబంధించి ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి.

Pages